మహా శివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి (Srisailam) సన్నిధిలో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ (Andhra Pradesh Endowment Dept) శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవానికి ఉన్న ప్రాధాన్యత గురించి ఈ సమావేశంలో తెలుపుతూ ఆధ్యాత్మిక శోభ కనిపించేలా, అత్యంత పవిత్రమైన భావనతో, అధికారులు బాధ్యతాయుతంగా బ్రహ్మెత్సవాలను నిర్వహించాలన్నారు మంత్రి (Anam Ramanarayana Reddy).
ముఖ్యాంశాలు
బ్రహ్మోత్సవానికి వేళాయె | Srisailam Brahmotsavam 2025 Dates
2025 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అన్న మంత్రి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును (Chandrababu Naidu ) త్వరలో ఈ బ్రహ్మెత్సవానికి ఆహ్వానించనున్నట్టు తెలిపారు. ఆయన ఫిబ్రవరి 23వ తేదీన ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు ఆనం రామనారాయణ రెడ్డి.
ఆలయంలో పూజాది కార్యక్రమాలు ఆగమ పండితుల (Agama Shastra) సూచనలు, సలహాల మేరకు జరగాలి అని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి విచ్చచేసే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దీని కోసం అవసరమైతే అధికారులు డ్రోన్ల సాయం కూడా తీసుకోవాలన్నారు.
కాలినడకన వచ్చే భక్తులకు..| Arrangements for Srisailam Maha Sivaratri
శ్రీశైలం మల్లికార్జునుడిని (Srisailam Mallikarjuna Swamy Temple) దర్శించునేందుకు ప్రతీ ఏడాది వేలాది మంది భక్తులు కాలినడకన వస్తుంటారు. ఇలాంటి భక్తులకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సహకరించాలని , భక్తులకు మర్యాద ఇవ్వాలని ఈ సందర్భంగా ఆటవీశాఖ అధికారులను ఆయన కోరారు.
- వాహనాల్లో వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసిన పార్కింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని (Srisailam Parking), పార్కింగ్ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలిన కోరారు.
- హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
ఉచిత లడ్డూ,ఆల్పాహారం | Free Laddu In Srisailam
2024 తో పోల్చితే మహాశివరాత్రికి (Maha Sivaratri 2025) ఈ సారి భక్తుల సంఖ్య భారీగా పెరగనుంది అని తెలిపారు మంత్రి ఆనం. కనీసం 20 నుంచి 30 శాతం మంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది అని, దీనిని గుర్తుంచుకుని ఏర్పాట్లు చేయాలన్నారు.
- అలాగే క్యూ లైన్లో నిలబడే భక్తులకు మంచి నీరు, ఆల్పాహారం అందించనున్నట్టు తెలిపారు మంత్రి.
- మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లికార్జునుడి దర్శనార్థం వచ్చే భక్తులకు, బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు నాలుగు రోజుల పాటు ఉచితంగా లడ్డూ (Srisailam Laddu) ప్రసాదం అందించనున్నట్టు తెలిపారు.
శ్రీశైలం ఎలా చేరుకోవాలి ? | How To Reach Srisailam ?
ఉభయ తెలుగు రాష్ట్రాల ( Andhra Pradesh, Telangana) నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వస్తుంటారు. ఒక వేళ మీరు తొలిసారి శ్రీశైలం వెళ్తున్నా, లేక చాలా కాలం తరువాత వెళ్లాలలని భావిస్తున్నా ఈ వివరాలు మీ కోసమే.
తెలంగాణ నుంచి | Telangana Busses To Srisailam
తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శ్రీశైలంకు డైరక్టు బస్సులను నడుపుతోంది. మీరు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి డైరక్టుగా బస్ క్యాచ్ చేయవచ్చు. బుకింగ్ కోసం మీరు బస్టాండ్‌లో ఉన్న కౌంటర్ వద్దకు వెళ్లవచ్చు. లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.

- టీజీఎస్ఆర్టీసి వెబ్సైట్ : https://www.tgsrtcbus.in
సొంత వాహనాల్లో…
ఇక సొంత వాహనంలో బయల్దేరాలి అనుకుంటే మాత్రంహైదరాబాద్ నుంచి శ్రీశైలం 215 నుంచి 230 కిమీ దూరంలో ఉంటుంది. 4-5 గంటల్లో ఆలయ ప్రాంగణ వద్దకు చేరుకోవచ్చు.
రూటు| Hyderabad To Srisailam Car Route
- మీరు హైదరాబాద్->నాగార్జునాసాగర్->మాచెర్ల మార్గంలో శ్రీశైలం చేరుకోవచ్చు.
- తాజా అప్డేట్స్ అండ్ ట్రాఫిక్ వివరాల కోసం గూగుల్ మ్యాప్ కూడా వినియోగింవచ్చు.
గమనిక : ఈ రోడ్డు చాలా బాగుంటుంది. అయితే ఘాట్ రోడ్డుల వద్ద జాగ్రత్త.
ఆంధ్రప్రదేశ్ నుంచి | Andhra Pradesh Busses To Srisailam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (APSRTC) శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి డైరక్టు బస్సులను నడుపుతోంది. మీరు వివధ బస్టాండ్ల నుంచి ఈ బస్సులను క్యాచ్ చేయవచ్చు. లేదంటే ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 6 నుంచి 8 గంటల్లో శ్రీశైలం చేరుకోవచ్చు.

- ఏపీఎస్ఆర్టీసి వెెబ్సైట్ : https://www.apsrtconline.in/
సొంత వాహనంలో
ఏపీలోని విజయవాడ నుంచి శ్రీశైలం 270-300 కిమీ దూరంలో ఉంటుంది. ప్రశాంతంగా బండి నడిపినా మీరు 6-7 గంటల్లో శ్రీశైలం మల్లికార్జునుడి ఆలయానికి చేరుకోవచ్చు.
రూటు | Vijayawada To Srisailam Car Route
- విజయవాడ -> గుంటూరు -> వినుకొండ -> మర్కాపూర్ -> శ్రీశైలం
- మీరు గూగుల్ మ్యాప్ కూడా వినియోగించవచ్చు. దీని వల్ల ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉంటే తెలుస్తుంది. అయితే బ్లైండ్‌గా గూగుల్ మ్యాపునే నమ్మకుండా ఏమైనా డౌట్ వస్తే మధ్యలో మనుషులను అడగండి.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు | Tips For Srisailam Trip

- అడ్వాన్స్ బుకింగ్ : Advance Booking | బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అందుకే రూమ్స్ అయినా, వెహికల్స్ అయినా ముందే బుక్ చేసుకోండి. కుటుంబంతో కలిసి వెళ్లాలని భావిస్తే ముందస్తు ప్లానింగ్ చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటారు.
- మీరు బయల్దేరే ముందు రోడ్డు పరిస్థితి, వెహికల్ కండిషన్, వాతావరణం వంటివి చెక్ చేసుకోండి.
- ఘాట్ రోడ్లపై (Srisailam Ghat Roads) నిదానమే ప్రధానం అని గుర్తుంచుకోండి. కారు నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై మాత్రమే ఫోకస్ చేయాలి. ఎలాంటి పరిస్థితిలో కూడా వన సౌందర్యాన్ని చూసి పులకించకండి. కావాలంటే బండి ఆపి నేచర్‌ను చూడండి. కానీ డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు మాత్రం రోడ్డునే చూడండి.
- వసతి : దేవస్థానం నిర్వహించే రూమ్స్‌తో పాటు (Srisailam Accommodation) ప్రైవేటు హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు బంకు బెడ్స్ కూడా లాకర్స్‌తో పాటు లభిస్తాయి. మీ బడ్జెట్‌ను బట్టి ప్లాన్ చేసుకోండి.
- దర్శనం : రద్దీని బట్టి మీ దర్శన సమయాన్ని(Srisailam Darshan Timing) ప్లాన్ చేసుకోండి.
- మీ వస్తువులను భద్రంగా చూసుకోండి. సీసీకెమెరాలు ఉంటాయి కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఉంటే టైమ్ వేస్టు అవ్వదు కదా.
- ఏటీఎం | ATMs in Srisailam : ఆలయ పరిసరాల్లో కొన్ని చోట్ల ఏటీఎంలు ఉన్నా మీరు మీతో పాటు డబ్బు తీసుకెళ్లండి. ఏటిఎంలు ఎప్పుడు పని చేస్తాయో ఎప్పుడు మోరాయిస్తాయో ఊహించలేము కదా.
- నెట్వర్క్ | Mobile Connectivity In Srisailam: శ్రీశైలంలో కొన్ని జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ బాగుంటుంది.
- భోజనం : శ్రీశైలం ఆలయంలో అన్నదానం జరుగుతుంది. ఇక్కడ మీరు టైమ్ కనుక్కుని అన్న ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఆలయ పరిసరాల్లో అనేక హోటల్స్, రెస్టారెంట్స్ టిఫిన్ సెంటర్లు ఉంటాయి. ఇందులో మీకు ఫుల్ మీల్స్ నుంచి నూడిల్స్, పరాఠా, ఇడ్లీ దోష లాంటి ఎన్నో వెరైటీలు అందుబాటులో ఉంటాయి. మీ బడ్జెట్‌ను బట్టి ప్లాన్ చేసుకోండి.
- అలయం లోపలి భాగంలో చల్లని మంచినీరు లభిస్తుంది.
- శ్రీశైలం వస్తే షేరింగ్ కారులో లోకల్ సైట్ సీయింగ్‌కి వెళ్లవచ్చు. ఇందులో మీకు సాక్షి గణపతి (Sakshi Ganapati) ఆలయం వంటి మరెన్నె పవిత్ర క్షేత్రాల దర్శనం చేయిస్తారు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.