Araku Trip Cost : అరకు వెళ్లాలి అంటే జేబులో ఎంత ఉండాలి ? ₹5000 లో వెళ్లిరావచ్చా ?
Araku Trip Cost : హైదరాబాద్, విజయవాడ నుంచి అరకుకు వెళ్లేందుకు ఎంత ఖర్చు అవుతుంది, ట్రైన్ టికెట్లు, వసతి, భోజనం,సైట్ సీయింగ్ వంటి వివరాలతో రూ.5,000 లో రెండు రోజుల అరకు ప్లాన్ మీకోసం.
Araku Trip Cost : అరకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా ? హైదరాబాద్, విజయవాడ నుంచి అరకు వెళ్లే ట్రావెల ప్లాన్, స్టే, భోెజనం, సైట్ సీయింగ్‌తో పాటు రూ.5,000 లో వెళ్లి వచ్చే బడ్జెట్ టిప్స్ మీ కోసం.
అరకు లోయ అంటే దట్టమైన పచ్చని అడవులు, చల్లని వాతావరణం, కాఫీ ప్లాంటేషన్స్, ఐకానిక్ ట్రైన్ జర్నీ…బడ్జెట్ ట్రిప్ లవర్స్‌కు ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్.
కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. Hyderabad / vijayawada araku trip cost ఎంత అవుతుంది అని. ఈ బ్లాగ్‌లో ట్రావెల్, డిస్టెన్స్, స్టే, ఫుడ్, సైట్ సీయింగ్ అన్ని క్లియర్‌గా కవర్ చేశాను.
ముఖ్యాంశాలు
అరకుకు ఎంత దూరం ?
అరకు ట్రిప్ వెళ్లడానికి ముందు మీరు ఉన్న ప్రాంతం నుంచి అది ఎంత దూరం ఉంటుందో తెలుసుకుంటే మంచిది కదా.
- Hyderabad to Araku Distance 716 km
- Vijayawada to araku distance 448 km
విజయవాడ నుండి అరకు జర్నీ షార్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ
హైదరాబాద్ నుండి ఓవర్‌నైట్ ట్రావెల్ బెటర్ ఆప్షన్
- ఇది కూడా చదవండి :అరకు నుంచి వంజంగి ఎంత దూరం ? బెస్ట్ రూట్, ట్రావెల్ టైమ్ | Araku To Vanjangi Distance
హైదరాబాద్ నుంచి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది ? | Araku Trip Cost from Hyderabad
ట్రైన్ (స్లీపర్ /3A) – ₹900 నుంచి ₹1,800 వరకు
బస్సు (ఆర్టీసి / ప్రైవేటు )- ₹1,000-1,800 వరకు
బైక్ / కారు (పెట్రోల్) ₹1,000-2,000
చాలా మంది ట్రైన్లో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు.
విజయవాడ నుంచి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది ? | Araku Trip Cost from Vijayawada
- ట్రైన్ (స్లీపర్ /3A) – ₹300 నుంచి 600 వరకు
- బస్సు (ఆర్టీసి / ప్రైవేటు )- ₹500-900 వరకు
- బైక్ / కారు (పెట్రోల్) ₹1,200-2,000
బడ్జెట్ ట్రావెలర్స్‌కు హైదరాబాద్ నుంచి ట్రైన్ అనేది మంచి ఆప్షన్
అరకు ట్రైన్ జర్నీ (Araku Train Journey) అనేది ఒక అందమైన అనుభూతిలాంటిది.
ఈ దారిలో ఎన్నో టన్నెల్స్, జలపాతాలు కనిపిస్తాయి.
వసతికి ఎంత ఖర్చు అవుతుంది? | Stay Cost in Araku

అరకు వెళ్లే మీకు ఎన్నో స్టే ఆప్షన్లు లభిస్తాయి. అయితే చలికాలం చాలా రష్ ఉంటుంది. కాబట్టి ముందుగా ప్లాన్ చేసి అడ్వాన్స్ బుకింగ్ చేస్తే బెటర్. ఒక వసతి కోసం సాధారణంగా ఈ ధరలు ఉంటాయి.
- బడ్జెట్ లాడ్జీలు / హోమ్ స్టేలు -₹800 నుంచి 1,200 వరకు
- ఏపీ టూరిజం (AP Tourism) హరితా హోటల్స్ ₹1,500 నుంచి ₹2,000
- రిసార్టులు, ప్రైవేట్ హోటల్స్ – ₹3,000
వీక్ డేస్‌లో వసతి ధరలు తక్కువగా ఉంటాయి.
గ్రూప్ గా వెళ్తే బడ్జెట్ తగ్గే అవకాశం ఉంది.
Watch : అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుదు మధ్యలో వంజంగి వ్యూ పాయింట్ అస్సలు మిస్ అవకండి. పాల మేఘాలపైకి వెళ్లి సూర్యోదయాన్ని చూసేయండి.
భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది ? | Food Cost in Araku
భోజనం అనేది మనం ఎంచుకునే హోటల్ అండ్ డిష్‌ను బట్టి ఉంటుంది. అయితే ఒక లెక్క కోసం చెబుతున్నాను.
- లోకల్ మీల్స్, టిఫిన్స్ – ₹300 నుంచి ₹500 వరకు (రోజుకి)
- కాఫీ, స్నాక్స్, బాంబూ చికెన్ -₹200- ₹300 వరకు
స్థానికంగా తక్కువ ధరకు క్వాలిటీ ఫుడ్ లభిస్తుంది. టేస్టీగా ఉంటుంది.
అరకు కాఫీ తప్పకుండా ట్రై చేయండి.
సైట్ సీయింగ్ కాస్ట్ | Sightseeing Cost
ఈ టూరులో మీరు ఈ ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి.
- బొర్రా గుహలు (borra caves)
- కాఫీ మ్యూజియం
- ట్రైబ్ మ్యూజియం
- కొన్ని వ్యూపాయింట్స్
Total Entry Fees : ₹200 నుంచి ₹400
లోకల్ షేర్డ్ జీప్స్లో వెళ్తే సైట్ సీయింగ్ లో కాస్త డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.
అరకు రెండు రోజుల ట్రిప్ కాస్ట్ | Araku Trip Cost for 2 Days
విజయవాడ నుంచి | From Vijayawada
బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేస్తే : ₹3,000 నుంచి ₹5,000 వరకు
కంఫర్ట్‌గా ట్రిప్ ప్లాన్ చేస్తే : ₹6,000 నుంచి ₹8,000 వరకు
హైదరాబాద్ నుంచి | From Hyderabad
బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేస్తే : ₹5,000 నుంచి ₹7,000 వరకు
కంఫర్ట్‌గా ట్రిప్ ప్లాన్ చేస్తే : ₹8,000 నుంచి ₹10,000 వరకు
సరైన ప్లానింగ్‌తో హైదరాబాద్ నుంచి అరకు అనేది బడ్జెట్లో అరకు సాధ్యం అవుతుంది.
- ఇది కూడా చూడండి : బొర్రా గుహలు ఎక్కడున్నాయి ? ఎలా వెళ్లాయి ?కంప్లీట్ ట్రావెల్ గైడ్ | Borra Caves Travel Guide
Watch : కోట్లాది సంవత్సరాల చరిత్రగలిగిన విశాలమైన గుహల సమూహమే బొర్రాకేవ్స్…లోపలికి వెళ్లే రాజమౌళి వేసిన సెట్టింగ్లా ఉంటుంది అంతా…
అరకు ట్రిప్ చవకగా పూర్తి అవ్వాలంటే | How to Plan a Budget-Friendly Araku Trip
సొంత వాహనాల్లో, ప్రైవేటు క్యాబులో వెళ్లడం కన్నా మీరు రైలు ప్రయాణాన్ని ప్రిఫర్ చేస్తే డబ్బు చాలా సేవ్ చేసుకోవచ్చు. వీకెండ్లో వెళ్తే చారాణా కోడి కూడా బారాణాకు దొరుకుతుంది. పైగా రద్దీ కూడా ఉంటుంది. అందుకే వీక్‌డేస్‌లో ప్లాన్ చేయండి.
గ్రూప్‌గా వెళ్తే ప్రయాణం, వసతి దగ్గర డబ్బులు మిగులుతాయి.స్థానిక ఫుడ్ ప్రిఫర్ చేయండి.
అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి. మరీ ముఖ్యంగా హాలిడేస్‌లో తప్పకుండా ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సిందే.
- ఇది కూడా చదవండి : Horsley Hills : ఆంధ్రా ఊటీకి క్యూ కడుతున్న తెలుగు ప్రయాణికులు
అరకు ట్రిప్ రూ.5,000 సాధ్యమా ? | Is Araku Trip Possible Within ₹5,000?
విజయవాడ నుంచి :
విజయవాడ నుంచి వెళ్తే ఇది చాలా సులభంగా సాధ్యమయ్యే విషయం. స్లీపర్ ట్రైన్ రౌండ్ ట్రిప్, బడ్జెట్ లాడ్జి లేదా హోమ్ స్టేలో (షేరింగ్‌లో) లోకల్ ఫుడ్ అండ్ షేర్డ్ జీప్‌లో సైట్ సీయింగ్ చేస్తే రెండు రోజుల అరకు ట్రిప్ రూ.3500 నుంచి 4500 లోపు పూర్తి చేయవచ్చు.
- మన తాత ముత్తాతలు ఆ కాలంలోనే తిరుమలకు, యాదగిరిగుట్టకు , ఏడుపాయల జాతరకు వేలకు వేలు ఖర్చు పెట్టి వేళ్లలేదు కదా.
- బాక్సుల్లో అన్నం కట్టుకునే వాళ్లు, సత్రాల్లో పడుకునే వాళ్లు. చాలా అడ్జస్ట్ అయ్యే వాళ్లు. పేదరాసి పెద్దమ్మలు కూడా ఉండేవారు కాబట్టి నడిచిపోయింది.
- నేను వాళ్లలా మైండ్‌సెట్ కొంచెం సెట్ చేసుకుంటే ఆటోమెటిగ్గా డబ్బులు సేవ్ అవుతాయి.
హైదరాబాద్ నుంచి రూ. 5000 లో సాధ్యమా ? : Araku Trip Cost
ఇక హైదరాబాద్ నుంచి అయితే రూ.5,000 వెళ్లి రావడం కాస్త టైట్‌గా ఉంటుంది. కానీ కష్టపడితే చేయవచ్చు. స్లీపర్ ట్రైన్లో ప్రయాణించండి. సింగిల్‌గా ఉంటే, జనరల్ ట్రైన్ జర్నీని భరించే నమ్మకం ఉంటే అక్కడ కూడా కాస్త డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. లేదంటే స్లీపర్ ట్రైన్లోనే ప్రయాణించండి.
వీకెండ్స్‌లో కాకుండా సోమవారం నుంచి గురువారం మధ్యలో వెళ్లిరండి. చిన్న లాడ్జీలు, తక్కువ ధరకు లభించే లోకల్ మీల్స్ ట్రై చేయండి ( క్వాలిటీగా అనిపిస్తేనే). ఇలా చేస్తే రూ.4500 నుంచి రూ.5000 లోపు మీ అరకు 2 రోజుల ట్రిప్ పూర్తి చేసుకోవచ్చు.
రూ.5వేలు అంటే అంతలోనే పూర్తి చేయాలని అనుకోవడం మంచిదే..కానీ ప్రయాణాల్లో బడ్జెట్ అనేది కొన్ని సార్లు మన చేతుల్లో ఉండదు. సో, కొంచెం ఎక్కువ క్యాష్ తీసుకెళ్లండి. అవసరం అనిపిస్తే బడ్జెట్ గీత కూడా దాటండి. కానీ ప్రాక్టికల్‌గా రెండు రాళ్లు అటూ ఇటుగా ఒక వ్యక్తి రూ.5,000 లో అరకు ట్రిప్‌ను పూర్తి చేయవచ్చు.
అరకు అంటే లగ్జరీ డెస్టినేషన్ కాదు. రైట్ ప్లానింగ్, రైట్ రూట్, బడ్జెట్ మైండ్‌సెట్ ఉంటే తక్కువ ధరలో కూడా మెమోరెబుల్గా జర్నీని పూర్తి చేసుకోవచ్చు. ప్రకృతి ప్రేమికులకు, కాఫీ లవర్స్‌కు ఇది పెర్ఫెక్ట్ ఎస్కేప్.
మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
