Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి
Beyond Biryani : హైదరాబాద్ అంటే చాలా మందికి బిర్యానీ, ఇరానీ ఛాయ్, హలీమ్ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ హైదరాబాద్ అంటే ఇంతకు మించినవి కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ అవి వీటి అంత పాపులర్ కాదు. అందుకే ఈ రోజు పాపులారిటీని పక్కన పెట్టి సిన్సియర్‌గా ఫుడ్ లవర్స్ మనసు దోచుకుంటున్న డిషెస్‌ను చెక్ చేద్దాం.
ముఖ్యాంశాలు
ఫుడ్ అంటే డిష్ కాదు..ఒక లైఫ్ స్టైల్ | Hyderabad Food Lifestyle
నిజానికి హైదరాబాద్ అంటే ఒక రుచుల ప్రపంచం. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో 24 గంటలూ ఫుడ్ దొరుకుతుంది (మీరు అర్థరాత్రి వెళ్లాలి అని చెప్పడం లేదు. రాత్రి ఎంజాయ్ చేయడం అనేది మన బ్రెయిన్ ట్రిక్ అంతే. వీలైతే రాత్రి 11 లోపే లైఫ్‌ను ఎంజాయ్ చేయండి. ఫ్యామిలిమెన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక విషయానికి వద్దాం)..
మార్నింగ్ టిఫిన్ నుంచి మధ్యాహ్నం తెలంగాణ శాకం (Telangana Cuisine) వరకు, సాయంత్రం స్ట్రీట్ స్నాక్స్ అండ్ అర్థరాత్రి కబాబ్, గ్రిల్స్ అండ్ చలికాలం చిల్స్ వరకు…you have too many options.

హైదరాబాద్ (Hyderabad) అంటే తెలంగాణకు మాత్రమే రాజధాని కాదు…ఇది పూర్తి ఫుడ్ ప్రపంచానికి కూడా రాజధాని లాంటిది. అలాంటి రాజధానిలో చేపనీటిలో ఈదినట్టు ఈదాను అందుకే మీకోసం ఈ ఫుడ్ స్టోరీ (Food) తీసుకొచ్చాను.
- ఇది కూడా చదవండి : Uday Cafe: ఉదయ్ కేఫ్.. 63 ఏళ్లుగా కొత్త రుచుల మధ్య పాత రుచిని అందిస్తున్న అరుదైన రెస్టారెంట్!
- ఉదయం | Popular Hyderabad Breakfasts : హైదరాబాద్‌లో ఇడ్లీ దోశ, పూరీ, మైసూర్ భజ్జీలతో పాటు పాయా (Paya) నాన్ రోటి కాంబిషేన్ కూడా చాలా పాపులర్.
- మధ్యాహ్నం | Top Lunch Cuisine In Hyderabad : ఆంధ్రా మీల్స్ నుంచి తెలంగాణ థాలీ వరకు, కర్రీల నుంచి చైనీస్ నూడిల్స్ వరకు, మీరు బిర్యానీ అనే అబ్సెషన్ నుంచి బయటికి వస్తేనే మీకు ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తాయి.
- సాయంత్రం : Famous Snacks In Hyderabad : స్నాక్స్ అంటే మిర్చీలు భజ్జీలు ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి. కానీ మార్వాడీ స్నాక్స్ సెంటర్ల దగ్గర దొరికే సమోసాలు, కరకరలాడే కచోరిలు, ఘాటీలు, ఢోక్లా తీని ఒక పీస్ జిలేబీ తినడం అనేది అంతరాత్మకు పార్టీ ఇవ్వడం లాంటిదే. .
- రాత్రి | Night Food In Hyderabad : అఫ్ కోర్స్ మీరు బిర్యానీ, హలీమ్, మంది వంటివి ఎంజాయ్ చేయొచ్చు. కానీ షవర్మా, BBQ, చైనీస్ ఫుడ్, పంజాబీ ఫ్లేవర్స్, నార్త్ ఈస్ట్ స్పెషల్స్ ఇవన్నీ కూడా ట్రై చేయండి.
- డెజర్ట్స్ | Popular Deserts in Hyderabad : హైదరాబాద్‌లో డబుల్ కా మీఠా, ఖుబానీకా మీఠా, ఫిర్నీ చాలా పాపులర్ కదా.
కాస్త వెరైటీగా ఖద్దూకా ఖీర్ ట్రై చేయండి. మొజాంజాహీ మార్కెట్ వెళ్తే జౌసీ హల్వా ట్రై చేయండి. మల్లెపల్లీ దగ్గర కోవా జిలేబీ ట్రై చేయండి. డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి.
హైదరాబాద్ బోలేతో… బిర్యానీ మాత్రమే నహీ భాయ్| Go Beyond Biryani
నేను ఇక్కడ బిర్యానీ లాంటి ఫేమస్ వంటకాలను అవమానించడం లేదు. అవి లెజెండ్స్. నాక్కూడా ఇష్టమే. కానీ మనం ఈ పాపులారిటీ సర్కిల్, ఆ Obsession నుంచి బయటికి వస్తేనే కదా మిగితా వాటిని ఎంజాయ్ చేయగలము. అందుకే ఈ పోస్టు పబ్లిష్ చేస్తున్నాను.
హైదారాబాద్‌లో బిర్యానీకి మంచిన హైదరాబాద్ స్పెషల్స్
- పత్తర్‌కా గోష్ | Pathar Ka Gosht : ఇందులో మటన్‌ను రాయిపై కాలుస్తారు.
- లుఖ్మీ | Lukhmi : సింపుల్‌గా చెప్పాలంటే ఇది హైదరాబాదీ సమోసా వర్షన్. ఇందులో మాంసం కూడా పెడతారు. మీరు వెజిటేరియన్ అయితే ముందుగా చెప్పాలి. అప్పుడే మీకు వెజిటేరియన్ సమోసా ఇస్తారు.
- ఖిచిడీ+ ఖట్టా + ఖీమా | Khichdi+Khatta+Keema : ఇది బెస్ట్ హైదరాబాదీ బ్రేక్‌ఫాస్ట్ కాంబినేషన్.
- జౌసీ హల్వా | Jouzi Halwa : ఒకప్పడు నిజాంకు ఫేవరిట్ హల్వా ఇది. ఇది నిజాం అఫిషియర్ డెజర్ట్. మోాజాంజాహీ మార్కెట్ దగ్గర హమీదీ కంఫెక్షనరీలో దొరుకుతుంది. డిఫరెంట్ టేస్ట్.
- కుబానీ కా మీఠా, డబుల్ కా మీఠా ఇవన్నీ కూడా మీరు ట్రై చేయవచ్చు.
- మంది, అరేబియన్ గ్రిల్స్, చైనీస్ ఫుడ్ ఇవన్నీ ఎక్స్‌ఫ్లోర్ చేస్తేనే కాదా మీరు ఫుడి అనిపించుకుంటారు. ఇవన్నీ టేస్ట్ చేస్తేనే కదా మీ నాలుక నాట్యం చేస్తుంది. ఆత్మ సంతోషిస్తుంది.
BUT BUT BUT…కొత్త రుచులు అనేవి జీవితంలో ఒక భాగం అవ్వాలి. కొత్త రుచులు చూసే అలవాటు సగంలో సగం అవ్వాలి. అంతే కానీ కొత్త రుచులను ఒక వ్యాపారంగా…ఏదో కాంట్రాక్ట్ తీసుకున్నట్టు తింటే మాత్రం ఆత్మకు శరీరాన్ని వదిలేందుకు అవకాశం ఇస్తున్నట్టు.
సో, బయటి ఫుడ్‌ను కేవలం నెలకు ఒకటి రెండు సార్లు తింటే బాగుంటుంది. మిగితా టైమ్ ఇంట్లో ఉన్న ఫుడ్ మాత్రమే తినండి.
ఓల్డ్ సిటీ స్ట్రీట్ ఫుడ్ వాక్ | Old City Street Food Walk
హైదరాబాద్ స్ట్రీట్‌ఫుడ్ అనేది (Hyderabad Street Food) అంతర్జాతీయంగా బాగా పాపులర్. వీటిని టేస్ట్ చేయాలి అంటే 7 PM నుంచి 10 PM మధ్యలో – చార్మినార్ -మదీనా- షాలిబండ- ఘాంసి బజార్‌కు వెళ్లండి. చారిత్రాత్మక వీధులు, చరిత్రకు ప్రతీకగా నిలిచే నిర్మాణాల మధ్య నడుస్తూ ఫుడ్‌ను ఎంజాయ్ చేయడం అనేది ఒక ఫుడ్ యూనివర్సీటీలో నైట్ వాక్ చేసినట్టు అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : Ta.Ma.Sha Cafe : ఓకే కేఫ్‌లో అన్ని రకాల ఆసియా రుచులు..అదే త.మా.షా!
ఈ సమయంలో వీటిని ఎంజాయ్ చేయవచ్చు
- కబాబ్స్
- మిర్చీ బజ్జీ
- కబాబ్స్
- ఫిర్నీ
- పాయా
- లుక్మీ
- ఇరానీ ఛాయ్ ఉస్మానియా బిస్కిట్ లేదా ఫైన్ బిస్కిట్
హైదరాబాద్ ఫుడ్ టైమ్ టేబుల్ | Hyderabad Food Time Table
స్కూల్లో, జాబ్‌లో ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. హైదారాబాద్‌లో ఫుడ్ ఎంజాయ్ చేయడానికి కూడా ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. ఇది ఇప్పటి వరకు ఎవరూ రాసిపెట్టలేదు. అందుకే నేను ట్రై చేశాను.

| Time | ట్రై చేయాల్సినవి |
| 6–9 AM | ఇరానీ ఛాయ్, బిస్కెట్లు, పూరి, దోశ, మైసూర్ భజ్జీ |
| 12–3 PM | బిర్యానీ, మీల్స్ |
| 5–7 PM | హలీమ్, స్నాక్స్, సమోసా కచోరీ లుక్మీ |
| 8–11 PM | కబాబ్స్, నైట్ ఫుడ్ |
లోకల్ ఫుడ్ సీక్రెట్స్ | Hyderabad Food Secrets
ఒక నేరస్తుడిని పట్టుకోవాలి అంటే అతని డబ్బు వెళ్లే మార్గాన్ని వెతకండి అంటారు కదా…అలాగే మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవాలంటే ఆటో డ్రైవర్ ఐడియాలజీని ఫిక్స్ చేసుకోండి. ఆటో డ్రైవర్లు తినే చోటే అసలైన టేస్టీ ఫుడ్ దొరుకుతుంది.
- బిర్యానీతో మిర్చీకా సాలన్ ఇస్తారు కదా…దాన్ని చాలా మంది ట్రై చేయరు. షూ సాక్స్, బండి పెట్రోల్, గుండె ప్రేమ అనేది ఎలాంటి కాంబినేషనో ఇది కూడా అలాంటి కాంబినేషన్.
- హలీమ్ తీసుకున్న తరువాత భయ్యా నింబూ దేనా, ప్యాజ్ దేనా అని అడిగి మరీ నిమ్మకాయ, వేయించిన ఉల్లిపాయలు తీసుకుని గార్నిష్ చేయండి. Haleem Without Lemon and Fried Onion is not haleem, its an insult to haleem. (kidding)
- ఇక రంజాన్ సమయంలో ఫుడ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే రాత్రి 8 తర్వాతే ఓల్డ్ సిటీ వెళ్లండి.
- ఇది కూడా చదవండి : Eateries In Goa : గోవాలో తప్పకుండా ట్రై చేయాల్సిన 10 రెస్టారెంట్స్ ఇవే
Beyond Biryani : హైదరాబాద్‌లో ఏం తిన్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు..ఎప్పుడు, ఎక్కడ, ఎవరి దగ్గర తిన్నాం అన్నదే ఇంపార్టెంట్. బిర్యానీతో మొదలైన హైదరాబాదీ ఫుడీ జర్నీ బిర్యానీతోనే ముగియరాదు…ఎందుకంటే హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు..
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
