బెల్లంతో పాటు క్యాష్ కానుకల వైపు భక్తులు | Medaram Jatara 2026 Hundies
Medaram Jatara 2026 Hundies : సమ్మక్క సారాలమ్మ మేడారం జాతరకు ఈసారి భక్తుల వసతితో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడంతో పాటు ఈసారి హూండీల సంఖ్యను కూడా పెంచారని తెలుస్తోంది.
గతంలో జరిగిన జాతరలో 470 హుండీలను ఏర్పాటు చేయడగా ఈసారి వాటి సంఖ్యను 600కు పెంచడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ప్రాంగణంలో సైజు పెరగడం వల్ల ఈసారి హుండీల సంఖ్యను పెంచే అవకాశం కూడా లభించింది.
గతంలో గద్దెల చుట్టూ ఏరియా చిన్నగా ఉండడంతో జాతర రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండి మూవ్‌మెంట్‌కు కాస్త ఇబ్బందిగా ఉండేది.
- ఇది కూడా చదవండి : Medaram Jatara Circuit : నాలుగు జిల్లాలను కదిలించే ట్రావెల్ సర్క్యూట్
అయితే ఈసారి రూ.101 కోట్ల వ్యయంతో గద్దెలను (sammakka saralakka Jatara) ఆధునీకరించారు. అలాగే దర్శన వ్యవస్థలను కూడా ఇంప్రూవ్ చేశారు. స్టోన్ పిల్లర్లు, ఓపెన్ స్పేస్ వల్ల భక్తులకు సౌకర్యాలు పెరిగాయని చెప్పవచ్చు.
ఈ జాతర (Medaram) నుండి ఒక కొత్త మార్పు స్టార్ట్ అయింది. భక్తులకు క్యూఆర్ కోడ్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేయడానికి అవకాశం కల్పించారు. క్యాష్ క్యారీ చేయకుండా ఫోన్ల ద్వారా కానుకలు చెల్లించే ఆప్షన్ అందించారు. దీని వల్ల భక్తులు సులభంగా తమ కానుకలు చెల్లించగలుగుతున్నారు.
మేడారంలో బెల్లాన్ని బంగారంతో పోల్చుతారు. అయితే పూర్తిగా బెల్లం మాత్రమే ఇవ్వకుండా భక్తులు కాస్త బెల్లంతో పాటు క్యాష్ కూడా ఇస్తున్నారు. దీని వల్ల బెల్లాన్ని మేనేజ్ చేసే ఇబ్బంది తప్పడంతో పాటు జాతర నిర్వహణకు ధనం కూడా సమకూరుతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
