శివరాత్రి దక్షిణాదిలో తప్పక దర్శించాల్సిన 5 శివక్షేత్రాలు | South Indian Shiva Temples
South Indian Shiva Temples : మహా శివరాత్రి అంటే కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించే రాత్రి. ఈ పవిత్ర రాత్రిలో భారతదేశంతో పాటు హిందూ మతస్థులు ఉన్న అన్ని దేశాల్లో శివరాత్రిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
ఇక దక్షిణాదిలో అయితే శివన్నామ స్మరణతో ఆలయాలు అన్నీ కూడా మార్మోగిపోతాయి. భక్తుల మనసుల్లో ‘ఓం నమశ్శివాయ’ అనే నాదం తప్ప శివరాత్రి సమయంలో ఇంకో మాట వినిపించదు. భక్తులకు, తీర్థయాత్రికులకు శివరాత్రి అనేది మహాశివుడిని కొలిచే సమయం మాత్రమే కాదు, శివతత్వాన్ని అనుభూతి చెందే అవకాశం కూడా.
1.రామేశ్వరం | Rameshwaram ,Tamilnadu : దక్షిణ భారతదేశంలో ఎన్నో మహాశివుడి ఆలయాలు ఉన్నాయి. రామేశ్వరంలో ఉన్న రామనాథ స్వామి ఆలయంలో, సముద్రంతో కలిసిన అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని సొంతం చేసుకోవచ్చు.
2. శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ | Srisailam Mallikarjun Temple : శ్రీశైలం నల్లమల అడవుల మధ్యలో శివశక్తిని పూర్తిగా అనుభవించవచ్చు. చాలా మంది శివరాత్రి సమయంలో మల్లికార్జునుడి దర్శనం కోసం అడవుల్లో, కొండల మధ్యగా పాదయాత్ర చేసి వెళ్తుంటారు.
3. చిదంబరం | Chidambaram, Tamilnadu : అలాగే చిదంబరం లో నటరాజ స్వామి కాస్మిక్ డ్యాన్స్ యొక్క ఆధ్యాత్మిక అర్థాన్ని చెప్పకనే చెబుతుంది.
4. శ్రీకాళహస్తి | Srikalahasti, Andhra Pradesh : కాళహస్తి ఆలయంలో శివుడు పంచభూతాల రూపంలో దర్శనం ఇస్తాడు.
5. తంజావూరు | Tanjavore : అలాగే తంజావూరులోని బృహదేశ్వర ఆలయంలో, అత్యంత వైభవంగా ఉన్న ఈ ఆలయంలో, అతి పెద్ద లింగాకారంలో భక్తులకు దర్శనం ఇస్తాడు.
6. ఇది కూడా చదవండి : రామప్ప ఆలయం గురించి తెలుగు వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
శివరాత్రి (Shivaratri ) సమయంలో ఈ ఆలయాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, రాత్రి మొత్తం పూజలు, దీపాల వెలుగులో భక్తుల జాగరణ జరుగుతాయి. ఈ రాత్రి అంటే వినోదం కోసం బయట తిరగడం కోసం కాదు. శివరాత్రి అనేది శివుడిని పూజించడంతో పాటు శివుడిని అనుభూతి చెందేందుకు లభించే ప్రత్యేక అవకాశం.
ఈ శివరాత్రికి మీరు కేవలం పూజలు, పునస్కారాల వద్దే ఆగిపోకండి. ఎక్కడికి వెళ్లినా ఎందుకు వెళ్తున్నామో తెలుసుకుని వెళ్లండి. పురాతన ఆలయాలకు వెళ్లి, కాలాన్ని దాటి నిలబడిన ఆలయ వైభవాన్ని, కీర్తిని, చరిత్రను తెలుసుకుని గర్వపడండి. శివరాత్రిని ప్రశాంతంగా, భక్తితో దేవదేవుడిని స్మరించుకుంటూ గడపండి.
ఇలాంటి మరిన్ని పవిత్రమైన ప్రయాణ కథనాల కోసం www.prayanikudu.com ను విజిట్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
