వైజాగ్‌లో బే సిటీ…ఇక గోవాకు వెళ్లే పనేలేదు | Bay City In Vizag
Bay City in Vizag : వైజాగ్‌ను గ్లోబల్ కోస్టల్ సిటీగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం టర్బో మోడ్ ఆన్ చేసింది. ఇక్కడి బీచులు, కొండ ప్రాంతాలు, ఆలయాలు, వారసత్వ ప్రదేశాలు అన్నింటిని లింక్ చేసి దీనిని బే సిటీగా (Bay City) గా రిబ్రాండ్ చేయడానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది.
మొత్తానికి వైజాగ్ ఇకపై బే సిటీగా జాతీయ అంతార్జాతీయ స్థాయిలో పర్యాటకులను మరింతగా ఆకర్షించనుంది.
ముఖ్యాంశాలు
బే సిటీ అంటే ఏంటి ? | What is Bay City ?
సముద్ర తీరంలో వెలసి డెవెలెప్ అయిన నగరాన్ని బే సిటీ అని పిలుస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10 వరకు బే సిటీలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా అమెరికాలో (Bay Cities In USA) ఉన్నాయి.
- అందులో మిషిగన్, టెక్సాస్, ఒరిగాన్ నగరాలను కూడా బేసిసీ అని అంటారు.
- ఇకపై వైజాగ్ కూడా బేసిటీగా గుర్తింపు తెచ్చుకోనుంది.
- ఇది కూడా చదవండి : అమెరికాలో అత్యంత ప్రమాదకరమైన 18 నగరాలు | Dangerous Cities In USA
- ఇది కూడా చూడండి Niagara Falls, మాన్యుమెంట్ వ్యాలీ.. అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్
ఇక వైజాగ్ (Vizag Tourism) బేసిటీ విషయానికి వస్తే తీర ప్రాంతం ఉన్న 40 కిమీ స్ట్రెచ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక ప్రాంతంగా (International Standard Tourism Zone) చేయనున్నారు.
దీని వల్ల…
- వైజాగ్ వైబ్ ఏంటో పర్యాటకులు ఫీల్ అవుతారు.
- ఇక్కడ బీచుల సంఖ్య పెరుగుతుంది.
- సదుపాయాలు మెరుగు అవుతాయి
ఎవరు నిర్మించేది ? | Who is building Bay City In Vizag
ఈ బే సిటీని నీతీ ఆయోగ్ మార్గదర్శకంలో వెర్డా (VERDA) ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేస్తోంది. ఇక VMRDA దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్, లోకల్ కోవార్డినేషన్ హ్యాండిల్ చేస్తుంది.
40 కిమీల సూపర్ టూరిజం బెల్టు | 40 Km Super Tourism Belt
వైజాగ్‌ను బే సిటీగా మార్చేందుకు ప్రభుత్వం (AP Govt ) ఇప్పటికే భూమికి సంబంధించిన సర్వేను పూర్తి చేసింది. ఇందులో..
- ఇప్పటికే ఉన్న భవనాలు
- ఖాళీ స్థలాలు
- ప్రభుత్వ భూములు
- మార్కెట్ విలువ
- వివాదాస్పాద స్థలాలు
- పర్యాటకానికి అవకాశం ఉన్న స్థలాలు ఉన్నాయి.
ఇవన్నీ కలిపి Bay City Blue Print సిద్ధం చేశారు.
- ఇది కూడా చదవండి : Indias Ancient Temples : మన దేశంలో అతిపురాతనమైన 5 దేవాలయాలు !
కొత్తగా 5 బీచులు | New Beaches In Vizag
RK Beach, Rushikonda Beach లో రద్దీని నిర్వహించేందుకు గాను కొత్తగా 5 బీచులను సిద్ధం చేయనున్నారు. ఎందుకంటే ప్రస్తుతం పర్యాటకులు కేవలం ఈ రెండు బీచులపైనే ఫోకస్ చేస్తున్నారు. రానున్న కాాలంలో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో కొత్త బీచులను వారి కోసం సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది.
- పర్యాటకుల కోసం కొత్త, మెరుగైన సదుపాయాలు కల్పించనున్నారు.
- దీంతో పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
- దీని వల్ల రాష్ట్రానికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.
- ఇది కూడా చదవండి : Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
కొండలు+ బీచులు = కంప్లీట్ టూరిస్ట్ డెస్టినేన్ | Bay City Circuit Tour

ఈ బే సిటీలోకి కొత్తగా పర్యాటకులను ఆహ్వినించేందుకు కొండలు, బీచులను ఒక ప్యాకేజీలా కలిపి కంప్లీట్ డెస్టినేషన్‌గా మార్చనున్నారు.
- ఇందులో తొట్లకొండ-బావికొండ-రిషికొండ-కైసాలగిరి-శిల్పారామం కలిపి ఒకే టూరిస్టు సర్కిట్గా ఏర్పాటు చేస్తారు.
- సగం రోజులో పర్యాటకులు ఈ ఆరు ప్రాంతాలను కవర్ చేసుకోగలుగుతారు.
- ఇది కూడా చదవండి : Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
రిషికొండ ఇక వాటర్ అడ్వెంచర్‌కు కేరాఫ్ | Rushikonda Water Adventure Hub
రిషికొండలో రెండు ఎకరాల్లో పూర్తి స్థాయిలో వాటర్ స్పోర్ట్స్ కేంద్రాన్ని (Water Sports Centre) ఏర్పాటు చేయనున్నారు. ఇందులో…
- కాయాకింగ్
- సర్ఫింగ్
- స్కూబా
- స్నార్కిలింగ్
- పెడిల్ బోర్డింగ్ వంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయి.
వీటి కోసం ఏపీ స్పోర్ట్స్ ఆథారిటీ (AP Sports Authority) ఇప్పటికే అవసరమైన అనుమతులను ఇచ్చింది. పనులు త్వరలో ప్రారంభం అవ్వనున్నాయి.
- ఇది కూడా చూడండి : బొర్రా గుహలు ఎక్కడున్నాయి ? ఎలా వెళ్లాయి ?కంప్లీట్ ట్రావెల్ గైడ్ | Borra Caves Travel Guide
తీర ప్రాంతాల్లో నిర్మాణాలకు కొత్త రూల్స్ | Coastal Construction Rules Change
భవిష్యత్ పర్యాటక రంగ అవసరాలకు అనుగుణంగా కొత్తగా కొన్ని విధి విధానాలను రూపొందించారు. అందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బీచులకు సమీపంలో ఉండే భవంతుల లుక్, హైట్, స్టైల్ అన్నీ కూడా కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాల్సి ఉంటుంది.
- ఈ మార్గదర్శకాల లక్ష్యం బీచ్ ఏరియాలో కనుచూపుమేరా అంతా కూడా ఆహ్లాదకరంగా, అందంగా, ఆకర్షణీయంగా, టూరిస్టుల మనసులకు హత్తుకునేలా ఉండాలి.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
టూరిస్టుల కోసం కొత్తగా… | Tourist Connectivity Map
టూరిస్టుల కోసం కొత్తగా కొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. కొన్ని అంశాలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. అందులో ఇవి కూడా ఉన్నాయి
- బీచ్‌ఫ్రంట్ రింగ్ రోడ్డు
- ఎలక్ట్రిక్ బగ్గీ రూల్స్
- డెడికేటెడ్ సైకిల్ లేన్లు
- క్యూ ఆర్ టూరిస్ట్ ఇంఫో పాయింట్స్
- హిల్‌టాప్ స్కై వాక్స్
- షటిల్ లూప్స్
- రాత్రి టూరిజం లైటింగ్ జోన్స్
ఇలా కనెక్టివిటీనీ పెంచితే పర్యాటకుల తాకిడి నాలుగు రెట్లు పెరుగుతుంది అని భావిస్తున్నారు.
మొత్తానికి బే సిటీ ప్రాజెక్టు అనేది సుందరీకరణ వంటి ప్రాజెక్టు కాదు..ఇది పూర్తిగా స్థానిక ఆర్థిక, పర్యాటక రంగం రూపు రేఖల్ని మార్చే అద్భుతమైన కార్యక్రమం. స్థానికుల జీవన విధానాన్ని కూడా మార్చే సత్తా ఉన్న ప్లాన్ ఇది.
ఈ ప్రణాళిక అనుకున్న విధంగా ముందుకు సాగితే నెక్ట్స్ 5 ఇయర్స్‌లో దక్షిణాదిలో Top 5 Coastal Tourist Powerhouse In South India ఒకటిగా Vizag Bay City నిలవడం ఖాయం.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
