Monalisa Bhosle : కుంభ మేళాలో దండలమ్మే అమ్మాయిని జనం ఎంతలా ఇబ్బంది పెట్టారంటే…

షేర్ చేయండి

Monalisa Bhosle : అందంతో సెస్సేషన్‌గా మారిన తేనె కళ్ల చిన్నది . ఇప్పుడు అభిమానులు చేస్తున్న పనులకు పరేషాన్ అవుతోంది. కుంభ మేళాలో దండలు అమ్మే మోనాలిసాను స్థానికులు ఎంతగా ఇరిటేట్ చేశారంటే ఆమె తండ్రి ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఎవరీ మోనాలిసా భోంస్లే | Who Is Monalisa Bhosle

కుంభ మేళాలో మాలలు అమ్మే ఒక అమ్మాయి సోషల్ మీడియా గత కొన్ని రోజులుగా బాగా ట్రెండ్ అవుతోంది. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా భోంస్లే ( Monalisa Bhosle ) తన అందంతో, తేనెకళ్లతో చాలా మంది మనసు కొల్లగొట్టింది. అయితే ఒక అందమైన కథలా మొదలైన మోనాలిసా స్టోరీ పీడకలగా మారిపోయింది. ఒక ఈవెంట్‌లో మోనాలిసా వీడియోను రికార్డు చేసి షేర్ చేసి షేర్ చేశాడు ఒక ఇన్‌ఫ్లుయెన్సర్. అలా మోనాలిసా ప్రయాణం మొదలైంది. ఈ వీడియో స్పాంజి నీటిని ఎంత వేగంగా పీల్చుకుంటుందో అంతే వేగంగా వైరల్ అయింది. దీంతో అమె రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది.

కొనేవారి కన్నా సెల్పీలు తీసుకొనేవారే ఎక్కువ

కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025) పవిత్ర స్నానం చేయడానికి , ప్రయాగ్‌రాజ్ విశిష్టతలు ( Prayagraj ) , చరిత్ర తెలుసుకోవాలని వెళ్లిన వారికి మోనాలిసా గురించి తెలిసింది. దగ్గరే కదా ఒకసారి చూద్దాం అని చాలా మంది ఆమె వద్దకు వెళ్లడంతో అసలు కథ మొదలైంది. చాలా మంది ఆమె అనుమతి లేకుండా పోటోలు తీయడం, వీడియోలు రికార్డు చేయడం ప్రారంభించారు.

పూసల దండలు, మాలలు అమ్మడానికి కుటుంబంతో కలిసి కుంభ మేళా వచ్చింది మోనాలిసా. కానీ తన దగ్గరికి దండలు కొనేవారి కన్నా సెల్పీలో తీసుకొనేవారే ఎక్కువగా రావడం మొదలు పెట్టారు. మోనాలిసా షార్ట్ ‌టైమ్‌లో ఎంతగా పాపులర్ అయిందంటే ఆ పాపులారిటీ తనను ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. ఆమె తల్లిదండ్రులు, తోటివారు అక్కడికి వస్తున్న వారి నుంచి మోనాలిసాను రక్షించేందుకు ముఖానికి శాలువ కప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

అందం తెచ్చిన ఆపద | Monalisa Bhosle Viral Video

ఈ వీడియోలో ఎర్ర రంగు సల్వార్‌లో కనిపిస్తున్న మోనాలిసా తనకు దగ్గరిగా వస్తోన్న గుంపు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రశాంతంగా ఆమె పని అమెను చేసుకోనివ్వకుండా అలా డిస్టర్బ్ చేయడంతో ఆమె కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. ఇదంతా ఏంటో అర్థం చేసుకోలేక షాక్‌లో తన ముఖాన్ని దుపట్టాతో కవర్ చేసుకుంది మాలలు అమ్మే ఈ సాధారణ అమ్మాయి. ఈ గందరగోళం నుంచి తనను బయటపడేసేందుకు ముసుగు కప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు.

గమనిక : పై ట్వీట్టర్ ఖాతా అధికారిక ఖాతా అని అనిపించడం లేదు. కేవలం వీడియో కోసం లింక్ ఇక్కడ పోస్ట్ చేశాను.

గుర్రుమంటున్న నెటిజెన్లు | Netizens on Monalisa Bhosle Video

Monalisa Bhosle
| Photo : X.com

మోనాలిసాకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది.నెటిజెన్లు ఈ వీడియోపై కామెంట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక అమ్మాయి ఇంత ఇబ్బంది పడుతోంటే స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు కొందరు.

  • ఈ అమ్మాయిని ప్రశాంతంగా ఉండనివ్వండి. అనవసరంగా ఇబ్బంది పెట్టకండి అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
  • అమాయకమైన అమ్మాయిని అంత మంది ఇబ్బంది పెట్టడంపై మరో యూజర కామెంట్ చేస్తూ “ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో వీారికి తెలియదు. వీళ్లకు ఏ మాత్రం సిగ్గులేదు” అని కామెంట్ చేశాడు మరో యూజర్.
  • ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు

మారిన బతుకులు

ఎవరైనా పాపులర్ అయితే ఆదాయం పెరుగుతుంది. కానీ మోనాలిసా పాపులారిటీ వల్ల ఉన్న ఆదాయాన్ని కూడా కోల్పోయింది. కుంభ మేళా సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనుకున్న ఆ కుటుంబం ఆశలపై నీళ్లు చల్లింది ఈ పాపులారిటి. మాలలు, దండలు కొనే వారికన్నా ఎక్కువ మంది ఫోటోలు వీడియోల కోసం రావడం,వారి నుంచి కూతురును కాపాడేందుకే సమయం సరిపోకపోవడంతో…మోసాలిసా తండ్రి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

తనను కుంభమేళా నుంచి ఇండోర్ పంపించేశాడు. ఇదే విషయాన్ని మోనాలిసా సోదరి విద్యా కన్‌ఫర్మ్ చేస్తూ “ప్రతీ క్షణం మోసాలిసాను జనం ఫాలో అయ్యేవాళ్లు.దీంతో తను దండలు అమ్మడంపై ఫోకస్ చేయలేకపోయింది” అని తెలిపింది.

మోనాలిసాకు సినిమా ఛాన్స్ | Movie Offer to Monalisa Bhonsle

తనకు వచ్చిన పాపులారిటీని గమనించి సోషల్ మీడియాలో తన అప్డేట్స్ పోస్ట్ చేస్తోంది మోనాలిసా. ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఒక ఎకౌంట్ తెరిచి ( Monalisa Bhonsle Instagram ) అందులో తన ప్రయాణం గురించి విషయాలను నెటిజెన్లతో పంచుకుంటోంది. తనతో పాటు దండలు అమ్మే వారి గురించి, తన పాపులర్ ఇంటర్వ్యూ బిట్స్, తన వైరల్ వీడియోలతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి బర్త్‌డే సెలబ్రేట్ చేయడం వంటి వీడియోలను పోస్ట్ చేస్తోంది.అయితే తను వైరల్ అవడం వల్ల బాగా డబ్బు సంపాదించాను అని వస్తున్న వార్తలు అవాస్తవం అని తెలిపింది మోనాలిసా…

2025 లో కుంభ మెళాతో మొదలైన మోనాలిసా జర్నీలో హైలైట్ ఏంటంటే తనకు ఒక బాలీవుడ్ మూవీ ఆఫర్ కూడా వచ్చింది.ముంబైకు చెందిన సనోజ్ మిశ్రా( Sanoj Mishra ) అనే దర్శకుడు తన నెక్ట్స్ మూవీలో మోనాలిసాకు లీడ్ రోల్ ఇవ్వనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Prayanikudu WhatsApp2
| ప్రయాణికుడు వాట్సాప్ గ్రూపులో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!