Hyderabad లో తప్పకుండా వెళ్లాల్సిన Top 7 Best Family Parks – Entry Fee, Timings & Complete Guide
7 Best Family Parks : హైదరాబాద్‌లో ఔటింగ్ ప్లాన్ చేస్తున్నారా? ప్రశాంతంగా, క్లీన్ అండ్ కిడ్స్ ఫ్రెడ్లీ పార్కుల కోసం సెర్చ్ చేస్తున్నారా? మీ కోసం 7 Best Family Parks కంప్లీట్ గైడ్
వీకెండ్ (Weekend) వస్తే చాలా మంది కుటుంబంతో కలిసి సరదాగా ఔటింగ్ ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా హైదరాబాద్‌లో ఔటింగ్ ప్లాన్ చేస్తున్నారా? ప్రశాంతంగా, క్లీన్ అండ్ కిడ్స్ ఫ్రెండ్లీ పార్కుల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే పోస్ట్ మీకు బాగా ఉపయోగపడుతుంది.
- ఈ పోస్టులో హైదరాబాద్‌లో ఉన్న టాప్ పార్కుల పేర్లు ఎంట్రీ ఫీజు, టైమింగ్స్, పార్కింగ్ వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు.
- మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్తున్నా, లేదా సోలోగా వెళ్తున్నా, వాకింగ్ కోసం వెళ్లినా ఈ పార్కులు బాగా సూట్ అవుతాయి.
- వీటిలో మీ పెర్ఫెక్ట్ వీకెండ్ ఔటింగ్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.
- ఇది కూడా చదవండిఎక్స్పీరియా పార్క్‌కు దగ్గర్లో ఉన్న 10 సందర్శనీయ స్థలాలు | Places Near Experium Eco Park
పనికొచ్చే విషయాలు | Quick Info Box
ఈ పార్కుల గురించి తెలుసుకునే ముందు కొన్ని సాధారణంగా పనికొచ్చే విషయాలు తెలుసుకుందాం.
- బెస్ట్ టైమ్: సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు
- ఎవరి సూట్ అవుతాయి : పిల్లలు, ఫ్యామిలీస్, వాకర్స్, అలాగే నేచర్ లవర్స్‌కు
- టాప్ 3 : కేబీఆర్ పార్కు, సంజీవయ్య పార్కు, దుర్గం చెరువు లేక్ ఫ్రంట్
- యావెరెజ్ ఫీజు : కొన్నింట్లో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. కొన్నింట్లో టికెట్ కొనాలి. మొత్తానికి రూ.10 నుంచి రూ.40 పర్ పర్సన్ అనుకోండి.
- పార్కింగ్ : చాలా పార్కుల్లో పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది. కొన్ని పార్కుల్లో ఎంట్రీ ఫ్రీ లేదా టికెట్ ధర తక్కువగా ఉంటుంది…కానీ పార్కింగ్‌కు రూ.10 లేదా రూ.20 చెల్లించాలి. చారాణా కోడికి బారాణా మసాలా అన్నట్టు.
- సేఫేనా : జనాలు ఎక్కువగా ఉన్న సమయంలో వెళ్తే ఏ ప్రదేశమైనా సేఫే అని గుర్తుంచుకోండి. రాత్రి 8 దాటిన తరువాత సేఫ్టీ పర్సెంటేజ్ తగ్గుతూ ఉంటుంది.
ఇక టాప్ 7 పార్కుల గురించి తెలుసుకుందామా..
1.కేబీఆర్ పార్కు | KBR National Park

హైదరాబాద్‌లో ఒక నేషనల్ పార్కు ఉందని చాలా మందికి తెలియదు. ఇక్కడికి చాలా మంది మార్నింగ్ వాక్ (Morning Walk) కోసం వస్తారు. సెలబ్రిటీలు కూడా ఇక్కడికే వాకింగ్‌కు వస్తారని చాలా మంది వారిని చూసేందుకు వెళ్తుంటారు.
- ఈ పార్కు ఎంట్రీ ఫీజు (Entry Fee) పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10
- టైమింగ్ (Timings) వచ్చేసి ఉదయం 5 గం. నుంచి 9.30 ని వరకు, సాయంత్రం 4గం. నుంచి 7 గం. వరకు
- పార్కింగ్ : పార్కు పెద్దది. పార్కింగ్ చిన్నది. చాలా మంది రోడ్డుపైనే పార్కింగ్ చేస్తుంటారు.
ఈ పార్కు ఎందుకు వెళ్లాలి ? | Why To visit KBR National Park
కేబీర్ పార్కుకు వెళ్లేందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా ఇది చాలా సేఫ్ పార్కు. ఇక్కడ ఎంట్రీ గేట్ ముందు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కూడా ఉంటారు.
- ఇక్కడి ప్రకృతిని చూస్తే నిజంగా హైదరాబాద్‌లోనే (Hyderabad) ఉన్నామా అనిపిస్తుంది.
- మార్నింగ్ వాక్ కోసం ఇది బెస్ట్ స్పాట్.
- నేషనల్ పార్కు కాబట్టి మంచి నీట్నెస్ మెయింటేన్ చేస్తారు.
- వాకింగ్ ట్రాక్స్ నీట్‌గా ఉంటాయి.
పిల్లలతో కలిసి ప్రశాంతగా నడుచుకుంటూ వెళ్లేందుకు ఇది చాలా మంచి స్పాట్.
2.సంజీవయ్యా పార్కు | Sanjeevaiah Park
7 Best Family Parks : హుస్సెయిన్ సాగర్ పరిసరాల్లో ఉన్న అందమైన పార్కు ఇది. ఇక్కడికి ఎక్కువగా జంటలు, ఫ్యామిలీస్ వెళ్తుంటారు. ఈ పార్కుకు వెళ్లాలంటే ఎంట్రీ ఫీజు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.
- టైమింగ్ : ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు
- పార్కింగ్ సదుపాయం ఉంది.
హైలైట్స్
- బ్యూటిఫుల్ లేక్ సైడ్ వ్యూ ..హుస్సెయిన్ సాగర్ చూస్తూ సరదాగా సమయం గడపవచ్చు.
- పిక్నిక్ కోసం మంచి స్పాట్
- విశాలమైన గార్డెన్ అండ్ లాన్స్
సంజీవయ్యా పార్కుకు సాయంత్రం సమయంలో వెళ్లేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.
- ఇది కూడా చదవండి : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
3.దుర్గం చెరువు | Durgam Cheruvu Lakefront Park
7 Best Family Parks : ఒకప్పుడు లవర్స్ పార్కుగా పాపులర్ అయ్యింది. కానీ తరువాత దీనిని ఒక పర్పెక్ట్ మోడర్న్ హ్యాంగవుట్ పార్కుగా తీర్చిదిద్దారు. దీనిపైన వేసిన కేబుల్ బ్రిడ్జి హైదరాబాద్‌కు ఐకానిక్‌గా మారింది. ఈ పార్కు ఇప్పుడు హైదరాబాద్‌లోనే టాప్ ఇన్స్టాగ్రామ్ స్పాట్‌గా మారింది.
- ఎంట్రీ ఫీజు వచ్చేసి రూ.10
- టైమింగ్ ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు
- ఇక్కడ పెయిడ్ పార్కింగ్ సదుపాయం ఉంది.
ప్రత్యేకతలు
- ఇక్కడి గ్లాస్ బ్రిడ్జిలో మీరు ఫోటోలు తీసుకోవచ్చు.
- సరస్సు వద్ద వాక్ చేయవచ్చు.
- భోజన ప్రియుల కోసం ఫుడ్, కేఫెస్ అందుబాటులో ఉన్నాయి.
- యాక్టివిటీస్ కోసం ఇక్కడ బోటింగ్ అందుబాటులో ఉంది.
సరదాగా కాలక్షేపం కోసం సాయంత్రం వాకింగ్‌కు వెళ్లేవారికి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్లేందుకు అనువైనది.
4. బోటానికల్ గార్డెన్ | Hyderabad Botanical Garden
సిటీ మధ్యలోనే ఒక అడవిని పోలిన నేచర్ ఎంజాయ్ చేయాలంటే బోటానికల్ గార్డెన్ బెస్టు ప్లేస్.
- ఈ పార్కులో ఎంట్రీ కోసం పెద్దలకు రూ.25, పిల్లలకు రూ.10 చార్జీ చేస్తారు.
- టైమింగ్ వచ్చేసి ఉదయం 5.30 ని నుంచి సాయంత్రం 6 వరకు
- చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంది.
హైలైట్స్
- కనుచూపుమేరా కనిపించే పచ్చదనం
- సీతాకోక చిలుకలను చూసేందుకు Butterfly Areas
- ప్రశాంతంగా నడిచేందుకు ఎన్నో వాకింగ్ పాథ్స్ ఉన్నాయి.
- ఫిట్నెస్ కోసం వాకింగ్ చేయాలి అనుకునే వారికి మంచి స్పాట్
మార్నింగ్ రోటీన్ కోసం చాలా మంది ఇక్కడి వస్తుంటారు.
- ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
5. ప్రియదర్శని పార్కు | Priyadarshini Park
7 Best Family Parks : ఉప్పల్‌లో ఉన్న ప్రియదర్శిని పార్కు ఈస్ట్ హైదరాబాద్‌లోనే (East Hyderabad) బెస్టు ఫ్యామిలీ పార్కు. కుటుంబంతో కలిసి ప్రశాంతంగా ఇక్కడికి వెళ్లిరావచ్చు.
- ఎంట్రీ ఫీజు రూ.10
- టైమింగ్ ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు
- సరిపడా పార్కింగ్ సదుపాయం ఉంది.
- స్పెషల్ డేస్, వీకెండ్స్‌లో కాస్త రద్దీగా ఉండే అవకాశం ఉంది.
హైలైట్స్
- కిడ్స్ ప్లే జోన్ ఉండటంతో పిల్లలకు బాగా నచ్చుతుంది.
- సాయంత్రం పిక్నిక్ కోసం మంచి స్పాట్
- వాకింగ్ కోసం మంచి వాకింగ్ ట్రాక్ ఉంది.
ఉప్పల్ (Uppal), హబ్సిగూడ, తార్నాకా ఏరియా వాళ్లకు మంచి ఛాయిస్ ఇది.
- ఇది కూడా చదవండిఎక్స్ పీరియం ఎకో పార్క్ ఎలా వెళ్లాలి ? టికెట్ ధర ఎంత ? విశేషాలు ఏంటి ? | Hyderabad Experium Eco Park
6. జలగం వెంగళరావు పార్కు | Jalagam Vengal Rao Park
7 Best Family Parks : బడ్జెట్ ఫ్రెండ్లీ హ్యాంగౌట్ పార్కుల్లో జలగం వెంగళరావు పార్కు ముందుంటుంది. ఈ పార్కు ఎంట్రీ ఫీజు రూ.20 కాగా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు పార్కు తెరిచి ఉంటుంది. అయితే పార్కింగ్ కోసం అంత పెద్ద ఏరియా లేదు. గమనించగలరు.
హైలైట్స్
- పచ్చగా నిగనిగలాడే లాన్
- చిన్నగా కళకళలాడే లేక్
- ఇది సాయంత్రం రిలాక్స్ అవ్వడానికి మంచి స్పాట్
క్లీన్ అండ్ సింపుల్ ఔటింగ్ కోరుకునే వారికి మంచి ఇది మంచి చాయిస్.
- ఇది కూడా చదవండి : సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
- ఇది కూడా చదవండి : Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం
7. జూ పార్కు | Nehru Zoological Park

7 Best Family Parks : పార్కుల్లో రాజులాంటి పార్కు ఇది. హైదరాబాద్‌లో ప్రతీ వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా జూపార్కు (Zoo Park) వెళ్లే ఉంటాడు. ఇక్కడ కుటుంబంతో కలిసి వైల్డ్ లైఫ్‌ను చూసేందుకు వెళ్లి రిలాక్స్ అయి రావచ్చు. ఒక రకంగా నగరం మధ్యలో అడవి అందులో అడవి జంతువులు చూసేందుకు అద్భుతమైన ప్రదేశం.
- ఎంట్రీఫీజు వచ్చేసి పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40 (లోపల సఫారీ, నాక్టోరల్ వంటి ప్రదేశాల్లో మళ్లీ టికెట్ కొనాల్సి ఉంటుంది).
- ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్తే ఎంత ఖర్చవుతుందో దాదాపు అంతే ఖర్చు ఇక్కడికి వెళ్లి రావడానికి కూడా అవుతుంది.
- టైమింగ్ ఉదయం 8.30 ని. నుంచి సాయంత్రం 5.30 వరకు.
- పార్కింగ్ సదుపాయం బాగుంటుంది. కాకపోతే పెయిడ్ పార్కింగ్.
- జూ పార్క్ లోెపల ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్.
- ఇది కూడా చదవండిExperium Eco Park : 25,000 అరుదైన మొక్కలతో అలరిస్తున్న ఎక్స్ పీరియం పార్క్
ప్రత్యేకతలు
- కుటుంబంతో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో నడుచుకుంటూ వెళ్లేందుకు అనువైన ప్రదేశం ఇది.
- ఇక్కడ ఉన్న ఎన్నో గార్డెన్స్‌లో చాలా మంది చిన్నపాటి పిక్నిక్ ఎంజాయ్ చేస్తారు.
- ఇక్కడ పిల్లు ఆడుకునే ప్రదేశం, చిన్న రైలు కూడా ఉంటుంది.
- ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ పిక్నిక్ స్పాట్.
నేచర్, పెట్, వైల్డ్ లైఫ్ లవర్స్‌కు ఇది మంచి స్పాట్. కుటుంబంతో కలిసి వెళ్లి ఫుల్ డే ఎంజాయ్ చేయడానికి అనువైన ప్రదేశం.
పార్కులు ఏ సమయంలో వెళ్లాలి ? | Best Time to Visit Hyderabad Parks
హైదరాబాద్‌లో ఉన్న పార్కుకు వెళ్లాలి అంటే ఉదయం 5 నుంచి 9 వరకు , సాయంత్రం 5 నుంచి 7 మధ్యలో వెళ్లాలి.
- ఉదయం వాక్ కోసం, ఫ్రెష్ ఎయిర్ కోసం వెళ్లవచ్చు.
- సాయంత్రం ఫోటోగ్రఫీ, ఫ్యామిలీ ఔటింగ్ కోసం, చల్లని వాతావరణం కోసం వెళ్లవచ్చు.
- మధ్యాహ్నం వెళ్లకపోవడమే బెస్ట్
హైదరాబాద్‌లో చాలా పార్కులు ఉన్నాయి. అందులో కొన్నింటిని మాత్రమే ప్రస్తావించాను. మీకు తెలిసిన, నేను మిస్ అయిన బెస్ట్ పార్కు ఉంటే కామెంట్ చేయండి.
సాధారణ ప్రశ్నలు | FAQ
- సేఫెస్ట్ పార్కు ఏది ? Safest Park In Hyderabad
- కేబీఆర్, సంజీవయ్యా పార్కులు
- పార్కింగ్ ఫెసిలిటీ బాగున్న పార్కు ? Best Parking Facility Included Park In Hyderabad
- దుర్గం చెరువు
- పిల్లల కోసం బెస్ట్ పార్కు | Best Park For Kids In Hyderabad
- ప్రియదర్శని, జూపార్క్
- ఫోటోల కోసం | Best Parks For Photography in Hyderabad
- దుర్గం చెరువు
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
