Shri Ramayana Yatra Returns : జూలై 25 నుంచి శ్రీరామయణ యాత్ర షురూ..ధర ఎంతో తెలుసా ?
Shri Ramayana Yatra Returns : శ్రీరామ భక్తుల కోసం భారతీయ రైల్వే కొంత కాలం ముందు శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన విషయం తెలసిందే. ఇందులో 4 ఎడిషన్లను లేదా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన రైల్వే శాఖ తాజగా 5వ ఎడిషన్‌ను ప్రకటించింది.
రామ భక్తుల కోసం నిర్వహించే ఈ యాత్రలో భక్తులు భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్టు ట్రైనులో ప్రయాణించనున్నారు. మరి ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటోె తెలుసుకుందామా ?
శ్రీ రామాయణ యాత్ర 2025 జులై 25 నుంచి ప్రారంభం కానుంది. యాత్రలో భాగంగా శ్రీరామ చంద్రుడి జీవితంతో ముడిపడి ఉన్న 30 పవిత్ర క్షేత్రాలను (భారత్, నేపాల్) దర్శించుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : “యూకే, భారత్ నుంచి నేర్చుకో”… ట్రైన్లో ఫుడ్ డిలివరీ..యూరోపియన్ ట్రావెల్ వ్లాగర్ | On-Train Food Delivery
శ్రీరామాయణ యాత్ర 5వ ఎడిషన్‌లో కీలకాంశాలు..| Shri Ramayana Yatra Returns
శ్రీ రామాయణ యాత్ర 2025 జూలై 25వ తేదీ నుంచి ఆగస్టు 10 వరకు సాగుతుంది. 17 రోజుల పాటు సాగే ఈ యాత్రలో భక్తులు దాదాపు 30 పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవచ్చు. అందులో కొన్ని మీరు కూడా చూడండి.
- అయోధ్య ( Ayodhya) : శ్రీరాముడి జన్మ స్థలం అయిన శ్రీరామ జన్మభూమి ఆలయం (Shri Ram Janmabhoomi Temple) తో పాటు హనుమాన్ గర్హీ, నిత్యం హరతి ధూపదీప నైవేద్యాలతో ఆధ్మాత్మిక శోభతో ప్రకాశించే సరయు ఘాట్ (Saryu Ghat) లను మీరు సందర్శించవచ్చు.
- నందిగ్రామ్ (Nandigram) : నందిగ్రామ్‌లో మీరు భారత్ మందిర్‌ను దర్శించుకుంటారు.

- సీతామర్హి (Sitamarhi), జనక్‌పురి (Janakpuri) : నేపాల్‌లో సీతమ్మవారి జన్మస్థానం అయిన సీతామర్షితో పాటు రామ్ జానకి ఆలయాన్ని (Ram Janki Temple) మీరు దర్శించుకోవచ్చు.
- వీటితో పాటు కాశీలో విశ్వనాథుడి (Kashi Vishwanath) ఆలయం, గంగా హారతిని వీక్షించవచ్చు. ప్రయాగ్‌రాజ్,చిత్రకూట్, నాశిక్, త్రియంబకేశ్వర్, హంపిలో ఆంజనేయ హిల్స్, రామేశ్వరం (Rameswaram), ధనుష్కోడిని కవర్ చేయవచ్చు.
- అయోధ్య నుంచి ధనుష్కోడి వరకు మొత్తం 7,600 కిమీ పాటు ఈ యాత్ర సాగుతుంది.
- ఇది కూడా చదవండి : IRCTC Pay Later : ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా ?
బోర్డింగ్ పాయింట్స్ | Boarding Points
ఈ యాత్ర అయోధ్య నుంచి రామేశ్వరం వరకు సాగుతుంది కాబట్టి బోర్డింగ్ పాయింట్స్ అదే విధంగా ప్లాన్ చేశారు. బోర్డింగ్ పాయింట్స్ వచ్చేసి…
- ఢిల్లీ
- ఘాజియాబాద్
- అలిగఢ్
- తాండ్లా
- ఇటావా
- కాన్పూర్
- లఖ్‌నవూ
భారత్ గౌరవ్ యాత్ర ప్రత్యేకత | Bharat Gaurav Yatra Specialty
భారత్ గౌరవ్ యాత్రను భారత రైల్వేశాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో ప్రయాణించే ప్రయాణికులకు సౌకర్యవంతమైను అనుభవాన్ని కలిగించే విధంగా ఏర్పాట్లు చేసింది. ఈ లగ్జరీ ట్రైనులో ఫస్ట్ క్లాస్ ఏసి, ఏసీ 2 టైర్, ఏసి 3 టైర్ క్యాబిన్లు ఉంటాయి.
ఈ ట్రైనుల్లో రెెండు ఆన్ బోర్డ్ రెస్టాంరెంట్స్తో పాటు ఒక అత్యాధునిక సదుపాయాలున్న కిచెన్ ఉంటుంది. ఇందులో స్నానానికి క్యూబికల్స్తో పాటు సెన్సార్ ఆధారంగా పని చేసే టాయిలెట్స్, సీసీటీవి సర్వలెన్స్, సెక్యూరిటీ గార్డు ఉంటాడు.
ప్యాకేజి వివరాలు | Shri Ram Janmabhoomi Yatra Package Price
17 రోజుల పాటు సాగే ఈ యాత్రలో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పించనుంది ఐఆర్సీటీసి.
సదుపాయాలు
- ట్రైను ప్రయాణం
- 3 స్టార్ హోటల్లో వసతి
- యాత్ర జరిగేంత వరకు భోజనం
- సైట్ సీయింగ్ కోసం ఏసీ బస్సులు
- ట్రావెల్ ఇన్సురెన్స్
- మేనేజర్ సేవలు అందుబాటులో ఉంటాయి
అందుకు తగిన విధంగానే ప్యాకేజీని నిర్ణయించారు.
- ఫస్ట్ ఏసీ కూప్ ప్యాకేజీ ధర : రూ. 1,79,515
- ఫస్ట్ ఏసీ క్యాబిన్ ఏసీ ప్యాకేజీ ధర : రూ. 1,66,380
- సెకండ్ ఏసి ప్యాకేజీ ధర : రూ. 1,40,120
- థర్డ్ ఏసీ ప్యాకేజీ ధర : రూ. 1,17,975
ఎలా బుక్ చేసుకోవాలి ? | How To Book Shri Ramayana Yatra Package
ఈ యాత్రను బుక్ చేయడానికి మీరు కేవలం 25 శాతం డబ్బును ముందుగా చెల్లిస్తే సరిపోతుంది. ఇక బుకింగ్ చేసుకోవడానికి మీరు ఐఆర్సీటీసి అధికారిక పోర్టల్‌ను (IRCTC Official Website) విజిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారికే టికెట్ ముందు లభిస్తుంది.
లేదా ఈ కింది నెంబర్లను సంప్రదించండి.
- 8595931047
- 8287930299
- 8882826357
- 8287930032
- 8287930484
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.