భారతదేశంలోని టాప్ 5 వినాయక దేవాలయాలు | Top 5 Vinayaka Temples in India
Top 5 Vinayaka Temples in India : ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా గుర్తొచ్చే పేరు గణపతి. తొలి పూజ అందుకునే దేవుడు, విఘ్నాలను తొలగించే దైవమే విఘ్నేశ్వరుడు (Vighnaharta). మన తెలుగు రాష్ట్రాల నుండి బయలుదేరి దేశంలోని ప్రసిద్ధ వినాయక క్షేత్రాలను దర్శించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.
ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad), విజయవాడ (Vijayawada) నుండి వీకెండ్ లోనో, పండగ సమయంలోనో ఒక చిన్న యాత్ర ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ కోసమే ఈ ప్రత్యేక యాత్రా కథనం.
ఇది కేవలం గుడుల జాబితా కాదు, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఎంత ఖర్చు అవుతుంది అనే పూర్తి సమాచారంతో కూడిన ప్రయాణ గైడ్.
1. కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం | చిత్తూరు
Kanipakam Varasiddhi Vinayaka Temple, Chittoor : తెలుగు వారి ఇలవేల్పు. ఇక్కడి వినాయకుడు స్వయంభువు. ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు తమ పొలంలో బావి తవ్వుతుండగా ఒక రాయి తగిలి రక్తం రావడం, తవ్వి చూడగా వినాయక విగ్రహం బయటపడటం ఈ ఆలయ పురాణం.
కాణి అంటే చిత్తడి నేల (wetland), పాకం అంటే నీరు ప్రవహించడం (flow of water) అందుకే కాణిపాకం అనే పేరు వచ్చింది.
The divine beauty of Swayambhu Sri Varasidhi Vinayaka Temple, Kanipakam, shines even brighter during the monsoon rain.
— Akanksha Parmar (@iAkankshaP) June 24, 2026
Nature itself seems to offer prayers at the feet of Shri Ganesh. pic.twitter.com/cibnKOxNxS
గర్భగుడిలో విగ్రహం ఇప్పటికీ బావిలోనే ఉండి, కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది.
ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళ రాజు కులోత్తుంగ చోళుడు నిర్మించి, తరువాత 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం (Vijayanagara Empire) విస్తరించింది. ఇక్కడి విగ్రహం రోజురోజుకూ పెరుగుతోందని (growing idol) భక్తుల ప్రగాఢ నమ్మకం.
How to Reach from Hyderabad and Vijayawada – హైదరాబాద్, విజయవాడ నుండి ఎలా వెళ్ళాలి:
- హైదరాబాద్ నుండి దూరం 565 కిలోమీటర్లు. ఎంజీబీఎస్ నుండి ప్రతిరోజూ రాత్రి తిరుపతి, చిత్తూరు వెళ్లే బస్సులు ఉన్నాయి. కారులో 9 గంటల ప్రయాణం.
- విజయవాడ నుండి దూరం 400 కిలోమీటర్లు. విజయవాడ-తిరుపతి హైవే మీదుగా ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది.
- Best Time, Food and Stay – ఎప్పుడు వెళ్ళాలి, ఏం తినాలి, ఎక్కడ ఉండాలి: వినాయక చవితి నుండి 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు (21-day Brahmotsavams) సమయంలో తెప్పోత్సవం కనుల పండుగ.
- గుడి ఆవరణలో ఇచ్చే పులిహోర, లడ్డూ ప్రసాదం అమృతంలా ఉంటుంది. బయట చిత్తూరు కారం దోశె తప్పక రుచి చూడాలి. దేవస్థానం కాటేజీలు రూ.500 నుండి అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో ఉంది. చిత్తూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో కాణిపాకం గ్రామం (Kanipakam Village) లో ఉంది.
2. శ్రీ సిద్ధివినాయక ఆలయం | ముంబై
Shree Siddhivinayak Temple, Mumbai : ముంబై గుండెకాయ లాంటి ప్రభాదేవి (Prabhadevi) లో ఉన్న ఈ ఆలయం కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. ఈ ఆలయాన్ని 19 నవంబర్ 1801న లక్ష్మణ్ విఠు ,దేవుబాయి పాటిల్ నిర్మించారు. సంతానం లేని దేవుబాయి, ఇతర మహిళల కోసం ఈ గుడి కట్టించిందనేది చరిత్ర.
అందుకే ఇక్కడి వినాయకుడిని కోరికలు తీర్చే సిద్ధివినాయకుడు (wish-fulfilling Ganesha) అంటారు.
How to Reach: హైదరాబాద్ నుండి ఫ్లైట్ లో గంటన్నరలో ముంబై చేరుకోవచ్చు. రైలులో హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ లో 14 గంటలు. విజయవాడ నుండి కోణార్క్ ఎక్స్ ప్రెస్ డైరెక్ట్ రైలు ఉంది. దాదర్ స్టేషన్ నుండి ఆలయం 10 నిమిషాల దూరంలో ఉంటుంది.
#WATCH Maharashtra: Morning 'aarti' and prayers being performed at the Shri Siddhivinayak Temple in Mumbai on #GaneshChaturthi festival. pic.twitter.com/uZIFQijy6h
— ANI (@ANI) September 6, 2024
- Best Time, Food and Stay: మంగళవారం రద్దీ ఎక్కువ. ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలంటే ఉదయం 5:30 గంటల కాకడ హారతి (Kakad Aarti) సమయానికి వెళ్ళండి.
- ప్రసాదంగా మోదకం (Modak), లడ్డూ అందిస్తారు.. బయట ముంబై స్పెషల్ వడా పావ్ (Vada Pav) రుచి చూడొచ్చు. హోటల్స్ రూ.1500 నుండి మొదలవుతాయి.
- ఈ గుడి మహారాష్ట్ర (Maharashtra) రాష్ట్రంలోని ముంబై జిల్లా (Mumbai District) లో ఉంది. ముంబై నగరంలో ప్రభాదేవి , దాదర్ ఏరియాలో ఉంది.
- ఇది కూడా చదవండి : 1000 ఏళ్ల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవం ఎలా జరిగేదో తెలుసా? శాసనాల్లో బయటపడ్డ అసలు నిజం
3. శ్రీమంత్ దగడూ సేఠ్ హల్వాయి గణపతి | పూణే
Shrimant Dagdusheth Halwai Ganpati, Pune : మహారాష్ట్ర గణేష్ ఉత్సవాలకు పూణే కేంద్రం. ఈ ఆలయాన్ని 1893లో ప్రముఖ మిఠాయి వ్యాపారి దగడూ సేఠ్ హల్వాయి తన కొడుకును ప్లేగు వ్యాధిలో (plague epidemic) కోల్పోయిన బాధతో, లోకమాన్య తిలక్ ఆశీస్సులతో స్థాపించారు.
ఇక్కడి గణపతి విగ్రహం 2.2 మీటర్ల ఎత్తు, దాదాపు 40 కిలోల బంగారంతో (40 kg gold) అలంకరించబడి ఉంటుంది.
ప్రస్తుత నవసాచా గణపతి విగ్రహాన్ని 1968లో ప్రతిష్టించారు.
Couldn’t make it to the Dagdusheth Ganpati miravnuk? Here’s a glimpse for you! 🙏
— Varad Bhatkhande | Journalist (@VaradBhatkhande) September 14, 2026
The grand procession is underway in Pune, with devotees filling the streets as the beats of dhol-tasha and chants of “Ganpati Bappa Morya” set the festive mood.#Ganeshotsav2026 #Dagdusheth #Pune… pic.twitter.com/DB5nxHcPGm
- How to Reach: హైదరాబాద్ నుండి పూణేకి రోజూ పలు ఫ్లైట్లు ఉన్నాయి. బస్సులో 10 గంటల ప్రయాణం చేసి చేరుకోవచ్చు. విజయవాడ నుండి హైదరాబాద్ మీదుగా వెళ్ళడం సులభం.
- Best Time, Food and Stay: గణేష్ చతుర్థి సమయంలో (Ganesh Chaturthi) 10 రోజులు పూణే నగరం మొత్తం పండగలా ఉంటుంది. పూణే మిసల్ పావ్ (Misal Pav), బాకర్వాడీ తప్పకుండా టేస్ట్ చేయాల్సిందే. బుధవార్ పేటలో రూ.1000 నుండి హోటల్స్ లభిస్తాయి.
- ఈ గుడి మహారాష్ట్ర (Maharashtra) రాష్ట్రంలోని పూణే జిల్లా (Pune District) లో ఉంది. పూణే నగరం నడిబొడ్డున బుధవార్ పేట (Budhwar Peth) లో ఉంది.
4. ఖజ్రానా గణేష్ ఆలయం | ఇండోర్
Khajrana Ganesh Temple, Indore : ఇండోర్ లోని ఈ ఆలయం దేశంలోనే అత్యంత సంపన్న ఆలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 1735లో రాణి అహల్యాబాయి హోల్కర్ (Rani Ahilyabai Holkar) నిర్మించారు.
పూజారి మంగళ్ భట్ కలలో కనిపించిన విగ్రహాన్ని బావిలో నుండి తవ్వి తీశారని కథ. ఇక్కడ భక్తులు తమ కోరికను దారంతో కట్టి (thread tying tradition) విగ్రహం వెనుక రాస్తారు.
Divine Sindoor Seva Abhishekam darshan of Vighnaharta Shri Ganesh Ji
— Akanksha Parmar (@iAkankshaP) January 6, 2026
Khajrana Ganesh Temple, Indore. pic.twitter.com/xg2AQf1d8j
- How to Reach: హైదరాబాద్ నుండి ఇండోర్ కి డైరెక్ట్ ఫ్లైట్‌లో 2 గంటల్లో చేరుకోవచ్చు. విజయవాడ నుండి వీక్లీ రైళ్లు నడుస్తాయి.
- Best Time, Food and Stay: అక్టోబర్ నుండి మార్చి వరకు బెస్ట్ టైమ్. ఇండోర్ పోహా జిలేబీ (Poha Jalebi), దాల్ బాఫ్లా చేయవచ్చు. హోటల్స్ రూ.1000 నుండి 2500 రేంజిలో లభిస్తాయి.
- Location : ఈ గుడి మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా (Indore District), ఖజ్రానా ఏరియా (Khajrana) లో ఉంది
5. గణపతిపులే ఆలయం | రత్నగిరి
Ganpatipule Temple, Ratnagiri : సముద్రం ఒడ్డున కొండల మధ్య వెలసిన స్వయంభు గణపతిని దర్శించుకోవ్చు. ఇది నాలుగు వందల ఏళ్ల నాటి బీచ్ టెంపుల్.. ముంబై నుండి 340 కి.మీ దూరంలో ఉంటుంది.
ఇక్కడి విగ్రహం తెల్ల ఇసుకతో స్వయంగా ఏర్పడింది, పశ్చిమ ముఖంగా ఉండటం విశేషం. ప్రదక్షిణ అంటే గుడి చుట్టూ కాదు, కొండ చుట్టూ 1 కిలోమీటరు నడవాలి.
- How to Reach: ముందు ముంబై చేరుకొని, అక్కడి నుండి రత్నగిరికి 330 కిలోమీటర్లు బస్సు లేదా క్యాబ్. కొంకణ్ రైల్వే మార్గం చాలా అందంగా ఉంటుంది.
- Best Time, Food and Stay: నవంబర్ నుండి ఫిబ్రవరి బెస్ట్. కొంకణ్ స్టైల్ ఉకడిచే మోదక్ (Ukadiche Modak) చాలా పాపులర్. ఎం.టి.డి.సి రిసార్ట్ (MTDC Resort) లో బస ప్లాన్ చేయవచ్చు.
- Location : ఈ గుడి మహారాష్ట్ర (Maharashtra) రాష్ట్రంలోని రత్నగిరి జిల్లా (Ratnagiri District) లో ఉంది. రత్నగిరికి 25 కిలోమీటర్ల దూరంలో గణపతిపులే గ్రామం (Ganpatipule Village) లో, సముద్రం ఒడ్డున ఉంది.
యాత్ర బడ్జెట్ | Travel Budget
కాణిపాకం వీకెండ్ ట్రిప్ ఒకరికి రూ.3000 నుండి రూ.4000 వరకు బడ్జెట్ అవుతుందిజ. ముంబై-పూణే దర్శనం 2 రోజులకు ఒకరికి రూ.9000 నుండి రూ.13000 వరకు, మహారాష్ట్ర 3 ఆలయాల యాత్ర 4 రోజులకు ఇద్దరికి రూ.25000 నుండి రూ.30000. రైలు టికెట్లు 2 నెలల ముందు, ఫ్లైట్ టికెట్లు ఆఫర్లలో బుక్ చేసుకుంటే 30 శాతం ఆదా అవుతుంది.
ఈ బట్జెట్ వివరాలు కేవలం ఐడియా కోసం అందించాను. మీ ట్రావెల్ స్టైల్‌ను బట్టి మారే అవకాశం ఉంటుంది. తగిన విధంగా ప్లాన్ చేసుకోగలరు. అలాగే వెళ్లే ముందు లోకల్ అప్డేట్స్, లొకేషన్ డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోగలరు.
గణపతి గురించి 5 అద్భుతమైన నిజాలు : 5 Amazing Facts About Lord Ganesha
- 1. తొండం రహస్యం: ఎడమవైపు తొండం (left-trunk – Vamamukhi) ఇంటి పూజకు అనుకూలమని, కుడివైపు తొండం ఉన్న విగ్రహాన్ని (right-trunk – Dakshinabhimukhi) కఠిన నియమాలతో పూజించాలని శాస్త్రం.
- 2. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం… థాయ్‌లాండ్‌లో 39 మీటర్ల కాంస్య విగ్రహం (world’s tallest Ganesha statue in Thailand).
- 3. తొలి పూజకు కారణం: శివుడి వరం వల్ల తొలి పూజ (first worship) అవకాశం గణపతికే దక్కింది.
- 4. కాణిపాకం మహిమ: బావి నీరు ఎప్పుడూ ఎండిపోదు, విగ్రహం పెరుగుతోందని నమ్మకం.
- 5. మోదకం అర్థం: మోదకం ఆనందం, జ్ఞానానికి చిహ్నం (symbol of joy and knowledge).ఈ యాత్రను కేవలం దైవ దర్శనం కోసం మాత్రమే అనుకుని ప్రారంభించకండి. మన సంస్కృతిని, ప్రకృతిని దగ్గరగా చూసే అవకాశంగా భావించి ప్రారంభించండి. వెళ్లే ముందు టికెట్స్, హోటల్స్, లోకల్ వాతావరణం, పరిస్థితులు, ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోగలరు. థ్యాంక్యూ జైబోలో గణేష్ మహారాజ్‌కి జై.
▶️ వీడియో చూడండి : పండరిపురం ట్రావెల్ గైడ్
