సంక్రాంతికి ట్రైన్ టికెట్ల గురించి వర్రీ అవుతున్నారా ? అదనపు స్పెషల్ ట్రైన్లు ప్రకటించిన South Central Railway
సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వారి కోసం South Central Railway స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ట్రైన్ నెంబర్లు, స్టాపులు, కోచు వివరాలు, బుకింగ్ టిప్స్, ఫెస్టివల్ ప్లానింగ్ క్లియర్‌గా వివరించారు.
ఈ సంక్రాంతికి సొంత ఊరికి వెళ్లాలి అనుకుంటున్నారా ? ట్రైన్ టికెట్ల గురించి దిగులు పడుతున్నారా ? మీ కోసమే south central railway ప్రత్యేేక రైళ్లను ప్రకటించింది. వాటి సర్వీసు, రూట్స్, ప్రాక్టికల్ బుకింగ్ టిప్స్ మీకోసం
సంక్రాంతి సమయంలో ఆంధ్రా తెలంగాణ మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది (Festival Travel Rush). రెగ్యులర్ ట్రైన్లలో టికెట్లు దొరక్కపోతే South Central Railway ప్రకటించిన Sankranti Special Trains (Additional Festival Services) అనేవి ఫ్యామిలీ ట్రావెలర్స్ (Family Travelers), విలేజ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకునే వారికి (Village Travel) మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి.
- ఇది కూడా చదవండి : 48 గంటల ట్రైన్ ప్రయాణం –North East వెళ్లేముందు తెలుసుకోవాల్సిన నిజాలు
ఈ స్పెషల్ ట్రైన్స్ కొన్ని రోజుల్లో మాత్రమే నడుస్తాయి కాబట్టి Train Selection, Return Journey Planning (Round Trip Booking) ముందుగానే చేయడం చాలా ఇంపార్టెంట్ విషయం అని తెలుసుకోండి.
ముఖ్యాంశాలు
ఈ స్పెషల్ ట్రైన్స్ ఎవరికి పనికొస్తాయి?
(Who Should Use Sankranti Special Trains?)
సంక్రాంతి సందర్భంగా ప్రయాణాలు చేసే వారికి ఈ ప్రత్యేక రైళ్లు బాగా ఉపయోగపడతాయి (Sankranti Travel Trains).
- తెలంగాణ నుండి ఆంధ్ర ప్రదేశ్‌లోని గ్రామాలకు (Telangana to Andhra Village Travel – Kakinada, Machilipatnam Routes) వెళ్లే ప్రయాణికులకు
- వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్ క్యాచ్‌మెంట్‌లో ఉండి ప్రయాణాలు చేసేవారికి (Vikarabad, Lingampally, Secunderabad Catchment Area),
- రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు ఫుల్ అవ్వడం వల్ల లేదా Last Minute Travel Planning (Tatkal Alternatives) చేసే వారికి
- సీనియర్ సిటిజెన్స్ (Senior Citizens), ఫ్యామిలీ గ్రూప్స్ (Family Groups) కి, డైరక్ట్ కనెక్టివిటీ ప్రిఫర్ చేసే వాళ్లకు ఇవి చాలా ఉపయోగపడతాయి.
- ఇది కూడా చదవండి :రైల్వే ప్రయాణికులకు అలెర్ట్… ఈ లిమిట్ దాటితే లగేజీని కోచులోకి తీసుకెళ్లనివ్వరు | Indian Railways New Luggage Rules
ప్రధాన మార్గాలు, లాభాలు | Key Routes and Passenger Benefits

కాకినాడ టౌన్ – వికారాబాద్ స్పెషల్స్ (Train No: 07450 / 07451)
(Kakinada Town to Vikarabad Sankranti Special Trains)
తూర్పు గోదావరి – హైదరాబాద్ సైడ్ డైరెక్ట్ ప్రయాణానికి ఇది మంచి ఆప్షన్ (Direct Train to Hyderabad Region). రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టాప్స్ ఉండటం వల్ల (Rajahmundry, Vijayawada, Guntur, Nalgonda Stops) ఈ మార్గాల్లో ప్రయాణించే వారికి కూడా ఉపయోగకరం.
నాందేడ్ – కాకినాడ టౌన్ స్పెషల్స్ (Train No: 07452 / 07453)
(Nanded to Kakinada Town Special Trains)
బాసర, నిజామాబాద్, కామారెడ్డి, మేడ్చల్ రూట్లో ప్రయాణించే తెలంగాణ ప్రయాణికులకు (Basara, Nizamabad, Kamareddy, Medchal Route), అలాగే తెలంగాణ తీర్థక్షేత్రాలు వెళ్లే ఫ్యామిలీ ట్రావెలర్స్‌కు (Temple Travel Telangana) ఇది మంచి ఛాన్స్ . దూర ప్రయాణాల్లో Waiting List Avoid (WL Bypass Option) చేయడానికి ఇది ఒక మంచి ఛాయిస్.
- ఇది కూడా చదవండి : టికెట్ Confirm లేదా Waiting అనేది 10 గంటల ముందే తెలుస్తుంది | Railway Ticket Chart
మచిలీపట్నం – వికారాబాద్ స్పెషల్స్ (Train No: 07454 / 07455)
(Machilipatnam to Vikarabad Sankranti Special Trains)
కృష్ణాజిల్లా – తెలంగాణ బెల్ట్ మధ్య ఇది డైరెక్ట్ సంక్రాంతి కనెక్టివిటీ (Krishna District to Telangana Direct Train). ఖమ్మం, వరంగల్, కాజిపేట, సికింద్రాబాద్ స్టాప్స్ ఉండటం (Khammam, Warangal, Kazipet, Secunderabad Stops) ప్లస్ పాయింట్స్‌గా మారతాయి.
తెలంగాణ ప్రయాణికులకు అదనపు లాభాలు
(Additional Advantages for Telangana Passengers)
ఈ స్పెషల్ ట్రైన్స్‌లో లింగంపల్లి, చర్లపల్లి స్టాప్స్ ఉండటం వల్ల (Lingampally, Charlapalli Railway Stations) Hyderabad City Crowd Avoid చేయవచ్చు (Avoid Secunderabad, Kacheguda Rush). శివారు ప్రాంతాల్లో ఉండే ప్రయాణికులు సులభంగా ట్రైన్ ఎక్కడం, దిగడం చేయవచ్చు. ఇది సంక్రాంతి సమయంలో ఉండే ప్రయాణ ఒత్తిడిని (Peak Festival Pressure) గణనీయంగా తగ్గిస్తుంది.
- ఇది కూడా చదవండి :ఎలుకలు, బొద్దింకలు, చిల్లర తిరిగివ్వని క్యాటరింగ్ సిబ్బంది… 46 గంటల ట్రైన్ జర్నీలో ఫ్రెంచ్ యూట్యూబర్ అనుభవాలు | Indian Train Journey
కోచులు ఎలా ఉంటాయి | South Central Railway
(Coach Composition and Travel Classes)
ఈ రైళ్లలో 1AC, 2AC, 3AC, Sleeper Class, General Second Class కోచులు అందుబాటులో ఉంటాయి. దీని వల్ల AC లో ప్రయాణించాలనుకునే ప్రయాణికులు (AC Passengers), బడ్జెట్ ట్రావెలర్స్ (Budget Travelers), గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు (Rural Passengers) అందరికీ తగిన ఆప్షన్స్ లభిస్తాయి.
ప్రయాణికులకు టిప్స్
(Prayanikudu Practical Sankranti Travel Tips)
• ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రైళ్లు అన్ని రోజులు నడవవు, కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే నడుస్తాయి (Limited Running Days)
• మీరు వెళ్లడానికి టికెట్ బుక్ చేసే సమయంలోనే Return Ticket Booking (Round Trip Reservation) కూడా చేయడం మంచిది
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
• IRCTC లో Train Numbers 07450 నుంచి 07455 వరకు సెర్చ్ చేసి అవైలబిలిటీ కంపేర్ చేయడం (IRCTC Availability Check) బెటర్
• జనరల్ కోచుల్లో January 13 నుంచి January 16 మధ్యలో (Peak Sankranti Dates) రష్ ఎక్కువగా ఉంటుంది
• దగ్గరలోని స్టేషన్లు అంటే లింగంపల్లి, వికారాబాద్ లాంటి ఆప్షన్స్ (Alternative Boarding Stations) ఎంచుకుంటే టికెట్లు దొరికే అవకాశాలు పెరుగుతాయి
• సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ అనేవి ఎమర్జెన్సీ ఆప్షన్ కాదు (Not an Emergency Train)
• కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే ఇవి Smooth Village Journey, Stress-Free Festival Travel కి బెస్ట్ సొల్యూషన్స్ అవుతాయి
• రైల్వే అధికారిక ప్రకటనలను ఫాలో అవుతూ (South Central Railway Official Railway Notification) ఫెస్టివల్ ట్రావెల్‌ను అర్థం చేసుకుని ముందుగానే ప్లాన్ చేసుకోండి
మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
