తెప్పోత్సవం అంటే ఏంటి? తిరుమలలో ఎప్పుడు జరుగుతుంది? | TTD Teppotsavam Guide
TTD Teppostavam అంటే ఏంటి? తిరుమల- తిరుపతిలో ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది ? క్రౌడ్, టికెట్స్, టైమ్, ఎవరికి బెస్ట్ అని సింపు ల్గా వివరించిన ప్లానింగ్ గైడ్.
తిరుమల రష్‌కి దూరంగా జరిగే TTTD Teppotsavam ఎక్కడ జరుగుతుంది ? వరికి సూట్ అవుతుంది? ఈ సింపుల్గైడ్లో తెలుసుకోండి.
తిరుమల (Tirumala) అంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం, క్యూ లైన్లు, రష్, లడ్డు కదా. అయితే ఆ హడావిడికి దూరంగా జరిగే ఒక ఉత్సవం గురించి ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే తెప్పోత్సవం (Teppotsavam).
ఈ ప్రత్యేక ఉత్సవం గురించి నేను తెలుసుకున్న విషయాలు, ఇమోషనల్‌గా మాత్రమే కాకుండా, మీకు క్లారిటీ ఇవ్వడం కోసం సింపుల్‌గా వివరిస్తాను.

- ఇది కూడా చదవండి : తెలంగాణలో 7 ప్రసిద్ధ శ్రీ మహావిష్ణువు & అవతారాల ఆలయాలు |
తెప్పోత్సవం అంటే ఏంటి? (What is Teppotsavam?)
గమనిక: మీకు తెప్పోత్సవం గురించి తెలిసినా చదవండి. మీకు ఏమైనా తెలియని పాయింట్స్ తెలుసుకునే అవకాశం ఉంటుంది.
తెప్పోత్సవం అంటే
- తెప్ప అంటే నీటిలో తేలే నావ (Floating platform)
- ఉత్సవం అంటే పండగ (Festival)

సింపుల్‌గా చెప్పాలంటే,
దేవీ దేవతలను అలంకరించిన తెప్పపై కూర్చుని, ఆలయ పుష్కరిణి (Temple Tank / Pushkarini) లేదా తీర్థంలో భక్తులకు దర్శనం ఇవ్వడం.
ఇది క్యూలైన్లో నిలబడి చేసుకునే దర్శనం కాదు.
ఇది కళ్లతో చూసి, మనసులో లాక్ చేసుకునే ఒక అద్భుతమైన ఉత్సవం.
- ఇది కూడా చదవండి : తిరుమలలో దర్శనాలు ఎన్ని రకాలు ? ఏ టికెట్లు బుక్ చేసుకుంటే దర్శనం వేగంగా అవుతుంది | Tirumala Darshan Guide
తెప్పోత్సవం ఎందుకు చేస్తారు? (Why is Teppotsavam performed?)

తెప్పోత్సవం కళ్లకు ఎంత అందంగా కనిపిస్తుందో తెలిసిందే.
కానీ దీని వెనక ఉన్న ఉద్దేశ్యం కూడా చాలా ముఖ్యమైనది.
ఆలయ సంప్రదాయం ప్రకారం:
- జలాన్ని పవిత్రంగా భావిస్తారు
- దేవతలను జలంపై ప్రదక్షిణలు (Pradakshina) చేయడం శుభం అని నమ్ముతారు
- ఆలయ పవిత్రతను కాపాడుతూ, సంప్రదాయాలను కొనసాగించడానికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు
భక్తులకు ఇది రష్ లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం అనుభవించడానికి ఒక మంచి అవకాశం.
- ఇది కూడా చదవండి : ఆంధ్రప్రదేశ్‌లో 7 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు | i Andhra Pradesh 7 Vishnu Temples
టిటిడి తెప్పోత్సవం ఎక్కడ జరుగుతుంది? (Where does TTD Teppotsavam take place?)

టిటిడి (TTD – Tirumala Tirupati Devasthanams) ఆధ్వర్యంలో తెప్పోత్సవం ఈ ఆలయాల్లో జరుగుతుంది:
- శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల
(Sri Venkateswara Swamy Temple, Tirumala)
➤ స్వామి పుష్కరిణి (Swami Pushkarini) లో జరుగుతుంది - శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం, తిరుపతి
(Sri Kapileswara Swamy Temple, Tirupati)
➤ కపిల తీర్థం (Kapila Theertham) లో జరుగుతుంది - శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం, తిరుపతి
(Sri Govindaraja Swamy Temple, Tirupati)
ప్రతి ఆలయంలో తెప్పోత్సవం అనేది ఆలయ ఉత్సవ క్యాలెండర్ (Temple Festival Calendar) ప్రకారం నిర్వహిస్తారు.
- ఇది కూడా చదవండి : వాట్సాప్‌లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback
తెప్పోత్సవం ఎప్పుడు జరుగుతుంది? (When is Teppotsavam held?)
తెప్పోత్సవం నిత్యం జరిగే వేడుక కాదు.
- ప్రతి సంవత్సరం ఆలయ వార్షిక ఉత్సవాలు (Annual Temple Festivals) సమయంలో జరుగుతుంది
- తిరుమలలో బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) సందర్భంగా నిర్వహిస్తారు
- తిరుపతి ఆలయాల్లో వార్షికోత్సవం షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది
- నిర్దిష్ట తేదీలు ప్రతి ఏడాది మారుతూ ఉంటాయి
👉 మీరు ట్రిప్ ప్లాన్ చేసుకునే ముందు ఆలయ అధికారిక ఉత్సవ క్యాలెండర్ తప్పకుండా చూడాలి.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లోని శ్రీమహా విష్ణువు ఆయ అవతారాల 9 ఆలయాలు | Vaikunta Ekadasi 2025 Hyderabad
తెప్పోత్సవం సమయంలో ఏం జరుగుతుంది? ఎంత టైమ్ పడుతుంది?

(What happens during Teppotsavam?)
- సాధారణంగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో జరుగుతుంది
- మొత్తం వ్యవధి 1.5 నుంచి 2 గంటలు
ఈ ఉత్సవంలో:
- తెప్పను రంగురంగుల పువ్వులతో,
- లైట్స్‌తో,
- సంప్రదాయ అలంకరణతో అలంకరిస్తారు
పవిత్ర జలంలో **3, 5, 7 లేదా 9 ప్రదక్షిణలు (Rounds) ** చేస్తారు.
ఈ సమయంలో భక్తులు నిలబడి దర్శనం చేసుకుంటారు.
తెప్పోత్సవం చూడాలంటే ఎక్కడ నిలబడాలి?
(Where should devotees stand?)

- తిరుమలలో స్వామి పుష్కరిణి చుట్టూ వీక్షణ ప్రాంతాలు ఉంటాయి
- తిరుపతి ఆలయాల్లో పుష్కరిణి గట్టులపై సేఫ్టీ చూసుకుని నిలబడవచ్చు
- **టికెట్లు అవసరం లేదు (No tickets required) **
- ముందుగా వచ్చినవారికి దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
తెప్పోత్సవం ఎవరికి సెట్ అవుతుంది? (Who should attend?)
కుటుంబంతో ప్రశాంతమైన దర్శనం కోరుకునేవారికి
- సీనియర్ సిటిజెన్లతో (Senior Citizens) ప్రయాణించేవారికి
- ఆలయ సంప్రదాయాలను నెమ్మదిగా గమనించాలనుకునేవారికి
ఒకవేళ:
- ఎక్కువ సేపు నిలబడలేకపోతే
- ఎక్కువ జనాల మధ్య అసౌకర్యంగా అనిపిస్తే
- ట్రిప్ షెడ్యూల్ టైట్‌గా ఉంటే
👉 తెప్పోత్సవాన్ని **ఒక ఆప్షనల్ అనుభవంగా (Optional Experience) ** భావించవచ్చు.
నిర్ణయం మీదే | Prayanikudu Decision Note
మీ తిరుపతి ట్రిప్ చాలా రష్లో ఉంటే తెప్పోత్సవాన్ని స్కిప్ చేయడం ఓకే.
కానీ టైమ్ ఉండి, మనశ్శాంతి కోరుకుంటే ఇది మంచి అనుభవం.
ఫోటోలే ఇంత బాగుంటే, ప్రత్యక్షంగా చూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో కదా.
ఈ పోస్టు ఎందుకు రాశాను? | TTD Teppotsavam
ఈ పోస్టు ప్రమోషన్ కోసం కాదు.
👉 ప్లానింగ్‌లో క్లారిటీ ఇవ్వడం కోసం.
తెప్పోత్సవాన్ని మీ ట్రిప్ ప్లాన్‌లో చేర్చాలా లేదా అనే నిర్ణయం తీసుకునే ముందు వాస్తవాలు తెలియజేయడమే ఉద్దేశ్యం.దర్శనం అంటే క్యూలో నిలబడటం మాత్రమే కాదు.
కొన్ని సార్లు దేవీదేవతలు మనకు ప్రశాంతంగా, ప్రకృతి మధ్యలో, జలంపై దర్శనం ఇస్తారు.
అదే తెప్పోత్సవం (Teppotsavam).
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
