ట్రెక్కింగ్ చేసే ముందు ఈ Pants గురించి తెలియకపోతే నష్టం మీకే | Convertible Trek Pants
Convertible Trek Pants : హిమాలయాల్లో ట్రెక్ అంటే జస్ట్ వాకింగ్ మాత్రమే కాదు. అది ఒక ఫిజికల్ అండ్ మెంటల్ టెస్ట్. మార్నింగ్ చిక్కని ఛాయ్, మధ్యాహ్నం చక్కని ఎండ, సాయంత్రం హఠాత్తుగా కురిసే వర్షం…ఇలా ఒక్కరోజులోనే పలు విధాల వాతావరణం చూసే అవకాశం లభిస్తుంది.
ఇలాంటి ఊహకందని వాతావరణంలో మనం ఎన్ని రకాల దుస్తువులు, వస్తువులు తీసుకెళ్లాల్సి ఉంటుందో ఊహించండి. లిస్టు చాలా పెద్దది అవుతుంది కదా…అందుకే వీలైనంత వరకు మల్టిపుల్ యూజ్ అయ్యే వస్తువులను ఎంచుకుంటే బెటర్.
ముఖ్యాంశాలు
ఈ పోస్టులో మీకు కర్వర్టిబుల్ ట్రెక్ పాంట్స్ (Convertible Trek Pants) అంటే ఏంటి ? దానివల్ల లాభాలేంటి ? ఎక్కడ కొనాలి ? ఎక్కడవాడాలో వివరిస్తాను.
కన్వర్టిబుల్ ట్రెక్ పాంట్స్ అంటే ఏంటి ? | What is Convertible Trek Pants
కన్వర్టిబుల్ ట్రెక్ పాంట్స్ అంటే సింపుల్‌గా జిప్ ఓపెన్ చేస్తే రెండు భాగాలుగా మారే ట్రెక్కింగ్ (Trekking) పాంట్స్.
- ఇందులో మోకాలి భాగంలో గట్టి జిప్ ఉంటుంది
- ఆ జిప్ ఓపెన్ చేస్తే పాంట్ కింది భాగం సులభంగా సెపరేట్ అవుతుంది.
- వెంటనే ఫుల్ పాంట్ కాస్తా షార్ట్‌గా మారిపోతుంది.
- మీరు మళ్లీ అటాచ్ చేస్తే ఫుల్ పాంట్గా మారిపోతుంది.
ఒక్క ముక్కలో చెప్పాలంటే ఒక్క పాంటు రెండు ఉపయోగాలు అన్నమాట. లాంగ్ ట్రెక్స్కి ఇది ఒక స్మార్ట్ సొల్యూషన్ అని చెప్పవచ్చు.
- ఇది కూడా చదవండి : Solo Female Travelers : మహిళలు ఒంటిరి ప్రయాణాలు ఎలా ప్లాన్ చేసుకోవాాలి ? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి?
నేను ఎందుకు ఈ ప్యాంట్ ఉపయోగించాను ? | Why To Use Them
నేను ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ట్రెక్కి (Valley Of Flowers Trek) వెళ్లినప్పుడు అక్కడ నాకు ఈ ట్రెక్ పాంట్ బాగా ఉపయోగపడింది. ఎందుకంటే హిమాలయాల్లో వాతావరణం క్షణానికి ఒకసారి మారిపోతుంది.
- ఉదయం చాలా చల్లగా, మంచు, చల్లని గాలి వీస్తూ ఉంటుంది.
- ఈ సమయంలో ఫుల్ పాంట్ వేసుకోవడం చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది.
ఇక మధ్యాహ్నం
- ఎండ బాగా పెరుగుతుంది.
- బాగా నడవటం వల్ల చెమట బాగా పెరుగుతుంది.
- అప్పుడు జిప్ ఓపెన్ చేసి లోయర్ ప్యాంట్ రిమూవ్ చేయవచ్చు.
- షార్ట్‌లో సులభంగా నడవడంతో పాటు కాస్త వేడి నుంచి రిలీఫ్ దొరకుతుంది.
- ఇది కూడా చదవండి : Cosmetic Tourism : కాస్మెటిక్ సర్జరీల కోసం విదేశీ పర్యటనలు…టూరిజంలో కొత్త ట్రెండ్ !
రాత్రి సమయంలో…
- హిమాలయాలు (Himalayas) వంటి మంచు పర్వతాల్లో టెంపరేచర్ వేగంగా డ్రాప్ అవుతుంది. శీతల గాలులు వీస్తాయి.
- చాలా చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు వెంటనే జిప్ క్లోజ్ చేస్తే ఫుల్ పాంట్ అయిపోతుంది.
- ఇలా ఈ ప్యాంట్‌తో రోజంతా ఉష్ణోగ్రతలకు అనుగుణంగా అడ్జస్ట్ అయ్యే అవకాశం లభించింది.
ట్రెకింగ్ పాంట్ ఎలా జిప్ అండ్ అన్ జిప్ చేయాలో మీకోసం ఇన్‌స్టాగ్రామ్‌లోని prayanikudu official లో పోస్ట్ చేశాను. ఒకసాని చూడండి. అలాగే తప్పకుండా ఫాలో అవ్వండి.
ట్రెక్ ప్యాంట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు | Trek Pants Benefits
1.ఎలాంటి వాతావరణం అయినా..
మీ వద్ద ట్రెక్ ప్యాంట్ ఉంటే ఎలాంటి వాతావరణంలో అయినా మీ ప్రయాణంలో ఇబ్బంది ఉండదు. వాతావరణాన్ని బట్టి షార్ట్ నుంచి పాంట్…పాంట్ నుంచి షార్ట్‌గా మార్చుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : Travel Tips 05 : తెలంగాణలో చవకగా ట్రావెల్ చేసే 7 మార్గాలు
2. తక్కువ బరువు
ఈ ట్రెక్ పాంట్స్ను తక్కువు బరువు ఉండేలా నైలాన్, పాలిస్టెర్, స్పాండిక్స్ ఉపయోగించి తయారు చేస్తారు.
- దీని వల్ల వీటి బరువు ఎలాగూ తక్కువగా ఉంటుంది.
- సాధారణ పాంట్లతో పోల్చితే అంత స్పేస్ ఆక్యుపై చేయదు.
- ఇది కూడా చదవండి : Travel Tips 06 : ఏపీ మొత్తం చవకగా తిరగాలి అనుకుంటున్నారా ? 7 హ్యాక్స్ ట్రై చేయండి
3. చెమటను అదుపు చేస్తుంది

వేడిలో ఈ పాంట్స్ వేసుకుని నడిస్తే
- చెమటను పీల్చుకుని త్వరగా ఎండుతాయి (Quick Dry Pants)
- స్కిన్ ఇరిటేషన్ తగ్గుతుంది.
- ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది
- గాలి ప్రవాహం బాగుంటుంది
- సులభంగా నడవవచ్చు.
దీంతో పాటు పర్వతాలు (Mountain Treks) అధిరోహించే సమయంలో మధ్యలో వచ్చే జలపాతాల్లో (Water Stream) ప్యాంట్ తడవకుండా జిప్ ఓపెన్ చేసి షార్ట్ చేసుకోవచ్చు. పాంట్ తడిచే అవకాశమే లేదు.
కొనేముందు ఇవి చెక్ చేయండి | Things To Check Before Buying
మీరు ఈ ట్రెక్ పాయింట్స్ కొనేముందు అది క్విక్ డ్రై పాంటా కాదా, బ్రీథబులా, స్ట్రెచబులా అని చెక్ చేసుకోండి.
- దీంతో పాటు జిప్ క్వాలిటీ చెక్ చేయండి.
- అలాగే మోకాలి భాగంలో ఇబ్బది ఏమైనా ఉందా చెక్ చేయండి
- అలాగే మీకు బాగా ఫిట్ అవుతుందా లేదా…
- జిప్ పాకెట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయండి.
ఈ పాంట్స్ హిమయాలల్లో వెళ్లే లాంగ్ ట్రెక్ కి, మల్డిడే ట్రెక్స్కి, వాతావరణం మారే ప్రదేశాలకు, బిగిన్నెర్స్కి, బడ్జెట్ ట్రావెలర్స్‌కి బాగా సెట్ అవుతాయి.
ఒక ప్రయాణికుడిగా (Prayanikudu) నేను పర్సనల్లీ రికమండ్ చేసే ఈ ట్రెక్కింగ్ గేర్‌లో (Trekking Gear) ఈ కన్వర్టబుల్ ట్రెక్ పాంట్ టాప్ ప్లేస్‌లో ఉంటాయి.
ఈ ట్రెక్ అండ్ గేర్ రియల్ ఎక్స్‌పీరియెన్స్ చూడాలంటే
య్యూబ్యూబ్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ప్రయాణికుడు వీడియోస్ చూడగలరు
అలాగే ట్రావెల్, ట్రెక్కింగ్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం
prayanikudu.com ను విజిట్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
