ఫ్లైట్ క్యాన్సిల్ చేసిన ఎయిర్ లైన్ కు రూ.40,000 షాక్! | Flight Cancellation Compensation
Flight cancellation compensation : చెన్నై – పోర్ట్ బ్లెయిర్ ఫ్లైట్ ముందస్తు సమాచారం లేకుండా క్యాన్సిల్ చేయడంతో పాలక్కాడ్ కన్స్యూమర్ కమిషన్ రూ.40,000 పరిహారం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. DGCA రూల్స్ ప్రకారం రూ.10,000 కు బదులు రూ.5,400 ఇవ్వడం లోపంగా తేలింది.
కేరళ జంటకు అన్యాయం చేసిన ఎయిర్ లైన్ కు షాక్ ఇచ్చిన కన్స్యూమర్ కోర్టు. ఫ్లైట్ క్యాన్సిల్ చేసి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో రూ.40,000 పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
ఈ జంట తమ రెండో వివాహ వార్షికోత్సవాన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో జరుపుకోవాలని ప్లాన్ చేశారు. అందుకోసం చెన్నై నుండి పోర్ట్ బ్లెయిర్ వెళ్లేందుకు రెండు టికెట్లు బుక్ చేశారు. టికెట్ల ధర రూ.13,710. డిసెంబర్ 2025లో ప్రయాణం. రెండు రోజుల ముందే వెబ్ చెకిన్ కూడా చేసుకున్నారు.
- ఇది కూడా చదవండి : పోర్టోఫినో(Portofino): ఒక పెయింటింగ్‌లా కనిపించే యూరోపియన్ గ్రామం
అయితే ఎయిర్ పోర్టులో బోర్డింగ్ గేటు దగ్గరకు వెళ్లాక ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. క్యాన్సిల్ విషయాన్ని SMS లేదా ఈమెయిల్ ద్వారా ముందుగా తెలియజేయలేదు. దీంతో వారి ట్రిప్ మొత్తం పాడైపోయింది. అదే రోజు వేరే ఫ్లైట్ లో వెళ్లే అవకాశం కూడా కోల్పోయారు.
తర్వాత ఎయిర్ లైన్ రూ.14,062 ను బుకింగ్ ప్లాట్ ఫామ్ కు రీఫండ్ చేసింది. అయితే పరిహారంగా కేవలం రూ.5,400 మాత్రమే ఇవ్వడానికి ముందుకు వచ్చింది. DGCA నిబంధన ప్రకారం ఈ ఫ్లైట్ బ్లాక్ టైమ్ 2 గంటల 10 నిమిషాలు కాబట్టి రూ.10,000 పరిహారం ఇవ్వాలి.
తక్కువ పరిహారం ఇవ్వడం సేవలో లోపంగా పరిగణించి పాలక్కాడ్ జిల్లా వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది. అధ్యక్షులు వినయ్ మీనన్ V, సభ్యులు విద్యా A, కృష్ణన్ కుట్టి N K తో కూడిన బెంచ్ అక్టోబర్ 27న రూ.40,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
ఈ తీర్పు ప్రయాణికుల హక్కుల గురించి అందరికీ తెలియజేస్తోంది. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే రీఫండ్ తో పాటు పరిహారం కూడా అడగవచ్చు.
▶️ వీడియో చూడండి : థాయ్‌లాండ్ కంప్లీట్ ట్రావెల్ గైడ్
