Amrit Bharat Express: తెలుగు ప్రయాణికులకు ఎప్పుడు, ఎలా ఉపయోగపడుతుంది ?
హైదరాబాద్ / విజయవాడ : భారతీయ రైల్వే పరిచయం చేసిన Amrit Bharat Express ట్రైన్ సర్వీస్ తెలుగు ప్రయాణికుల లాంగ్ జర్నీల్లో బాగా ఉపయోగపడనుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి నార్త్ & ఈస్ట్ ఇండియాకి తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ ట్రైన్స్ సిరీస్ చక్కగా పనికొస్తుంది.
తెలుగు ప్రయాణికులపై డైరెక్ట్ ప్రభావం
ఇరు తెలుగు రాష్ట్రాల్లో సుదూర ప్రయాణాలు ప్రధానంగా ఈ కారణాల వల్ల జరుగుతుంటాయి:
- ఉద్యోగం, చదువు కోసం ఢిల్లీ, యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ ప్రాంతాలకు రాకపోకలు
- తెలుగు ప్రజలు ఎక్కువగా అయోధ్య, కాశీ (Varanasi), ప్రయాగ్‌రాజ్, పట్నా వంటి తీర్థక్షేత్రాలకు ప్రయాణించడం
- సెలవుల సమయంలో కుటుంబ ప్రయాణాలు
ఈ సెగ్మెంట్లో ప్రయాణించే వారిలో స్లీపర్ క్లాస్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌లో రద్దీ ఎక్కువగా ఉండటం, చార్జింగ్ పాయింట్స్ లేకపోవడం, పరిశుభ్రత, సేఫ్టీ వంటి సమస్యలు సాధారణం.
Amrit Bharat Express ఈ గ్యాప్‌ను అడ్రెస్ చేయడానికి డిజైన్ చేశారు.
ఇప్పుడు ఏ ట్రైన్‌ను ఎంచుకోవాలి?
Amrit Bharat Express తెలుగు ప్రయాణికులకు బెస్ట్ ట్రావెల్ ఆప్షన్ ఎప్పుడు అవుతుంది అంటే:
- జర్నీ టైమ్ 20 నుంచి 36 గంటల మధ్య ఉంటే
- ఏసీ తప్పనిసరి కాదు, కానీ మొబైల్ చార్జింగ్, CCTV, బెటర్ మెయింటెనెన్స్ కావాలంటే
- డైనమిక్ ఫేర్‌లకు బదులుగా సాధారణ, అందుబాటులో ఉన్న ధరలో ప్రయాణించాలి అనుకుంటే
- రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు
ఒక్క ముక్కలో చెప్పాలంటే:
నార్మల్ ఎక్స్‌ప్రెస్ కన్నా బెటర్, వందే భారత్ కన్నా ధర తక్కువ అనే కాన్సెప్ట్‌లో ప్రయాణించాలంటే ఈ ట్రైన్ సెట్ అవుతుంది.
- ఇది కూడా చదవండి : రైల్ వన్ యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్లపై 3% డిస్కౌంట్
ప్రస్తుతం ఉన్న ట్రైన్లతో పోల్చితే…
మీ ప్లానింగ్‌లో క్లారిటీ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రైన్లను పోల్చి చూస్తే:
- రాజ్ధాని – వేగం ఎక్కువ, ధర కూడా ఎక్కువ
- నార్మల్ ఎక్స్‌ప్రెస్ – ధర తక్కువ, వేగం తక్కువ, రద్దీ ఎక్కువ
- వందే భారత్ – ఆధునిక ట్రైన్, కానీ స్లీపర్ వెర్షన్ లేదు
Amrit Bharat Express లో:
స్లీపర్, జనరల్ కోచులు రెండూ ఉంటాయి. ఫాస్ట్ యాక్సెలరేషన్ వల్ల హాల్ట్ టైమ్ తక్కువగా ఉంటుంది. లాంగ్ జర్నీలకు అవసరమైన విధంగా చార్జింగ్ పాయింట్స్, CCTV సెక్యూరిటీ కూడా ఉంటుంది.
పర్యాటకం, కనెక్టివిటీ కోణంలో | Tourism & Connectivity Angle
Amrit Bharat ట్రైన్ సర్వీస్ వల్ల తెలుగు టూరిస్టులు ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించగలుగుతారు.
ఏపీ, తెలంగాణ నుంచి రైల్లో తీర్థయాత్రలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో పాటు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో ప్రయాణాలు, టూరిజం ట్రావెల్ కూడా పెరుగుతాయి.
సింపుల్‌గా చెప్పాలంటే, Amrit Bharat Express లగ్జరీ ట్రైన్ కాదు.
ఇది నేటి తరం సుదూర ప్రయాణికులకు ప్రాక్టికల్‌గా ఉపయోగపడే రైల్వే సర్వీస్.
ప్రయాణికుడు వర్షన్ | Prayanikudu Travel Insight
ఈ ట్రైన్ గురించి తెలుసుకోకపోతే తెలుగు ట్రావెలర్ ఒక ఉపయోగకరమైన మిడిల్ ఆప్షన్‌ను మిస్ అవుతాడు.
కాబట్టి ఇది న్యూస్ కంటే ట్రావెల్ క్లారిటీ స్టోరీగా పనికివస్తుంది అని షేర్ చేస్తున్నాం. మీరు కూడా నాలా ఎక్కువగా ప్రయాణాలు చేసే ప్రయాణికులకు షేర్ చేయండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు చిట్ చాట్
