Free Bus Travel For Women : ఏపిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం…ఎప్పటి నుంచి అంటే…
Free Bus Travel For Women : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్త. త్వరలో ఆర్టిసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని కల్పించే దిశలో అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ మేరకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
కొత్త బస్సులు…సౌకర్యాలు | Free Bus Travel For Women
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన కీలక అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రయాణికుల సౌకర్యం, ఉద్యోగుల సంక్షేమంతో పాటు అదనపు బస్సులను తీసుకోవడంతో పాటు అద్దెకు తీసుకునే అంశంపై చర్చలు జరిగాయి.

ఏపి ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్పుల శాతాన్ని పెంచే దిశగా 750 విద్యుత్ బస్సులను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశలో పలు అంశాలపై ఫోకస్ పెట్టారు.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
ఉచిత బస్సు ప్రయాణం తేది…| APRTC Free Bus For Women Date
ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం మౌళిక సదుపాయాల కల్పన గురించి అధికారులు చర్చించారు. ఇక ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు తగిన జరుగుతున్న ఏర్పాట్ల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమీక్షా సమావేశాలో ఏపీ ఆర్టిసి చైర్మన్ కే నారాయణ రావు, మేనేజింగ్ డైరక్టర్ ద్వారకా తిరుమల రావు ఇతర కీలక అధికారులు పాల్గొన్నారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.