Travel Tips 39 : గ్లేసియర్ వాటర్ తాగొచ్చా? అందులో బ్రెయిన్తినే అమీబా ఉంటుందా ? | Glacier Water
Glacier Water : కొన్ని రోజుల క్రితం హిమాలయాల్లో గ్లేసియర్ నుంచి జాలువారుతున్న నీటిని బాటిల్లో నింపి తాగాను. అది చూసిన ఒక యూజర్ అందులో అమీబా ఉంటుంది బ్రెయిన్ తినేస్తుంది అని కామెంట్ చేశాడు. మరి అది నిజమేనా ? చదవండి
Glacier Water : కొన్ని రోజుల క్రితం నేను వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (Valley Of Flowers) ట్రెక్కింగ్‌కు సంబంధించిన ఒక షార్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాను. అందులో గ్లేసియర్ నుంచి జాలువారుతున్న నీటిని బాటిల్లో నింపి తాగాను.
నీళ్లు నింపడానికి ముందే ఇందులో ఆయుర్వేద గుణాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ నేను ట్రై చేస్తున్నాను అని అన్నాను.
నా బ్రెయిన్ పరిస్థితి ఏంటి ?
ఈ వీడియో చూసిన కొంత మంది ఇది చాలా డేంజర్ అని కామెంట్ చేశారు. అందులో ఒక యూజర్ అయితే

“Ayurvedic gunalato patu Amoeba kuda untundi 😂 adhi brain eating bacteria”
ఆయుర్వేద గుణాలతో పాటు అమీబా కూడా ఉంటుంది అన్నారు. అమీబా గురించి తెలుసు కదా ఎక్కడైనా దూరిపోతుంది. దూరిపోయి ఆ ప్రదేశాన్ని కబ్జా చేసి నాశనం చేసిపడేస్తుంది. ఇది బ్రెయిన్ తినేస్తుంది అనేసరికి నాక్కొంచెం డౌట్ వచ్చింది.
- ఇది కూడా చదవండి : స్మార్ట్ ట్రావెలర్ వద్ద ఉండాల్సిన 5 గ్యాడ్జెట్స్ ఇవే !
- ఇది కూడా చదవండి : విదేశీ ప్రయాణంలో మందులు ఎలా ప్యాక్ చేసుకోవాలి ? | Medicines For An International Trip
ఇంత కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు..మరి నిజంగా గ్లేషియర్ నీటిలో అమీబా ఉంటుందా అని రీసెర్చ్ చేశాను. మీక్కూాడా శాస్త్రీయంగా వివరిస్తాను.
ముందు ఒకసారి ఆ రీల్ చూడండి
గ్లేషియర్ నీళ్లు 100 శాతం సేఫ్ ? | Is Glacier Water 100 Percent Pure?
నిజానికి గ్లేషియర్ నీళ్లు చూడటానికి పరిశుభ్రంగా కనిపిస్తాయి. కానీ అది 100 శాతం సేఫ్ అని చెప్పడం మాత్రం తప్పే అవుతుంది. ఎందుకంటే అందులో ఎన్నో సూక్ష్మ జీవులు, డస్ట్ పార్టికల్స్ ( మట్టీ అలాంటివి), జంతువుల ద్వారా వచ్చే మలినాలు, మరికొన్ని రకాల బ్యాక్టీరియా లేదా ప్రోటోజోవా ఉండే అవకాశం ఉంటుంది.
దీనిని బట్టి కంటికి కనిపించినంత మంచిది కాదు…అలాగని మరీ అంత మలినమైనవీ కావు. మరి నేను తాగిన నీరు సేఫా కాదా ? చదవండి .
- ఇది కూడా చదవండి :విదేశీ ప్రయాణానికి మందులు ఎలా ప్యాక్ చేయాలి? కంప్లీట్ గైడ్ | Medicines For An International Trip
- ఇది కూడా చదవండి : Flight Attendants : ఫ్లైట్ అటెండెంట్లు చేతులు ఎందుకు లాక్ చేసుకుని కూర్చుంటారు?
అమీబా నా బ్రెయిన్‌లోకి ఎక్కిందా ? | Brain Eating Amoeba in Glacier Water ?
Fact Check : పైన ఒక మిత్రుడు నా మేలు కోరే అది కామెంట్ చేశాడు. నా వీడియో చూసి చాలా మంది అలా నీళ్లు తాగేస్తే ప్రమాదం అని అలా కామెంట్ చేసి నిజం చెప్పే ప్రయత్నం చేశాడు. దీనిని నేను పాజిటీవ్‌గానే తీసుకుంటాను.
చెక్ చేస్తే ఏం తెలిసింది అంటే…
- ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది వెచ్చగా, నిల్వగా ఉన్న నీటిలో పెరుగుతుంది. దీనిని Warm Stagnant Water అంటారు.
- ఇది గ్లేషియర్ నీటిలో (Glacier Water ) పెరగదట.
- మంచులా చల్లగా ఉండే నీటిలో, ప్రవాహించే నీటిలో ఈ అమీబా పెరగదట.
- ఇక హిమాలయ పర్వతాల నుంచి వేగంగా జారిపడే ఈ నీటిలో అమీబా బతికి బట్టకట్టడం అంత సులభం కాదు. అరుదు.
సో మిత్రుడి కామెంట్ నన్ను కాస్త టెన్షన్ పెట్టినా…సైంటిఫిక్‌గా అది కరెక్టు కాదు. అయితే మరి నేను నూటికి నూరు శాతం సేఫా ?
కొంత మందికి గ్లేషియర్ నీటివల్ల కడుపు నొప్పి ఎందుకు వస్తుంది ?
ప్రవాహించే చల్లని గ్లేషియర్ నీటిలో అమీబా ఉండే అవకాశం ఉండే అవకాశం తక్కువ అనుకుంటే మరి చాలా మందికి కడుపు నొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?
ఎందుకంటే అందులో సాధారణ బ్యాక్టీరియా, సడిమెంట్, గియార్డియా, జంతువుల నుంచి వెలువడిన మలినాలు కలిసే అవకాశం ఉంటుంది. సో అలాంటి నీరు తాగినప్పుడు అది ప్రాణం తీయకపోవచ్చు కానీ కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తే రావచ్చు.
- ఇది కూడా చదవండి : First time Flyers : ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే
- ఇది కూడా చదవండి : Jet Lag Decoded : జెట్లాగ్ అంటే ఏంటి ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?
గ్లేషియర్ నీళ్లు ఎప్పుడ తాగాలి ? | When To Drink Glacier Water
ట్రెక్కింగ్ చేసే సమయంలో మీరు గమనించే ఉండవచ్చు…ట్రెక్కర్స్ ఎక్కువగా గ్లేషియర్ నీళ్లు, జలపాతాల నుంచి వచ్చే నీళ్లు తాగుతుంటారు. ట్రెక్కర్లు సాధారణం ఎలాంటి నీటిని తాగుతారంటే ….
- వేగంగా కదులుతున్న నీటిని
- మంచులా చల్లగా ఉండే నీటిని
- ఎక్కువ ఎత్తులో అంటే హై ఆల్టిట్యూడ్ ఉన్న నీటిని
- జంతువుల ఆవాసాలు, వాటి ఉనికి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న నీటిని తాగుతారు.
సో, పైన వీడియోలో మీరు చూసినట్టు నేను కూడా సుమారు 12,000 అడుగుల ఎత్తులో అంతకు మించిన ఎత్తునుంచి జరజర జారే చల్లని నీటిని తాగాను. తాగిన తర్వాత ఏ సమస్యా రాలేదు.
అంటే హిమాలయాల నీరు 100 శాతం సేఫా ? | Does Himalayan Water is 100 Percent Safe?
ఇది చాలా మందిలో కలిగే ప్రశ్న…దీనికి సమాధానం ఏంటంటే ఇది నూటికి నూరు శాతం సేఫ్ అని చెప్పలేము. నిజానికి హిమాలయాల్లో నీరు Himalayas) చాలా ప్యూర్‌గా రుచికరంగా ఉంటాయి.
కానీ అది ఫిల్టర్ చేయని నేచురల్ వాటర్ కాబట్టి ఎంతో కొంత రిస్కు అయితే ఉంటుంది. అందుకే
- ట్రెక్కింగ్ చేసే సమయంలో లైఫ్ స్ట్రా (Lifestraw / గ్రేయ్ (Grayl) వంటి ఫిల్టర్ బాటిల్ తీసుకెళ్లండి.
- నీటిని శుద్ధి చేసే ప్యూరిఫికేషన్ టాబ్లెట్ తీసుకెళ్లండి.
- ఆ నీటిని తీసుకెళ్లి క్యాంపు వద్ద వేడి చేసి చల్లారాక తాగండి.
- ఇలా చేయడం వల్ల 90 నుంచి 99 శాతం వరకు సూక్ష్మ జీవులు తొలగిపోయే అవకాశం ఉంది.
- ఇది కూడా చదవండి : Cosmetic Tourism : కాస్మెటిక్ సర్జరీల కోసం విదేశీ పర్యటనలు…టూరిజంలో కొత్త ట్రెండ్ !
- ఇది కూడా చదవండి : Solo Female Travelers : మహిళలు ఒంటిరి ప్రయాణాలు ఎలా ప్లాన్ చేసుకోవాాలి ? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి?
ఇక నేను ఈ నీరు ఎందుకు తాగాను అంటే…
మంచు కొండల్లో ట్రెక్కింగ్ (Trekking) చేసే సమయంలో ఇలా కొన్ని జలపాతాలు కనిపిస్తాయని తెలుసు. దాని నుంచి వచ్చే నీరు తాగొచ్చు అని తెలుసుకుని బాటిల్ నీటిని కాకుండా నేచర్ నుంచి వచ్చే నీటిని నేరుగా తాగాలి అనుకున్నాను. ఇది కూడా ఎక్స్‌పీరియెన్స్ కదా.
అందుకే నేను రిస్కు లేకుండా హై ఆల్టిట్యూడ్ నుంచి స్పీడ్‌గా ఫ్లో అవుతున్న స్వచ్ఛమైన నీటిని బాటిల్లో నింపితాగాను.ఇది ఒక కాలిక్యులేడెడ్ రిస్కు. మీరు కూడా ఇలాంటి నీరు తాగే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అవసరం అయితేనే రిస్కు తీసుకోండి.
- ఇది కూడా చదవండి : Cosmetic Tourism : కాస్మెటిక్ సర్జరీల కోసం విదేశీ పర్యటనలు…టూరిజంలో కొత్త ట్రెండ్ !
- ఇది కూడా చదవండి : Solo Female Travelers : మహిళలు ఒంటిరి ప్రయాణాలు ఎలా ప్లాన్ చేసుకోవాాలి ? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి?
ఫైనల్‌గా గ్లేసియర్ నీళ్లు సేఫ్ అయి ఉండొచ్చేమో కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుని తాగాలి. ఇక అమీబా లాంటి కామెంట్స్ చూసి ఇలా రీసెర్చ్ చేసే అవసరం వస్తుంది అని మాత్రం నేను ఊహించలేదు.
ఎనీ హౌ…నా మైండ్‌లో అమీబా లేదు అని తెలిశాక అమీర్‌పేట్‌లో విండో షాపింగ్ చేసినంత సంతోషంగా అనిపించింది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
