రామప్ప నుంచి లక్నవరం వరకు.. Mulugu District Top 8 Tourist Spots
రామప్ప ఆలయం, మేడారం జాతర, లక్నవరం సరస్సు, బోగత జలపాతం సహా Mulugu District Top 8 Tourist Spots పూర్తి ట్రావెల్ గైడ్.
తెలంగాణలో ఉన్న అత్యంత అందమైన జిల్లాలో ములుగు (Mulugu) జిల్లా ఒకటి. యూనెస్కో గుర్తింపు తెచ్చుకున్న రామప్ప నుంచి మేడారం వరకు ములుగు జిల్లాలో ఎన్నో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి.
ముఖ్యాంశాలు
ములుగు జిల్లా ఎక్కడ ఉంది ? | where is mulugu ?
తెలంగాణలోని (telangana) వరంగల్ (Warangal) జిల్లా కేంద్రం నుంచి 41 దూరంలో ములుగు జిల్లా ఉంది.
- ములుగు జిల్లా ఒకప్పుడు వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది.
- ఈ జిల్లాలో ఉన్న పర్యటక ప్రాంతాల్లో కొన్నింటికి నేను వెళ్లాను.
- వాటితో పాటు నేను మిస్ అయిన లొకేషన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను.
అడవులు, కొండలు, జలపాతాలు, చెరువులు, గిరిజన సంస్కృతి కలగలిసిన ములుగు జిల్లా నిజంగా ఒక కంప్లీట్ ట్రావెల్ ప్యాకేజ్.
1.Ramappa Temple | రామప్ప ఆలయం
ములుగు జిల్లా అనగానే ముందుగా కాకతీయ రామప్ప రుద్రేశ్వర ఆలయం గుర్తొస్తుంది. ఓరుగల్లును పాలించిన కాకతీయ రాజులు (Kakatiya Dynasty) నిర్మించిన చారిత్ర దేవాలయం ఇది. ములుగులోని పాలంపేట గ్రామంలో ఉన్న ఈ ఆలయాన్ని శిల్పకారుడు రామప్ప తన నైపుణ్యంతో చక్కగా మలిచాడు.

- ప్రధాన శిల్పి పేరుమీదుగా ఉన్న ఆలయం మరెక్కడా లేదు రామప్పకే ఈ కీర్తి దక్కుతుంది.
- ఈ రామప్ప ఉన్నాడు చూడండి ఆయన మహాశిల్పి అందుకే ఆయన నిర్మించి రుద్రప్ప ఆలయం ఎన్నో భూకంపాలను ముస్లిం రాజుల (Muslim Rulers) కుట్రలను తట్టుకుని గట్టిగా నిలబడింది.
- ఇది కూడా చదవండి : Ramappa : రామప్ప ఆలయం వీకెండ్ ప్యాకేజీ తీసుకొచ్చిన తెలంగాణ టూరిజం శాఖ
- రామప్ప విజన్ కూడా చాలా గొప్పది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను.
ఈ ఆలయంలోపలికి వెళ్లగానే ఒక స్తంబానికి దెబ్బ తగిలినట్టు నల్లరాయిపై డిప్ప అంటే గుంత కనిపించింది. ఎందుకిలా అని టూరిస్ట్ గైడ్ వెంటక్ గారిని అడిగితే గుడికి దిష్టి తగలకుండా ఉండేందుకు ఇలా ఒక డిఫెక్ట్ పెట్టారట శిల్పి రామప్ప.

- ఈ ఆలయంలోని సూక్ష్మాతి సూక్ష్మ శిల్పాలు, నగిషీలు, నాట్యం చేసే బొమ్మలు, శబ్దాలు చేసే శిల్పాలు ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు వల్లే… యూనెస్కో (UNESCO) రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ఎంచుకుంది.
- ఇది కూడా చదవండి : రామప్ప ఆలయం గురించి తెలుగు వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Hyderabad To Ramappa Temple Distance
- హైదరాబాద్ నుంచి రామప్ప దేవాలయం 220 కీమీ దూరంలో ఉంటుంది.
- వరంగల్ నుంచి సుమారు 70 కీమీ దూరంలో ఉంటుంది.
రామప్ప ఆలయం Vlog చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. క్లిక్ చేసి చూడండి.
2. Medaram | మేడారం
తెలంగాణ ప్రజలకు మేడారం సమ్మక్క సారక్క జాతర (Sammakka Saralakka Jatara) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
ములుగు జిల్లా తాడ్వాయి (Tadwai) మండలంలో ఉన్న సమ్మక్క సారక్క ఆలయంలో ప్రతీ రెండేళ్లకు ఒకసారి మేడారం జాతర జరుగుతుంది.

Medaram Story | మేడారం ప్రజల కోసం కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడిని సమ్మక్క, సారక్క త్యాగాన్ని, వీరత్వాన్ని స్మరిస్తూ ప్రజలు ఈ జాతర చేసుకుంటారు.
సమ్మక్క పోరాట తీరు గురించి తెలుసుకున్న చక్రవర్తి ప్రతాప రుద్రుడు (Prataparudra) ఆమెకు భక్తుడిగా మారాడంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు సమ్మక్క కీర్తి ఎలాంటిదో.
మేడారం పండగను తెలంగాణ ప్రభుత్వం (Govt Of Telangana) అధికార లాంఛనాలతో నిర్వహిస్తుంది. 2022, 2024, 2026 (Medaram 2026) ఇలా ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా (Biggest Tribal Fare) మేడారం ప్రత్యేక గుర్తింపు పొందింది.
మేడారం చరిత్ర, కథ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
3.Laknavaram Lake | లక్నవరం సరస్సు

వరంగల్ నుంచి లక్నవరం సరస్సు (Warangal To Laknavaram Distance) సుమారు 75 కిమీ దూరంలో గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామ పరిధిలో ఉంటుంది. 13 శతాబ్దంలో కాకతీయ పరిపాలనా కాలంలో గణపతి దేవ చక్రవర్తి రామప్ప, పాఖాల్, గణపవరం చెరువులతో పాటు లక్నవరం సరస్సును నిర్మించారు.
ఈ సరస్సు కన్నాయిగూడెం, అంకన్నగూడెం, జగ్గన్నగూడెం, బుస్సాపూర్ వంటి గ్రామాల్లోని వేల ఎకరాలకు నీటిని అందిస్తోంది.
లక్నవరం సరస్సుకు చుట్టూ నలువైపులా కొండలుంటాయి. అందుకే కొంత మంది దీన్ని సీక్రెట్ లేక్ అని కూడా పిలుస్తుంటారు.
- ఇది కూడా చదవండి : Laknavaram : లక్నవరంలో మూడవ ద్వీపం..ఎలా ఉందో చూడండి
Laknavaram Cable Bridge : ఇక్కడే 182 మీటర్ల సస్పెన్షన్ ఫుట్‌వేర్ బ్రిడ్జిని కట్టారు. దీనిని చాలా మంది లక్నవరం కేబుల్ బ్రిడ్జి అంటారు.ఈ బ్రిడ్జిపై నడుస్తోంటే మనం నీటిలో నడుస్తున్నట్టే అనిపిస్తుంది. కొంచెం ఉయ్యాల్లో ఊగినట్టు ఫీలింగ్ కలుగుతుంది. చాలా థ్రిల్ కలిగించే ఎక్స్‌పీరియెన్స్ అది.
Activities in Laknavaram : లక్నవరం యాక్టివిటీస్ విషయానికి వస్తే ఇక్కడ బోటింగ్ చేయొచ్చు, డైనింగ్ చేయొచ్చు నైట్ స్టే చేయాలంటే సరస్సు మధ్యలో క్యాంప్స్, కాటేజీలు కూడా అందుబాటులో ఉంటాయి.
లక్నవరం వీడియో చూడటానికి క్లిక్ చేయండి.
4.Bogata Waterfall | బోగత జలపాతం
Mulugu District Top 8 Tourist Spots : ఛత్తీస్‌ఘడ్ (Chattisgarh) అడవుల్లో కురిసే భారీ వర్షాలకు తెలంగాణలోని బోగతా జలపాతం సరికొత్త అందాలను సంతరించుకుంటుంది. పాల నురుగులాంటి ఈ జలపాతం అందాలు చూసి పర్యాటకులు పరవశించిపోతుంటారు.

వరంగల్ నుంచి 133 కీమీ దూరంలో ఉన్న సహజసిద్ధ జలపాతాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం విశేషంగా తరలి వస్తారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని జలపాతానికి ఏటా వేలాది మంది టూరిస్టులు వస్తూ వెళ్తుంటారు.
మేము వర్షాకాలంలో ఇక్కడికి వెళ్లలేదు కాబట్టి అసలు బ్యూటిని మిస్ అయ్యాం. మీరు మాత్రం వర్షాకాలంలో ప్లాన్ చేసుకోండి. ఇంకో విషయం జలపాతానికి సమీపంలో శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం ఉంటుంది.
ఈ జలపాతాన్ని చాలామంది “తెలంగాణ నయాగరా” అని కూడా పిలుస్తారు.
5.శ్రీ హేమాచల లక్ష్మి నరసింహ స్వామి ఆలయం
ములుగు జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామానికి 4 కీమీ దూరంలో ఉంది Sri Hemachala Lakshmi Narasimha Swamy ఆలయం. సంతాన ప్రాప్తి కలగని వారి కోరికను స్వామి ఇక్కడ మన్నిస్తాడని చెబుతారు.

Warangal To Mallur : వరంగల్ జిల్లా నుంచి 135 కీమీ దూరంలో ఉన్న ఈ ఆలయం ఏటునాగారం భద్రచలం మెయిన్ రోడ్డుకు చేరువలో ఉంటుంది. ఈ క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు.
పూర్వకాలంలో మునులు, రుషులు ఈ క్షేత్రం పై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడి లక్ష్మీనర్సింహస్వామి స్వయంభూగా వెలిశారట. ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు.
ఈ ఆలయం స్థలపురాణం విగ్రహ విశిష్టతలు, కంప్లీట్ గైడ్ కోసం ఈ వీడియో చూడండి.
6.Ramappa Cheruvu | రామప్ప చెరువు
Mulugu District Top 8 Tourist Spots : గుడిపక్కన చెరువు ఉండాలనే సంప్రదాయాన్ని కాకతీయ రాజులు ఖచ్చితంగా అమలు చేశారు. ఈ సంప్రదాయంలో భాగంగానే రామప్ప చెరువును తవ్వించారు.
ఈ పరిసరాల్లోని ప్రశాంతత చెరువును కొత్త అందాన్ని సమకూర్చడమే కాకుండా దేవాలయానికి వినూత్న శోభను సంతరింప చేస్తుంది.
Ramappa Lake Activities : రామప్ప దేవాలయానికి సమీపంలోనే రామప్ప చెరువు ఉంటుంది. ఇందులో మీరు బోటింగ్ చేయొచ్చు. చెరువు చుట్టు పక్కల ప్రాంతాల్లో కాసేపు వాక్ చేయొచ్చు.
7. Eturnagaram Wildlife Sanctuary | ఏటూరునాగారం
ములుగు జిల్లాలో ఉన్న ఏటురు నాగారం అభయారణ్య ప్రాంతం నేచర్ లవర్స్‌కి ఐ ఫీస్ట్ లాంటిది.ఈ అభయారణ్యంలో దుప్పిలు, జింకలు, నీల్గై, ఎలుగు బంటి, చిరుతలు, పులులు ఉంటాయి.ప్రశాంతమైన ఈ అడవిలో అక్కడక్కడా కొన్ని కొండ కొలనులు కూడా కనిపిస్తుంటాయి.
ఇక్కడికి వెళ్లాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటును కాంటాక్ట్ అయితే సరిపోతుంది.
8. Sri Sammakka Sarakka Museum | మేడారం మ్యూజియం
మేడారంలోని శ్రీ సమ్మక్క సారక్క ఆలయానికి కొద్ది దూరంలోనే ఈ మ్యూజియం ఉంటుంది. ఆదివాసి ప్రజలు కోయరాజులు వాడిన పనిముట్లను చూడవచ్చు.అలాగే సమ్మక్క జీవితాల్లోని ప్రధాన 6 ఘట్టాలను విగ్రహాలు రూపంలో కూడా చూసి అర్థం చేసుకోవచ్చు.
తరచూ అడిగే ప్రశ్నలు | Mulugu District FAQ’s
ములుగు జిల్లా విజిట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది?
ములుగు జిల్లా విట్ చేయడానికి October నుంచి February వరకు ఉత్తమ సమయం.
వర్షాకాలంలో జలపాతాల కోసం వెళ్లవచ్చు. కానీ లోకల్ వరదలు, వర్షాల పరిస్థితుల గురించి ముందుగా తెలుసుకుని వెళ్లడం మంచిది.
హైదరాబాద్ నుంచి ములుగు జిల్లాకు ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ట్రైన్ లేదా బస్ ద్వారా చేరుకోవచ్చు.
అక్కడి నుంచి ములుగుకి ఆర్టీసీ బస్సు లేదా క్యాబ్ సదుపాయం ఉంటుంది.
Laknavaram లో ఎలాంటి Activities చేయవచ్చు?
లక్నవరంలో బోటింగ్, సస్పెన్షన్ బ్రిడ్జ్ వాక్, నేచర్ ఫోటోగ్రఫీ చేయవచ్చు.
నైట్ స్టే కోసం కాటేజీలు, టెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ములుగు జిల్లాలో జలపాతాలు విజిట్ చేయడానికి బెస్ట్ సీజన్ ఏది?
జూలై నుంచి సెప్టెంబర్ వరకు జలపాతాలు మంచి స్వింగ్‌లో ఉంటాయి.
ఈ సమయంలో Bogata, Kannegudem, Muthyamdhara Waterfalls మంచి ఫ్లోలో కనిపిస్తాయి.
ఫ్యామిలీ ట్రిప్ కోసం Mulugu District Safeనా?
అవును. ములుగు జిల్లా ఫ్యామిలీ ట్రిప్‌కు సేఫ్.
కానీ ఫారెస్ట్ ఏరియా, జలపాతాల వద్ద అధికారులు, స్థానికుల సూచనలు పాటించాలి.
పర్యాటకులు పర్యాటకుల్లా ప్రవర్తించినంత వరకు ప్రమాదం ఉండదు.
ములుగు జిల్లాలో Food & Accommodation ఎలా ఉంటుంది?
ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో బేసిక్ హోటల్స్, Telangana Tourism Cottages, Local Food Stalls అందుబాటులో ఉన్నాయి.
లక్నవరంలో Eco-Stay సదుపాయం కూడా ఉంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
