హైదరాబాద్ నుంచి వియత్నాంకు డైరక్ట్ విమానాలు ప్రారంభించిన Vietnam Airlines

షేర్ చేయండి

భారతదేశంలో తన ఉనికిని విస్తరిస్తోంది వియత్నాం ఎయిర్‌లైన్స్ (Vietnam Airlines). ఈ దిశలో కొత్తగా హనోయ్ నుంచి బెంగుళూరు, హైదరాబాద్‌కు డైరక్టు విమానాలు నడపనున్నట్టు ప్రకటించింది. 2025 మే నెల నుంచి ప్రారంభం కానున్న ఈ సేవలతో దక్షిణ భారత దేశం నుంచి తొలి సర్వీసును ఇది ప్రారంభించనున్నట్టు తెలిపింది.

భారతదేశంలోని ప్రధాన నగరాలతో…| Vietnam Airlines

గత కొంత కాలం నుంచి భారత్ – వియత్నాం (India – Vietnam) మధ్య పెరుగుతున్న ఆర్థిక బంధాన్ని, ప్రయాణికుల సేవలను విస్తరించే దిశలో పనిచేస్తోంది వియత్నాం ఎయిర్‌లైన్స్. పెరుగుతున్న ప్రయాణికుల (Traveler) డిమాండ్‌ను తీర్చే దిశలో ఈ నిర్ణయం తీసుకుంది.

గతంలో భారత దేశంలో ఢిల్లీ, ముంబై వంటి కొన్ని ప్రధాన నగరాల నుంచి విమాన సర్వీసులను నడిపింది.

  • విద్యా, ఐటీ, వ్యాపార రంగాల్లో దూసుకెళ్తున్న బెంగళూరు, హైదరాబాద్ (Hanoi to Hyderabad Flights) నుంచి వైమానిక సేవలను విస్తరించి దక్షిణాదిలో (South India) తన ఉనికిని చాటే దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టింది.
  • దీని వల్ల ఈ నగరాల ప్రయాణికులకు లేయోవర్స్‌లో (Layovers) టైమ్ వేస్ట్ చేసే అవసరం ఉండదు.

ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు ఇవే !

Vietnam Airlines
వియత్నాం ఎయిర్‌లైన్స్ (Photo: Vietnam Airlines Screengrab)
  • ప్రయాణ సమయం : వియత్నాంలోని (Vietnam) హనోయ్ నుంచి బెంగళూరు, హైదరాబద్ మధ్య డైరక్ట్ విమానాలు నడపడం వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. 
  • ప్రయాణికుల సౌకర్యం : ఈ కొత్త రూట్ల వల్ల దక్షిణాది ప్రయాణికులక సమయం, డబ్బు ఆదా అవ్వనుంది. దీంతో పాటు అనవసరమైన ప్రయాణాలు చేయకుండా డైరక్టుగా వియత్నాం చేరుకునే వెసులుబాటు కలగనుంది.
  • పర్యాటకానికి ఊతం : భారత్ వియత్నాం మధ్య త్వరలో ప్రాారంభం అవ్వనున్న ఈ వైమానిక సర్వీసుల వల్ల పర్యాటక పరంగా ఇరు దేశాలకు లాభం కలగనుంది. అక్కడి కల్చర్, నేచర్, వీసా ఫ్రీ ఎంట్రీ వంటి అనేేక కారణాల వల్ల వియత్నాం వెళ్లేందు భారతీయులు ఇష్టపడుతుంటారు.

ఆర్థిక బంధాలు బలోపేతం | India Vietnam Economic Ties

భారత దేశం-వియత్నం మధ్య ఈ రూట్లో ప్రారంభం కానున్న వైమానిక సర్వీసుల వల్ల కేవలం పర్యాటక రంగానికి (India Vietnam Tourism) మాత్రమే కాదు ఇరు దేశాల మధ్య ఆర్థిక బంధాలు మరింతగా బలోపేతం అవ్వనుంది. 

ఫ్లైట్ వివరాలు | Hanoi to Hyderabad Flight Details

2025 మే నుంచి ప్రారంభం అవ్వనున్న ఈ కొత్త ఫ్లైట్స్ వివరాలు…

  • ఎయిర్‌ బస్ A321 ఎయిర్‌క్రాఫ్ట్‌ను (Aircraft) రెండు రూట్లలో నడపనుంది.
  • బెంగళూరు, హైదరాబాద్ మధ్యలో వారానికి 7 ఫ్లైట్స్‌ను నడపనుంది. 
  • బెంగళూరు నుంచి 4, హైదరాబాద్ నుంచి 3 విమానాలు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.

ఈ కొత్త ఫ్లైట్స్‌కు సంబంధించిన రిజర్వేషన్ (Reservation) ఇంకా మొదలు కాలేదు. అయితే త్వరలోనే టికెట్ల అమ్మకాలు బుక్ అయ్యే ఛాన్స్ ఉంది. మరిన్ని వివరాల కోసం మీరు వియత్నం ఎయిర్‌లైన్స్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయవచ్చు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!