ఇంట్లో కూర్చొని IRCTC Train Ticket Booking ఎలా యాలి? జనరల్, తత్కాల్ పూర్తి విధానం
IRCTC Train Ticket Booking : రైలు టికెట్ బుక్ చేయాలి అంటే ఇప్పుడ ఎన్నో సులభమైన సోర్సెస్ ఉన్నాయి. అసలు ఈ రోజుల్లో స్టేషన్కి వెళ్లి బుక్ చేయాల్సిన అవసరమే లేదు. మీ మొబైల్ లోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. దాని కోసం IRCTC Rail Connect యాప్ ఉంటే చాలు.
1. ముందుగా ఏం చేయాలి ? | Train Ticket Booking Telugu
ప్లే స్టోర్ లోకి వెళ్లి IRCTC Rail Connect App అని సెర్చ్ చేసి… అధికారిక యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి మీ అకౌంట్ లాగిన్ అవ్వండి. అకౌంట్ లేకపోతే కొత్తగా రిజిస్టర్ చేసుకొని యూజర్ నేమ్, పాస్ వర్డ్ పెట్టుకోండి. ఈ వివరాలు గుర్తుపెట్టుకోండి.
2. స్టేషన్ వివరాలు ఎలా నింపాలి?
From అంటే మీరు ఎక్కడి నుండి బయలుదేరుతారో ఆ స్టేషన్ పేరు, To అనే దగ్గర ఎక్కడికి వెళ్లాలో ఆ స్టేషన్ పేరు టైప్ చేయండి. తర్వాత ప్రయాణం తేదీ, క్లాస్ (1AC, 2AC, 3AC, స్లీపర్) సెలెక్ట్ చేసుకోండి.
3. జనరల్, తత్కాల్ కోటా అంటే ఏమిటి?
What’s General and Tatkal Quota : జనరల్ కోటా అనేది సాధారణ ప్రయాణానికి. ముందుగానే ప్లాన్ చేసుకునే వాళ్లకు. తత్కాల్ కోటా అనేది హఠాత్తుగా ప్రయాణం చేయాల్సి వస్తే అలాంటి వారికి ఉపయోగపడుతుంది.ఇది ప్రయాణానికి ఒక రోజు ముందు ఓపెన్ అవుతుంది.
- ఏసీ టికెట్లకు ఉదయం 10 గంటలకు..
- స్లీపర్ కు 11 గంటలకు ఓపెన్ అవుతుంది.
- చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి ముందుగానే లాగిన్ అయి ఉండాలి.
4. రైలు, సీటు ఎవైలబిలిటీ ఎలా చెక్ చేయాలి ?
How To Check Ticket Availability : మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలి అనే వివరాలు ఎంటర్ చేసిన తరువాత Search Train అని కొడితే ఆ రూట్ లో వెళ్లే రైళ్లన్నీ వస్తాయి. దేనిలో సీటు ఉంది, దేనిలో వెయిటింగ్ ఉంది అని తెలుస్తుంది.
- ఇది కూడా చదవండి : టికెట్ Confirm లేదా Waiting అనేది 10 గంటల ముందే తెలుస్తుంది | Railway Ticket Chart
5. వెయిటింగ్ టికెట్ బుక్ చేస్తే ఏమవుతుంది? | Waiting Ticket Booking
సీటు లేనప్పుడు వెయిటింగ్ లిస్ట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ అది కన్ఫర్మ్ అవుతుందని గ్యారెంటీ లేదు. క్యాన్సిల్ అయిన సీట్లను బట్టి కన్ఫర్మ్ అవుతుంది.
6. ప్రయాణికుల వివరాలు ఎలా నింపాలి? |
పేరు, వయసు, ఆడ,మగ, బెర్త్ (లోయర్, అప్పర్) వంటివి వివరాలను నింపాలి. ఎక్కువ మంది ఉంటే Add Passenger అని క్లిక్ చేసి వారిని యాడ్ చేసుకోవచ్చు.
7. పేమెంట్ ఎలా చేయాలి?
వివరాలన్నీ నింపాక మొబైల్ నంబర్, ఈమెయిల్ చెక్ చేసుకోండి. తర్వాత UPI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.
8. టికెట్ బుక్ అయ్యాక ఏం చేయాలి?
పేమెంట్ అయ్యాక టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. వివరాలు మీ మొబైల్ కు, ఈమెయిల్ కు వస్తాయి. ప్రయాణం రోజు ఫోన్లోనే టికెట్ చూపిస్తే చాలు. దాంతో పాటు ఆధార్ కార్డ్ వెంటనే ఉంచుకోండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
