భారతదేశ ప్రజా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. ముంబై - అహ్మదాబాద్‌ను కనెక్ట్ చేసే తొలి బుల్లెట్ ట్రైన్ ( India's Fastest Train ) త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేవలం 2 గంటల్లోనే 508 కిమీ దూరం ప్రయాణించడం సాధ్యం అవుతుంది.

గంటకు 254 కిమీ వేగంతో ఈ ట్రైన్ దూసుకెళ్లి ప్రయాణ వేగంలో సరికొత్త శకానికి నాంది పలకనుంది ఈ షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్. అయితే ఇది మినిమం స్పీడు మాత్రమే.
ముఖ్యాంశాలు
షింకాన్సేన్ బులెట్ ట్రైన్ | What is Shinkansen bullet train
జాపాన్‌లో ( Japan) బుల్లెట్ రైలును షింకాన్సేన్ అని కూడా పిలుస్తుంటారు. అత్యధిక వేగం , ఖచ్చితమైన సమయపాలన, సురక్షిత ప్రయాణం, సమర్థతకు పర్యాయపదంగా మారింది షింకాన్సేన్. ఈ రైళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాకులపై ఇవి గంటకు 320 కిమీ వేగంతో ప్రయాణిస్తాయి. దీని వల్ల ప్రజలు తక్కువ సమయంలోనే ఎక్కువ దూరాన్ని కవర్ చేయగలరు.

జపాన్‌లోని టోక్యో ( Tokyo ), ఒసాకా, క్యోటో ( Kyoto ) వంటి ప్రముఖ నగరా మధ్య బుల్లెట్ ట్రైన్స్ నడుస్తున్నాయి. భారత దేశంలో కూడా ప్రజా రవాణా రంగంలో మార్పులు తీసుకురావడానికి జపానీస్ షింకాన్సేన్ సాంకేతికతను వాడుతున్నారు. అక్కడి రైల్వే సిస్టమ్‌ను మోడల్‌గా తీసుకుని భారత్‌లో బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ ( Indian Bullet Train Network ) డెవలెప్ చేయనున్నారు.
- ఇది కూడా చదవండి : ఏంటి జపాన్ మరీ ఇంత శుభ్రంగా ఉంటుందా ? | తెల్ల సాక్సులతో నడిచిన వ్లాగర్
అయితే భారత బుల్లెట్ ( India’s Fastest Train ) ట్రైనుకు, జపనీస్ బుల్లెట్ ట్రైనుకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. రెండూ కూడా వేరువేరు రైల్వే నెట్‌వర్క్‌లు. మన బుల్లెట్ ట్రైన్లను మన దేశంలోనే తయారు చేస్తారు. అయితే ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇరు దేశాల మధ్య సాంకేతికతను మాత్రమే పంచుకోనున్నారు.
ఒకసారి జపాన్ బుల్లెట్ ట్రైన్ వేగం చూడండి
Japonya'nın süper hızlı treni, Bullet.
— Biliyor Muydunuz (@bilio_muydunuz) February 6, 2018
hız: 603 km/h
(490+ km hızı geçtiğinde manyetik raylardaki mıknatıslar sayesinde raylara teması tamamen kesilir ve bir nevi havadan gider) pic.twitter.com/63dmOpifir
ఈ ప్రాజెక్టులో ముఖ్యాంశాలు | Key Highlight Of The Indian Bullet Train
- అత్యధిక వేగం ( Speed of Bullet Train ) : ఈ ట్రైను అత్యధికంగా గంటకు 280 కిమీ వేగంతో ప్రయాణించనుంది. దీంతో కనీసం 6-7 గంటల ప్రయాణ సమయం మిగలనుంది.
- ప్రాజెక్ట్ టైమ్‌లైన్ :ముంబై – అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ( MAHSR ) కారిడార్ వచ్చేసి 2026 లోపు పూర్తి అవనుంది.
- ముందుగా స్థానికంగా తయారు చేసిన రెండు ట్రైన్లను నడపనున్నారు.
ప్రాజెక్ట్ కాస్ట్ | Indian Bullet Train Cost
ఒక్క బుల్లెట్ ట్రైన్ ( India’s Fastest Train ) ధర వచ్చేసి రూ.27.68 కోట్లు. పూర్తి కాంట్రాక్ట్ విలువ రూ.866.87 కోట్లు. ఇందులో ట్రైను డిజైన్, డెవలెప్మెంట్, టెస్టింగ్, మౌళిక సదుపాయాల కల్పన భవిష్యత్తులో హై స్పీడ్ రైలు కోసం గ్రౌండ్ వర్క్ చేయడం మొదలైనవి ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి.
విప్లవాత్మక సాంకేతికత | Indian Bullet Train Technology
ప్రధాన మంత్రి మోదీ ప్రారంభించిన “మేక్ ఇన్ ఇండియా” ( Make In India ) కార్యక్రమంలో భాగంగా ఈ బుల్లెట్ ట్రైన్లు యూరోపియన్, భారతీయ, జపానీస్ టెక్నాలజీతో సిద్ధం కానున్నా.
- ఈ ట్రైను గరిష్ట వేగం : గంటకు 350 కిమీ
- ఆపరేషనల్ వేగం : గంటకు 320 కిమీ
- కనిష్ఠ వేగం : గంటకు 250 కిమీ
- ప్రస్తుతం భారత్‌లో అత్యంత వేగంగా నడుస్తున్న ట్రైన్ వచ్చేసి వందే భారత్ ట్రైన్ ( Vande Bharat Express – Train 18 (22439 ) . దీని వేగం గంటకు 180 కిమీ.
- అంటే బుల్లెట్ ట్రైన్ మినిమం స్పీడుకు వందే భారత్ మ్యాగ్జిమం వేగానికి మధ్య గంటకు 70 కిమీ గ్యాప్ ఉంది.
ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
సౌకర్యవంతమైన ప్రయాణం | Passenger Comfort in Bullet Train India
ఈ మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్లు ( Made In India Bullet Trains ) స్పీడుగా వెళ్లడంతో పాటు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాన్ని కూడా కల్పిస్తాయి. ఈ రైళ్లలో ఏసీ చైర్ కార్స్, రిక్లైన్ అయ్యే ( వెనక్కి ఒరిగే ) చెయిర్స్ ఉంటాయి. దీంతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్నవారికోసం తగిన ఏర్పాట్లు, వినోదం కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయి.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు
ప్రపంచంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ | First Bullet Train In World
జపాన్ వాళ్లకు బుల్లెట్ ట్రైన్ ఐడియా 1957 లో వచ్చింది. తొలి బుల్లెట్ ట్రైన్, దీనిని షింకాన్సేన్ అని కూడా పిలుస్తారు, ఇది 1964 లో ప్రారంభం అయింది. ఇది జపాన్ రవాణా వ్యవస్థను మాత్రమే కాదు ( First Bullet Train In Japan ) జపాన్ గతినే మార్చివేసింది. మన దేశంలో ప్రారంభం కానున్న బుల్లెట్ ట్రైన్ కూడా మన దేశాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తుంది అని ఆశిద్దాం. మన వేగానికి ప్రపంచం ఆగం అయిపోవాలి అని ఆశిద్దాం.
ఈ Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.