Weird Food : ప్రపంచంలోనే అత్యంత వికారమైన 5 ఆహార పదార్థాలు
Weird Food : కొన్ని ఫుడ్ ఐటమ్స్‌ను చూస్తే లొట్టలేసుకుని తినాలనిపిస్తుంది. మరికొన్నింటిని చూస్తే చెప్పులేసుకుని పారిపోవాలనిపిస్తుంది. అలా చెప్పులేసుకుని పారిపోయేలా చేసే వింతైన 5 ఆహార పదార్థాలు ఇవే.
5. నల్ల గుడ్డు కథ
Century Egg, China
చైనా వాళ్ల ఆహార అలవాట్ల గురించి ప్రపంచం మొత్తానికి తెలిసిందే కదా. మనం ఊహించడానికే ఇష్టపడని విధంగా ఉంటాయి వారి ఆహారపు అలవాట్లు, వారి డిషెస్. ఉదాహరణకు ఈ డిష్‌నే చూడండి.
ఇక్కడ నల్లగా తళతళా కనిపిస్తున్న వస్తువేంటో తెలుసా? అది కోడి గుడ్డు. దీనిని సెంచరీ ఎగ్ అని అంటారు. మరి ఇలా ఎందుకు ఉంది అనుకుంటున్నారా ?
చైనాలో గుడ్లను నల్గా మారేంత వరకు కొన్ని వారాల పాటు అలాగే ఆల్కలైన్ మిక్చర్ లేదా ఇతర పదార్థాలతో కలిపి ప్రిజర్వ్ చేసి ఉంచుతారు.ఇక అవి నల్లగా జెల్లీలాగా మారాక వాటిని పోటీ పడి మరి తినేస్తారు. ఇలా ఎందుకు చేస్తారో మీలో ఎవరికూనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ గుడ్లకు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా డిమాండ్ కూడా పెరుగుతోంది.
ఈ కంటెంట్ షార్ట్ వర్షన్ చూడండి
4. ఫ్రైడ్ తారంతులాస్…సాలీడుల స్నాక్స్
Fried Tarantulas, Cambodia
సాలీడు మనపై పడితేనే చిరాకు పడతాం. విదిలించి పక్కన పంపించేస్తాం. అలాంటిది కంబోడియాలో వీటిని స్నాక్ లాగ తింటారట. విడ్డూరంగా ఉండది కదా.

వల్లంతా జుట్టున్న తారంటులా అనే పెద్ద స్పైడర్లను క్రిస్పీ ఫ్రై చేసుకుని తినేస్తారు కంబోడియా వాళ్లు. దీనికే వాక్ అని ఫీల్ అవుతున్నారా…అయితే నెక్ట్స్ ఐటం గురించి తెలుసుకుంటే…
- ఇది కూడా చదవండి : ఇలా కనిపించి అలా మాయం అయ్యే 5 ఆలయాలు
3.బాలుత్, ఫిలిఫ్పిన్స్
Balut, Philippines : బాతులను చూస్తుంటే ముద్దేస్తుంది. అలాంటి బాతు పిల్లను చూస్తే కూచి కూచీ అని ముద్దాడాలనిపిస్తుంది. కానీ ఫిలిఫ్పిన్స్‌లో మాత్రం ఏ క్షణమైనా బయటికి రావడానికి సిద్ధంగా బాతుపిల్లను అది బయటికి రాకముందే ఉడకబెట్టి తినేస్తారు.
ఇక ఈ దారుణం గురించి నేను ఎక్కువగా రాయాలి అనుకోవడం లేదు. అయితే ఇది మనీలా అనే ప్రాంతంలో బాగా పాపులర్ డిష్ అని తెలుస్తోంది.
# 2. కాసు మర్జూ తెల్ల పురుగుల ఛీజ్
Casu Marzu, Italy : యూరోపియన్లకు ఛీజ్ అంటే చాలా ఇష్టం. ఎంతంటే ఇక్కడ దొరికే కాసు మర్సా అనే చీజ్‌ను చిన్నా, తెల్లని పురుగులు కనిపిస్తున్నా తినేస్తుంటారు. ఈ పురుగులు లేదా లార్వాలు (Maggots) ఛీజ్ ఫెర్మెంటేషన్లో ఉపయోగపతాయంటారు. దీనిని యూరోపియన్ యూనియన్ బ్యాన్ చేసినా నేటికీ చాలా మంది ప్రిపేర్ చేస్తుంటారు.
ఆ ఫోటో నేను చూపించలేను కావాలంటే మీరే గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. లేదా వికీపిడియాలో చదవి చూడండి.
#1. హాకర్ల్, ఐస్లాండ్
Hakarl, Iceland : ప్రపంచం మొత్తం యుద్ధంలో ఉన్నాసరే ఐస్లాండ్లో ప్రజలు చాలా ప్రశాంతంగా ఉంటారు. వారికి సముద్ర జీవులు బతికి ఉన్నా ఎలా ఉన్నా తినడం అలవాటు చేసుకున్నారు. అలాంటిదే ఈ డిష్.
ఈ డిష్ పేరు హాకర్ల్. బేసిక్‌గా ఇది పాడైన షార్క్ మాసంతో తయారవుతుంది. దీనిని ఫెర్మెంటెడ్ గ్రీన్ ల్యాండ్ షార్క్ డిష్ అని కూడా అంటుంటారు. పైగా దీనిని నుంచి విపరీతమైన అమోనియా వాసన కూడా వస్తుందట. మరి ఎలా తింటారో ఏమో.
పైగా దీనిని వండటానికి ముందు 6 నుంచి 12 వారాల వరకు భూమిలో కప్పి పెడతారట. తరువాత ఏడాది పాటు ఆరబెట్టి తరువాత వండేస్తారు.
ఇందులో ఏ ఫుడ్ మీరు ట్రై చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ట్రావెల్ , ఫుడ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్రయాణికుడు ఛానెల్ ఫోలో అవ్వండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.