Kodandarama Swamy: కన్నుల పండువగా శ్రీ కోదండరాముని రథోత్సవం
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి (Kodandarama Swamy) ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది.

శనివారం ఉదయం 10.30 నిమిషాలకు స్వామివారి రథోత్సవం (Vontimitta Rathostavam) ప్రారంభం అయింది. ఉదయం నుంచి భక్తులు ఈ వేడుక కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
- ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts

ఒంటిమిట్ట ఆలయ పరిసరాలు శ్రీరామ నామ స్మరణతో మార్మోగాయి.

గ్రామ వీధుల్లో శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామ స్వామి (Lord Rama) రథాన్ని అధిష్టించారు. గ్రామ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తూ విహరించారు.

కళాకారులు, భక్తుల కోలాటాల మధ్య రథోవత్సం ఉత్సహం, ఆధ్యాత్మిక శోభతో ముందుకు సాగింది. స్వామివారికి అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించారు.

హిందూ ధర్మంలో రథానికి అత్యంత విశిష్టత ఉంది. ఆత్మను రథికుడిగా, శరీరమే రథంగా, బుద్ధిని సారథిగా భావించి దాని పగ్గాలు మనసు చేతిలో ఉన్నాయని గుర్రాలను ఇంద్రియాలుగా భావించి విషయాలు అనే వీధులో విహారం జరుపుతారు.

ఇలా శరీరాన్ని రథంతో పోల్చడం వెనక స్థూల శరీరం వేరు అని, ఆత్మ దానికి మరింత భిన్నమనే ఆత్మానాత్మ వివేకం అనుభవం కలుగుతుంది. రథోత్సవం వెనక ఉన్న అసలైన తర్కం ఇదే.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.