టికెట్ Confirm లేదా Waiting అనేది 10 గంటల ముందే తెలుస్తుంది | Railway Ticket Chart
రైల్వే ప్రయాణికులకు ఊరటనిచ్చే అప్డేట్ మీ కోసం తీసుకొచ్చాడు మీ ప్రయాణికుడు. ఇప్పుడు ట్రైన్ టికెట్ రిజర్వేషన్ స్టేటస్‌ను ముందుగానే తెలుసుకునే అవకాశం లభిస్తుంది. రైల్వే శాఖ రిజర్వేషన్ టైమింగ్స్‌ను రివైజ్ చేసింది. దీంతో ప్రయాణికులు ఇకపై ట్రైన్ బయల్దేరే 10 గంటల ముందే టికెట్ కన్ఫర్మేషన్ విషయాన్ని తెలుసుకోవచ్చు.
ఈ అప్డేట్ వల్ల ప్రయాణికులు చివరి నిమిషం వరకు టెన్షన్ పడే అవసరం తగ్గుతుంది. 10 గంటల ముందే వారి ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటారు.
గతంలో | Railway Ticket Chart
జూలై 2025లో రైల్వే శాఖ (Indian Railways) ఒక మార్పును తీసుకువచ్చింది. అదేంటంటే ట్రైన్ బయల్దేరే 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేసి ప్రయాణికులకు SMS ద్వారా టికెట్ స్టేటస్ గురించి తెలియజేసేవారు.
ఇక జూలైకి ముందు ప్రయాణికులకు టికెట్ కన్ఫర్మేషన్ స్టేటస్ అనేది కేవలం 4 గంటల ముందే మాత్రమే తెలిసేది. ఇంత తక్కువ టైమ్‌లో ప్రయాణానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడం ఇబ్బందిగా ఉండేది.
ఇప్పుడు
కానీ ఇప్పుడు మొదటి రిజర్వేషన్ చార్ట్ అనేది 10 గంటల ముందే ప్రిపేర్ అవుతుంది. దీంతో టికెట్ స్టేటస్‌పై ముందే ఒక క్లారిటీ వస్తుంది. టికెట్ కన్ఫర్మ్ అయిందా, లేదా RAC, లేదా వెయిటింగ్ లిస్ట్ అనే స్టేటస్ తెలుస్తుంది.
ఎమర్జెన్సీ కోటా ఫీడింగ్ అనే ప్రాసెస్‌ను కూడా రైల్వే శాఖ రివైజ్ చేసింది. ఎమర్జెన్సీ కోటా ఫీడింగ్ అనేది ట్రైన్ బయల్దేరే 8 గంటల ముందే పూర్తి చేస్తారు.
ఈ రూల్స్ ఎప్పుడు వర్తిస్తాయి ? | New Rules Applies When..
రైల్వే శాఖ అధికారుల ప్రకారం ఈ కొత్త చార్ట్ ప్రిపరేషన్ రూల్స్ అనేవి ఈ సందర్భాల్లో వర్తిస్తాయి :
- మధ్యాహ్నం 2.01 నుంచి రాత్రి 11.59 వరకు బయల్దేరే వారికి
- అర్థరాత్రి 12.00 నుంచి ఉదయం 5.00 వరకు వెళ్లే ట్రైన్లకు
ఈ రైళ్లకు తొలి రిజర్వేషన్ చార్ట్‌లను 10 గంటల ముందే సిద్ధం చేస్తారు.
ఈ మార్పులు ఎందుకు తీసుకువచ్చారు ?
రైల్వే అధికారుల ప్రకారం ఈ మార్పు అనేది ముఖ్యంగా చివరి నిమిషం వరకు ప్రయాణికులలో ఉండే టెన్షన్‌ను తగ్గించేందుకు తీసుకువచ్చారు. Waiting List లో ఉన్న ప్రయాణికులకు, అలాగే RAC టికెట్లు ఉన్న వారికి ఈ మార్పు చాలా ఉపయోగపడుతుంది.
చార్ట్ ముందే సిద్ధం అవ్వడం వల్ల ప్రయాణికులు తమ అకమోడేషన్, కనెక్టింగ్ ట్రైన్స్, అలాగే టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకునే అవకాశం లభిస్తుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
