మినీ మేడారం జాతర ( Mini Medaram Jatara 2025 ) సందడి మొదలైంది. ఈ జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరుగుతుంది. గత ఏడాది జరిగిన మేడారం జాతరకు లక్షలాది సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.

మేడారం జాతర గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ జాతరను తెలంగాణ కుంభ మేళాగా ( Kumbh Mela ) పోల్చుతుంటారు అంటే ఈ జాతర ప్రాధాన్యత ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. 2024 లో జరిగిన మేడారం జాతర తరువాత ఇప్పుడు మినీ మేడారం జాతర సందడి మొదలైంది. ఈ జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయి ( Tadvai ) మండలంలో జరుగుతుంది. గత ఏడాది జరిగిన మేడారం జాతరకు లక్షలాది సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు.
ముఖ్యమైన తేదీలు | Mini Medaram 2025 Dates
మినీ మేడారం జాతర 2025 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మొదలవుతుంది. 12వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వనదేవతలు అయిన సమ్మక్క ( Sammakka ) , సారలమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సమయంలో ఇద్దరమ్మలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు.
ఈ జాతరకు సంబంధించిన అంకురార్పణ అనేది 2025 ఫిబ్రవరి 5వ తేదీన జరిగింది. మినీ మేడారం ప్రారంభం అవ్వడానికి 7 రోజుల ముందుగానే ఆలయం ముందు మెలిగె, మండమెలిగె వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
20 లక్షల మంది…| Arrangement For Mini Medaram
మినీ మేడారం జాతరలో నాలుగు రోజుల పాటు జరిగే వేడుకలకు సుమారు 20 లక్షల మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివస్తారు. దీంతో భారీ సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీ సంఖ్యలో పోలీసులను కూడా ఇక్కడ మొహరించనున్నారు. దూరదూరం నుంచి వచ్చే భక్తుల కోసం మంచి నీటిసౌకర్యం, వాష్ రూమ్స్, సెక్యూరిటీ, రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీని కోసం రూ.32 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.
మొక్కులు ఎలా చెల్లిస్తారు ? | Jaggery As Gold

మేడారం జాతర లాగే మినీ మేడారంలో కూడా భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు ( Offerings in Medaram ) . అమ్మవార్ల గద్దె ముందు దండాలు పెట్టే భక్తులు బెల్లం ( అమ్మవారికి సమర్పించే సమయంలో దీనిని బంగారం అని పిలుస్తారు ) సమర్పిస్తారు. ఈ బంగారం మీకు ఆలయ ప్రాంగణంలో లభిస్తుంది.
సమ్మక్క సారాలమ్మ కథ | The Story Behind Medaram
మేడారం, మినీ మేడారం జాతరలను కాకతీయులు కాలంలో ఉన్న పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడుతూ తల్లీ, కూతుర్లు అయిన సమ్మక్క, సారలమ్మ, కుటుంబ సభ్యులు చేసిన త్యాగానికి ప్రతీకగా నిర్వహిస్తారు.
Story Of Sammakka Saralamma : 13వ శతాబ్దంలో ఒక రోజు అడవిలో వేటకు వెళ్లిన కొంత మంది గిరిజనులు దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక చిన్నారి సింహాలతో ఆడుకోవడాన్ని గమనిస్తారు. ఈ పాపను దైవ స్వరూపంగా భావించి సమ్మక్క అనే పేరు పెడతారు. తరువాత కాలంలో గిరిజన రాజు అయిన పగిడిద్ద రాజును ( Pagididda Raju ) వివాహం చేసుకుంటుంది. వారికి సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు పిల్లలు కలుగుతారు.
అయితే ఒకసారి పగిడిద్ద రాజు పాలిస్తున్న ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. అదే సమయంలో గిరిజనులు భరించలేనంత భారీ మొత్తంలో పన్నులు కట్టాల్సిందిగా నాటి కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు ( Pratapa Rudra ) ఆదేశిస్తాడు. అయితే ఈ సారి పంటలు పండలేవు కాబట్టి పన్నులు కట్టలేమని పడిగిద్ద రాజు చెప్పడంతో వెంటనే గిరిజనులపై ప్రతాపరుద్రుడు యుద్ధం ప్రకటిస్తాడు.
ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు మరణిస్తాడు. దీంతో సమ్మక్క కుటుంబ సమేతంగా యుద్ధరంగంలోకి దిగుతుంది. ఈ యుద్దంలో సారాలమ్మ మరణించగా, జంపన్నకు తీవ్రంగా గాయాలవుతాయి. అతని శరీరం నుంచి రక్తం ధారలా కారిన వాగు ప్రాంతాన్ని జంపన్న వాగుగా ( Jampanna Vagu ) పిలుస్తారు. భర్తను, పిల్లల్ని కోల్పోయిన బాధలో చిలకల గుట్టవైపు వెళ్లి అక్కడి నుంచి అదృశ్యం అవుతుంది సారక్క. ఆమె ఒక కుంకుమ భరణిగా మారుతుంది.
వారి త్యాగానికి ప్రతీకగా సమ్మక్క, సారలమ్మలను దేవతలుగా కొలవడం మొదలుపెట్టారు స్థానిక గిరిజనులు. ఈ జాతరను ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ( Mini Medaram Jatara 2025 ) నిర్వహిస్తారు. సమ్మక్క, సారలమ్మను తమను రక్షించేందుకు వచ్చిన ఆది పరాశక్తిగా కొలుస్తారు ఇక్కడి గిరిజనులు.
మినీ మేడారం ఎలా వెళ్లాలి | How to Reach Mini Medaram ?
మేడారం గ్రామం అనేది ములుగు జిల్లాలోని ఏటు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చువరీలోని ( Etunagaram Wildlife Sactuary ) తాడ్వాయి మండలంలో ఉంది. ఇక్కడికి చేరుకునే వివిధ మార్గాలు…
- రోడ్డు మార్గంలో | Mini Medaram By Road : హైదరాబాద్ ( ఎంజిబీస్ ) నుంచి మేడారంకు అనేక బస్సులు ఉంటాయి. దీంతో పాటు తెలంగాణలోని పలు ప్రముఖ పట్టణాల నుంచి ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా బస్సులు ఉంటాయి. మీరు వరంగల్ లేదా ములుగు జిల్లాలకు చేరుకుని అక్కడి నుంచి కూడా మేడారం వెళ్లవచ్చు.
- రైలులో | Mini Medaram By Train: మీరు కాజీపేట్ లేదా వరంగల్ ట్రైన్ క్యాచ్ చేసి అక్కడి నుంచి మేడారం చేరుకోవచ్చు. కాజిపేట్, వరంగల్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి.
మినీ మేడారం జాతర ( Mini Medaram Jatara 2025 ) అనేది గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలను తెలుసుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశం అని భావించవచ్చు. వన దేవతలు అయిన సమ్మక్క, సారాలమ్మ త్యాగానికి ప్రతీకగా జరిగే మేడారం జాతర అనేది ఒక జాతర మాత్రమే కాదు ఇది భక్తులు విశ్వాసాలకు, అనంతమైన నమ్మకాలకు ప్రతీక.
తెలంగాణ సంప్రదాయాలు ( Telangana Culture ) తెలుసుకోవాలి అనుకునే వారికి ఇది ఒక చక్కని అవకాశంగా చెప్పవచ్చు. సో, మీ క్యాలెండర్‌లో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మినీ మేడారం ఈవెంట్ లాక్ చేసుకోండి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.