హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Days Hyderabad Practical Tour
2 రోజుల్లో హైదరాబాద్ మొత్తం పూర్తవదు. కానీ ఇక్కడి వైబ్‌ను ఫీల్ అవ్వవచ్చు. ఈ 2-Days Hyderabad Practical Tour అనేది హడావిడి లేకుండా, ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా, నిజంగా వర్కవుట్ అయ్య ప్లాన్.
ముఖ్యాంశాలు
ఈ బ్లాగ్‌లో
- టాప్ 10 తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు
- క్షణం కూడా వేస్ట్ కాకుండా అన్నీ కవర్ చేద్దాం
- టూరిజాన్ని ప్రమోట్ చేద్దాం, ఇరగదీద్దాం అనే..
అంశాలు ఏమీ ఉండవు. ఇది నిజంగా ఒక సింపుల్, ప్రాక్టికల్‌గా వర్కౌట్ అయ్యే ప్లాన్.
ఈ ప్లాన్ ఎవరికి ఉపయోగపడుతుంది? | Who Can Use This Plan
ముందుగా ఇది సింపుల్ & ప్రశాంతంగా పర్యటించాలనుకునే వారికి సెట్ అవుతుంది.
- ఫస్ట్ టైమ్ హైదరాబాద్ వచ్చిన వారికి
- ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సిటీ తిరగేద్దాం అనుకున్నవారికి
- వీకెండ్లో భాగ్యనగరం అన్వేషించాలి అనుకునేవారికి
- క్రౌడ్, ట్రాఫిక్, రద్దీగా ఉండే ప్రాంతాలను అవాయిడ్ చేయాలి అనుకునేవారికి
- ఇది కూడా చదవండి : Hyderabad లో తప్పకుండా వెళ్లాల్సిన Top 7 Best Family Parks – Entry Fee, Timings & Complete Guide
నిజాలు మాట్లాడుకుందాం | Hyderabad Tour Reality
హైదరాబాద్ ట్రిప్ ప్లాన్ చేయడానికి ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
- హైదరాబాద్‌లో ట్రాఫిక్ (Hyderabad Traffic) కష్టాలు ఉంటాయి.
- దగ్గరగా అనిపించే ప్రదేశాలకు కూడా టైమ్‌కి వెళ్లలేకపోవచ్చు.
- కొన్ని సార్లు 5 కిమీ ప్రయాణానికి 45 నిమిషాలు కూడా పట్టవచ్చు.
సో…
ఢిల్లీ, బెంగళూరు (Bengaluru) ట్రాఫిక్ మీకు అలవాటు అయితే — హైదరాబాద్ ట్రాఫిక్‌కు మీరు సింక్ అవుతారు.
విజయవాడ (Vijayawada) ట్రాఫిక్కే మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే — హైదరాబాద్ ట్రాఫిక్ మీకు కాస్త ఎక్కువగా అనిపించవచ్చు. ఈ నిజాన్ని ఫేస్ చేద్దాం.
- ఇది కూడా చదవండి : జూపార్క్‌కు వెళ్లే ముందు ఇవి తెలియకపోతే టైమ్ వేస్ట్ అవుతుంది | Hyderabad Zoo Entry Fee ,Timings
తక్కువ తిరుగుదాం. ఎక్కువ ఎంజాయ్ చేద్దాం. ట్రావెలింగ్ అంటే ఇదే కదా.
I love Hyderabad — చేప నీటిని లవ్ చేసినంత.
అందుకే ఉన్నది ఉన్నట్టే చెప్పేశాను.
ఎందుకంటే ప్రేమించడం అంటే నిజాలు దాచడం కాదు.
తప్పు-ఒప్పులను సమంగా తీసుకోవడం.
మొదటి రోజు | Day 1 in Hyderabad
1.చార్మినార్, పాతబస్తీ | Charminar & Old City Walk
హైదరాబాద్‌లో మొదటి రోజు మనం ఓల్డ్ సిటీ నుంచే ప్రారంభిద్దాం. ముందుగా మార్నింగ్ టైమ్‌లో చార్మినార్, పరిసర ప్రాంతాల్లో సిటీ వాక్ చేద్దాం. ఎందుకంటే—
- ఎక్కువ రద్దీ ఉండదు
- షాపు వాళ్లే లేట్‌గా వస్తారు
- ఉదయం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది
- మంచి ఫోటోలు తీసుకోవచ్చు
- మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది
- భాగ్యలక్ష్మీ అమ్మవారి (Hyderabad Bhagyalakshmi Mata Temple) దర్శనం కూడా అవుతుంది
- ఇది కూడా చదవండి : ఈ ఆదివారం ఖాళీనా? Hyderabad దగ్గర ఈ 6 ప్లేసులు మిస్ అవ్వకండి ! 6 Weekend Destinations

మరో విషయం ఏంటంటే —
చార్మినార్‌ను దూరం నుంచి చూసినా సరిపోతుంది. పైకి ఎక్కాలంటే ఎక్కొచ్చు.
కానీ నా అభిప్రాయం ఏమిటంటే చార్మినార్ చూడటం కన్నా పాతబస్తీ వీధుల్లో (Old City Walk) వాక్ చేయడం ఇంపార్టెంట్.
- Walking వల్ల అక్కడి నిర్మాణాలు, ప్రజల తీరుతెన్నులు అర్థం అవుతాయి.
- Mecca Masjid పరిసరాల్లో వాక్ చేస్తూ నిర్మాణాలను గమనించవచ్చు.
- పక్కనే ఉన్న Laad Bazaar లో మెల్లిగా నడుచుకుంటూ వెళ్లండి.
షాపింగ్ చేయాలని, అన్నీ కవర్ చేయాలని అనుకోకండి. జస్ట్ చూస్తూ వెళ్లిపోండి.
- టైమ్: గంటన్నర నుంచి 2 గంటలు
- ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లో 7 Must-Visit Cafes – కాఫీ, డెజర్ట్స్ & Weekend Vibes కలిసిన కాంబో
2. చౌమహల్లా ప్యాలెస్ | Chowmahalla Palace
చార్మినార్ నుంచి చౌమహల్లా ప్యాలెస్ కేవలం 1 కిమీ దూరం మాత్రమే.
“Bhaiyya, Chowmahalla Palace kaisa jana?” అని అడుగుతూ జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లొచ్చు.
లేదంటే ఆటోలో వెళ్లొచ్చు.
- హైదరాబాద్ చరిత్ర (History) మొత్తం ఈ ప్యాలెస్‌లో కనిపిస్తుంది
- ఎంత తిరిగినా అలసినట్టు అనిపించదు
- క్లీన్‌గా, చాలా ఆర్గనైజ్డ్ ప్లేస్
- టైమ్: 60 – 90 నిమిషాలు
లంచ్ టైమ్ | 2-Days Hyderabad Practical Tour
హైదరాబాద్‌లో లంచ్ అంటే చాలా పెద్ద పెద్ద ప్లానింగ్ చేస్తుంటారు.
అంతగా ఆలోచించకండి.
- ఓల్డ్ సిటీ లో సింపుల్ బిర్యానీ (Biryani) లేదా మీల్స్ లభిస్తాయి
- లంచ్ టైమ్‌లో రష్ ఎక్కువగా ఉంటుంది
- అందుకే లంచ్ ముందే ప్లాన్ చేసుకోండి
బిర్యానీ కోసం సిటీ మొత్తం క్రాస్ చేయాల్సిన అవసరం లేదు.“Bhaiyya, idhar best biryani kidhar milta?” అని పాన్‌డబ్బా వ్యక్తిని అడగండి. టైమ్ వేస్ట్ అవ్వదు.
- ఇది కూడా చదవండి : Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి
3.సాలార్ జంగ్ మ్యూజియం | Salar Jung Museum
లంచ్ తరువాత సాలార్ జంగ్ మ్యూజియం వెళ్లడం బెస్ట్.
- వరల్డ్ క్లాస్ కలెక్షన్
- కొన్ని గ్యాలరీల్లో AC
- ప్రశాంత వాతావరణం
- మధ్యాహ్నం ఎండ నుంచి తప్పించుకునేందుకు మంచి ప్లేస్.
- మాక్సిమం 2 గంటలే ఉండేలా ప్లాన్ చేయండి.
- అన్నీ చూడాలని ట్రై చేయకండి.
4.ట్యాంక్ బండ్ | Tank Bund / Hussain Sagar
ట్యాంక్ బండ్‌ను హుస్సేన్ సాగర్ అని కూడా పిలుస్తారు. సాయంత్రం సమయంలో ఇక్కడికి వెళ్లి సూర్యాస్తమయాన్ని చూడవచ్చు.
- సిటీ లైట్స్
- పిల్లల ఆటపాటలు
- ఒకరితో ఒకరికి సంబంధం లేని జనం
- ఐస్ క్రీమ్, మక్కబుట్టలను తీసుకుని సరదాగా వాకింగ్ చేయడం.
- ఇది కూడా చదవండి : Street Food : హైదరాబాద్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే
సాగర్ చుట్టూ ఫుట్‌పాత్ ఉంటుంది. మీకు నచ్చినంత సేపు నడవండి. టైమ్ ఉంటే. Prasad IMAX సచివాలయం మధ్యలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం చూడండి.
(దూరం నుంచైనా సరే — 175 ఫీట్లు ఉంటుంది)
దీనికి మీకు 50 నిమిషాలు సరిపోతుంది
Day 1 Reality
మొదటి రోజు 4 డెస్టినేషన్స్ మాత్రమే అంటే తక్కువ అనిపించవచ్చు. కానీ 4 ప్రదేశాలు సరిపోతాయి. బుల్లెట్ ట్రైన్‌లా తిరిగే అవసరం లేదు. రెండవ రోజుకు ఎనర్జీ సేవ్ అవుతుంది.
రెండవ రోజు | Day 2 in Hyderabad

5. గోల్కొండ కోట | Golconda Fort
రెండవ రోజు మార్నింగ్ గోల్కొండ కోట ప్లాన్ చేయండి. ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే — ఆ రోజు వదిలేయండి.
- పొద్దున్నే మెట్లు ఎక్కడం సులభం
- లేట్ అయితే వేడి + జనం పెరుగుతారు.
- బ్యూటిఫుల్ వ్యూ దొరుకుతుంది
- ఫ్రెష్ మైండ్‌తో గోల్కొండ చరిత్ర అర్థం అవుతుంది
- టైమ్: సుమారు 2 గంటలు (కొంచెం ఎక్కువైనా OK)
- ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లో అదిరిపోయే కొరియన్ రుచులు.. ఐటీసీ వద్ద రూ.200కే నోరూరించే స్ట్రీట్ ఫుడ్
లంచ్ | రెస్ట్
గోల్కొండ తరువాత దగ్గర్లో ఎక్కడైనా లంచ్ చేసి, కాసేపు రెస్ట్ తీసుకోండి.
“నాకు బ్రేకులు అవసరం లేదు” అనుకుంటే —
మిగతా ప్లాన్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది.
6.మ్యూజియం / మీ ఛాయిస్
మీ ఇంట్రెస్ట్ బట్టి:
- బిర్లా ప్లానెటేరియం
- స్టేట్ ఆర్ట్ గ్యాలరీ
- HITEC City ఏరియా వాక్
- ఇరానీ టీ తాగడం, బేకరీలో దిల్కుష్, దిల్ పసంద్ ట్రై చేయండి
- ఇవి చిన్నగా అనిపించవచ్చు.కానీ ఇలాంటి డిఫరెంట్ ఐడియాలే ట్రిప్‌ను కంప్లీట్ చేస్తాయి.
ఈ యాక్టివిటీస్ కోసం గంట నుంచి గంటన్నర టైమ్ పడుతుంది.
- ఇది కూడా చదవండి : క్లీనర్ నుంచి భారత్‌లోనే అతిపెద్ద టీ కేఫ్ పెట్టేవరకు కేఫ్ నీలోఫర్ ఫౌండర్ కథ | Hitech City Cafe Niloufer
7. దుర్గం చెరువు | Durgam Cheruvu & Cable Bridge
హైదరాబాద్‌లో మరో కోణం చూడాలి అనుకుంటే దుర్గం చెరువు మీకు బాగా సెట్ అవుతుంది. ఇది చెరువు చుట్టూ ఉన్న ఒక బ్యూటిఫుల్ పార్క్. కొంచెం న్యూ యార్క్ వైబ్ (New York Vibe) వస్తుంది.
- మోడరన్ హైదరాబాద్ ఫీల్
- కేబుల్ బ్రిడ్జ్ వ్యూ
- చెరువు చుట్టూ పార్క్ ఉంటుంది.
- బోటింగ్, వాకింగ్ చేయవచ్చు.
ఎక్కువ ఫోటోలు తీసుకునే ప్రయత్నం చేయకండి. 1–2 చాలు. మైండ్‌లో క్యాప్చర్ చేసుకోండి. అప్పుడప్పుడు గుర్తు చేసుకోండి. ఇక్కడ మీరు 45 నిమిషాలు స్పెండ్ చేసుకోండి.
డిన్నర్ | Hyderabad Dinner Tip
రాత్రి పడితే మంచి డిన్నర్ స్పాట్ కోసం వెతకడం సహజం. కానీ హడావిడి లేకుండా, మీరు ఉంటున్న హోటల్ దగ్గరే డిన్నర్ చేసేయండి. ట్రాఫిక్‌లో డిన్నర్ స్పాట్ల కోసం హంటింగ్ చేయకండి. అది మీ మూడ్‌ను స్పాయిల్ చేస్తుంది.
ఈ 2 రోజుల్లో ఇక్కడికి వెళ్లకండి | Don’t Visit in 2 Days Trip
ఇలా చెప్పితే నచ్చకపోవచ్చు కానీ నిజం ఇది:
- Ramoji Film City
- Zoo Park
- సిటీకి దూరంగా ఉన్న ఆలయాలకు
- మీకు నచ్చిన సినిమాకు టూర్లో ఉన్నప్పుడు వెళ్లకండి.
ఎందుకంటే , Zoo + Museum + Golconda వరుసగా కవర్ చేస్తే చాలా అలసిపోతారు. ఇంటికి వెళ్లాక వారం రోజులు పడుతుంది పూర్తిగా రికవరీ.
“ఇంత దూరం వచ్చాం కదా…” అనే ఆలోచనకి పుల్ స్టాప్ పెట్టండి.
టూర్ అనేది జాబ్ కాదు. కాంట్రాక్ట్ కాదు.
అది Pure Fun కోసం.
నా సలహా Prayanikudu Honest Take
2-Day Hyderabad Practical Tour : “2 రోజుల్లో హైదరాబాద్ మొత్తం చూపిస్తాం” అని ఎవరైనా అంటే , అది స్కామ్. సొరచేప కూడా సముద్రాన్ని రెండు రోజుల్లో ఈదలేదు. 2 రోజుల్లో ఫినిష్ చేయలేం. కానీ ఫీల్ అవ్వగలం.
ప్రశాంతంగా ట్రిప్ (Trip) పూర్తి చేయండి. మిగిలినవి మరో ట్రిప్‌లో కవర్ చేయొచ్చు. మంచి మెమోరీస్తో తిరిగి వెళ్లాలంటే ప్రతి క్షణాన్ని ఫీల్ అవ్వడం ఇంపార్టెంట్.
👉 Travel Without Mistakes అనేది ప్రయాణికుడు థీమ్. అందుకే ఇప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్లే ముందు
Prayanikudu.com చెక్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
