Visakha Araku Utsav 2026 : విశాఖ అరకు ఉత్సవాలకు వెళ్తున్నారా ? ఈ తప్పులు అస్సలు చేయకండి !
Visakha Araku Utsav 2026 Advisory : విశాఖపట్టణం, అరకు లోయ, అనకాపల్లి కేంద్రంగా Visakha Araku Utsav 2026 జరగబోతున్న విషయం తెలిసిందే. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే ఈ వేడుకలకు సందర్శకులు ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు పాల్గొనవచ్చు.
ఈ ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ culture, adventure, sports, ఆహారం, ఆనందం బేస్‌గా ఈ ఉత్సవం జరగనుంది. అయితే సందర్శకులు ఈ ఉత్సవాల్లో ప్రశాంతంగా, సురక్షితంగా పాల్గొనే విధంగా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
ఎంట్రీ రూల్స్
వేడుకలు జరిగే ప్రాంతాల్లో ఎంట్రీ అనేది crowd capacity, security checks వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అనుమతి లేని ప్రాంతాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించకూడదు. అలాగే alcohol, drugs, ఇతర మత్తు పదార్థాల వినియోగం నిషేధం.
యాక్టివిటీస్‌లో భాగం అవ్వాలంటే…
Sports, adventure, aerial లేదా water activities, workshops, ప్రత్యేక events లో పాల్గొనాలంటే ముందుగా registration / booking చేసుకోవాల్సి ఉంటుంది. యాక్టివిటీకి ముందు అధికారులు తెలియజేసే safety instructions తప్పనిసరిగా వినాలి.
ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగానే తెలియజేయాలి. అలాగే మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించిన అనంతరం యాక్టివిటీస్ చేయడం కఠినంగా నిషేధం.
- ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ అండ్ టూరిజం స్టోరిస్ కోసం క్లిక్ చేయండి
పిల్లలు, పెద్దవారికి…
పిల్లలు తప్పనిసరిగా పెద్దలతో పాటు ఉండాలి. వయస్సు, శారీరక సామర్థ్యాన్ని బట్టి యాక్టివిటీస్‌లో పాల్గొనాలా లేదా అనేది అధికారులు నిర్ణయిస్తారు.
సందర్శకులు తెలుసుకోవాల్సిన విషయాలు
ఏ యాక్టివిటీలో పాల్గొనాలనుకున్నా సందర్శకులు తమకు కేటాయించిన ప్రాంగణంలోనే ఉండాలి.
వ్యక్తిగత drones, పదునైన వస్తువులు, గాజు వస్తువులు, మండే వస్తువులు వినియోగించరాదు.
సందర్శకులు కేటాయించిన entry & exit gates ద్వారానే రాకపోకలు సాగించాలి. Emergency routes అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధారణ సందర్భాల్లో వినియోగించరాదు. వాతావరణం లేదా ఇతర పరిస్థితుల కారణంగా ఈ వేడుకల్లోని events, schedules మారే అవకాశం ఉంటుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
