31st Night Hyderabad : మీరు ప్లాన్ చేస్తే పార్టీ… పోలీసులకు దొరికితే పెనాల్టీ
31st Night Hyderabad లో ఎలాంటి రూల్స్ బ్రేక్ చేయకుండా ఎలా సెలబ్రేట్ చేయాలో ఈ పోస్టులో తెలుసుకోండి. పార్టీలో ఎంట్రీ ఫీజు నుంచి పోలీసుల రూ.10,000 పెనాల్టీ వరకు ఫుల్ డీటెయిల్స్.
31st Night Hyderabad లో మీరు ఫుల్ నైట్ పార్టీ ప్లాన్ చేస్తారు. కానీ పోలీసులు మాత్రం రాత్రి ఒంటిగంటకే కటాఫ్ చేసేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో రూ.10,000 ఫైన్ నుంచి అర్థరాత్రి మెట్రో టైమింగ్, 2026 మొదటి గంటల్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అనే కిట్ ఇది.
కొత్త సంవత్సరం మొదటి గంటల్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అనే కిట్ ఇది.
ముఖ్యాంశాలు
మీ స్ట్రాటజీ vs పోలీసుల రియాలిటీ
మీరు రాత్రి 11 గంటలకు బయల్దేరి ఫైర్ వర్క్స్ చూద్దామని ప్లాన్ చేస్తే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
- పోలీసులు రాత్రి 11 కే అన్ని ఫ్లై ఓవర్లు క్లోజ్ చేస్తారు.
- చెక్ పోస్టుల దగ్గర పోలీసులకు దొరక్కుండా ప్లాన్ మీరు చేస్తే..
- 100 కన్నా ఎక్కువ మంది పోలీసు టీమ్‌లు బ్రెత్ ఎనలైజనర్లు, AI Camera లతో సిద్ధంగా ఉన్నాయి.
మీరు 2026 సంవత్సరాన్ని రూల్స్ పాటించకుండా నచ్చినట్టు స్వాగతం చెబుదాం అనుకుంటే మాత్రం చిన్న బ్రేక్ తీసుకోండి.
- ఎందుకంటే 31st Night స్టోరినీ కమిషనర్ గారు ముందే రాసేశారు.
- ఆ స్టోరీలో మీరే హీరో అవ్వాలంటే రూల్స్ తెలుసుకోండి.
- లేదంటే క్లైమాక్స్‌లో పెనాల్టీలు తప్పవు.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ నుంచి 245 కిమీ దూరంలో తెలంగాణలో ఒక జైపూర్ | Jaipur In Telangana Travel Guide 2025
సో మీరు రూల్స్ ప్రకారం వెళ్లడమే బెస్ట్ కాబట్టి ముందు రూల్స్ తెలుసుకుందాం.
| మీరు ఇలా ప్లాన్ చేస్తే | ఇలా జరగొచ్చు |
|---|---|
| పబ్బుల్లో అన్లిమిటెడ్ డ్రింక్స్ | లిమిట్ దాటితే రూ.10 వేల ఫైన్ |
| డ్రింక్ చేసి డ్రైవ్ | డ్రింక్ చేస్తే మెట్రో ట్రైన్ లేదా క్యాబ్ ఎక్కాల్సిందే. |
| 2am వరకు ఫుల్ మ్యూజిక్ | 10 గంటలకు ఔట్‌డోర్ మ్యూజిక్ Off, 1am వరకు ఇండోర్ మ్యూజిక్ On |
| ఫ్లైఓవర్లపై లాంగ్ డ్రైవ్ చేద్దాం | రాత్రి 11 నుంచి తెల్లారి 5 వరకు అన్ని ఫ్లైఓవర్లు బంద్ |
| PVNR ఎక్స్‌ప్రెస్‌వే | ఎయిర్పోర్ట్ వెళ్లేవారికి మాత్రమే |
| లేట్ నైట్ క్యాబ్ బుకింగ్ | కొన్ని చోట్ల క్యాబులు వెళ్లలేవు, వెళ్లినా మూడు రెట్లు ఎక్కువ చెల్లించాలి |
| రాత్రి లేట్ నైట్ వరకు మెట్రో | రాత్రి 1.15 వరకు మెట్రో ఉంటుంది |
| మోయినాబాద్ ఫామ్‌హౌజ్‌లో కిర్రాక్ పార్టీ | డ్రోన్ సర్వైలెన్స్ ఉంది బడ్డి, పర్మిషన్ లేకపోతే కేన్సిల్ పార్టీ |
సేఫ్ పార్టీ ప్రదేశాలు | Safe 31s Party Places In Hyderabad
సో రూల్స్ తెలుసుకున్నారు కదా…ఇప్పుడు మీకు కొన్ని సేఫ్ ఆప్షన్లు కూడా ఇస్తాను… ఎందుకంటే 31 నైట్ అంటే సెలబ్రేట్ చేసుకోవాలని ఎవరికైనా (Safe 31s Party Places In Hyderabad) ఉంటుంది కదా.

- శ్రీ పలని కన్వెన్షన్ ప్లాజా (Peerzadiguda)
మీరు తక్కువ బడ్జెట్లో మాస్ వైబ్ కావాలి అనుకుంటే ఇది బెస్ట్. ఆర్గనైజర్లు రూ.199 కే ఎంట్రీ ఫీజు పెట్టారు. కానీ ఫుడ్ కాస్ట్లీ ఉంటుంది. సో లోపలికి వెళ్లే ముందు బయట ఏమైనా తినేసి వెళ్లండి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా. - ఇది కూడా చదవండి : రామప్ప ఆలయం గురించి తెలుగు వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
- హైటెక్ ఎరెనా (Madhapur)
మీరు హైటెక్ సిటీలో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అనుకుంటే రూ.299 కే జనరల్ ఎంట్రీ ఛాన్స్ ఇస్తున్నారు. ఇది ఒక ఓపెన్ ఎయిర్ కాన్సర్ట్.
పార్కింగ్ అనేది చక్రవ్యూహం లాంటది. వెళ్లొచ్చు.. కానీ బయపడటానికి గంట పడుతుంది. - ట్యాంక్ బండ్
మీరు ఫ్రీగా ఫైర్ వర్క్స్ చూడాలి అనుకుంటే, న్యూ ఇయర్ వైబ్‌ను ఫీల్ అవ్వాలి అనుకుంటే, సింగిల్‌గా వెళ్లి హ్యాపీగా ఉండే నలుగురి మధ్యలో ఉండాలి అనుకుంటే ఇది బెస్ట్. - ఇక్కడ SHE Teams అంటే పోలీస్ స్పెషల్ టీమ్స్ సివిల్ డ్రెస్సులో ప్రజల మధ్యలోనే ఉంటారు.
- మహిళలకు మంచి భద్రత ఉంటుంది.
- కచ్చితంగా 11 గంటలకు రోడ్లు బ్లాక్ అవుతాయి.
- అవకాశం దొరికితే సైడ్ లైన్స్‌లో బండి పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్లండి.
- కార్లు ఎవాయిడ్ చేయండి. ఒక్క కారు నాలుగు బైకులంత స్పేస్ తీసుకుంటుంది.
- ఇది కూడా చదవండి : విజయవాడకు దగ్గర్లో కుటుంబ సమేతంగా వెళ్లగలిగే 7 డెస్టినేషన్స్
ఇక ఫైన్ విషయానికి వస్తే | 31st Night Hyderabad
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అడుగడుగునా నిర్వహిస్తారు. ఈ రాత్రి బ్రెత్ ఎనలైజింగ్ మిషిన్లకు బ్రేక్ లేదు.
- Drunk and Drive లో మొదటి సారి దొరికితే రూ.10,000 ఫైన్, లైసెన్స్ సీజ్.
- రెండవసారి దొరికితే రూ.15,000 ఫైన్, జైలు వెళ్లే ఛాన్స్.
- Music Decibels: ఇండోర్ మ్యూజిక్ 45 డెసిబెల్స్ మించకూడదు.
- Minor Entry: పబ్స్‌లోకి మైనర్స్‌కు ఎంట్రీ లేదు. ఫిజికల్ ఆధార్ లేదా డిజిలాకర్ చెక్ చేసి 21 ఏళ్లకు మించిన వారికి మాత్రమే ఎంట్రీ.
మెట్రో, ఫ్లై ఓవర్లు | Hyderabad Metro and Flyovers on 31st December
మెట్రో రైలు విషయానికి వస్తే LB Nagar / Miyapur మధ్య లాస్ట్ ట్రైన్ 12.30am కి బయల్దేరుతుంది.
ఎయిర్పోర్ట్ వెళ్లాలి అనుకుంటే PVNR Expressway లో ఫ్లైట్ టికెట్ ఉంటేనే ఎంట్రీ.
సాధారణ ప్రశ్నలు | FAQs About Hyderabad 31st Night
31st Night Metro ఉంటుందా? | Is Metro Available on 31st Night?
ఉంటుంది. లాస్ట్ ట్రైన్ 12.30am కి స్టార్ట్ అవుతుంది. 1.15am కి గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్ వెంటనే పే చేయాలా? | Do You Pay the Fine Immediately?
లేదు. వాహనం సీజ్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్తారు. కోర్ట్ ప్రాసెస్ తర్వాత 2–3 రోజుల్లో వాహనం రిలీజ్ అవుతుంది.
- ఇది కూడా చదవండి : పులికాట్లో ఫ్లెమింగో ఫెస్టివల్..తేదీలు ఫిక్స్ | AP Flamingo Festival 2026 Dates, Tickets & Complete Guide
అన్ని ఫ్లైఓవర్లు క్లోజ్ చేస్తారా? | Are All Flyovers Closed?
అవును. జూబ్లీహిల్స్ 45, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ వంటి ఫ్లైఓవర్లు రాత్రి 11 గంటలకు క్లోజ్ అవుతాయి. PVNR మాత్రమే ఎయిర్పోర్ట్ కోసం ఓపెన్.
SHE Teams ఎక్కడ ఉంటాయి? | Where Are SHE Teams Deployed?
15 SHE Teams సివిల్ డ్రెస్సులో మేజర్ జంక్షన్స్, పబ్బులు, పబ్లిక్ జోన్లలో మానిటర్ చేస్తుంటారు.
సౌండ్ రూల్స్ ఏంటి? | Sound Rules Explained
ఓపెన్ ఎయిర్ వెన్యూస్లో రాత్రి 10 గంటలకు మ్యూజిక్ బంద్.
ఇండోర్ వెన్యూస్లో 1am వరకు అనుమతి ఉంటుంది.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
