హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చిన ప‌ట్టాభి రాముడు | Sri Kodandarama Temple in Tirupati

షేర్ చేయండి

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Sri Kodandarama Temple in Tirupati) వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అయిన ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.

తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు (Sri Kodandarama Temple in Brahmostavalu) వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అయిన 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవను వీక్షించడానికి, స్వామి వారిని దర్శించుకోవడానికి దూరదూరం నుంచి భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. స్వామి వారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. 

ఆంజనేయుడి వాహన సేవ విశిష్టత | Significance Of Hanuman Vahana Seva

Sri Kodandarama Temple in Tirupati
హనుమాన్ వాహనంపై భక్తులకు అభయం ఇస్తూ జగదభిరాముడు

జగదభి రాముడు, రఘుకుల సోముడు అయిన శ్రీరాముడికి (Lord Rama) అత్యంత ఇష్టమైన భక్తుల్లో ఆంజనేయుడు ఒకరు. త్రేతాయుగంలో శ్రీరాముడి భక్తుడిగా, దేవుడి భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధి చెందాడు అంజన్న. 

అలాంటి తన భక్తుడైన హనుమంతుడికి ( Lord Hanuman) శ్రీరాముడే స్వయంగా ఆత్మతత్వాన్ని బోధించాడన ప్రాచీన వాజ్మయాలు తెలుపుతున్నాయి. పవనపుత్రుడు తనను సేవించే భక్తులకు కూడా ఆత్మోన్నతిని ప్రసాదిస్తారంటారు. ఇక శ్రీవైష్ణవ సాంప్రదాయం (Vaishnava Tradtion) ప్రకారం హనుమాన్ వాహన సేవను తిరువడి అని కీర్తిస్తారు.

స్నపన తిరుమంజనం | Sri Kodandarama Temple in Brahmostavalu

Tirupati Kodandarama Swamy HANUMANTA VAHANA SEVA
హనుమాన్ సేవలో కళాకారుల ప్రదర్శనలు

Sri Kodandarama Temple in Tirupati : ఉదయం 8 గంటలకు వాహన సేవ ప్రారంభం కాగా 10 గంటల 30 నిమిషాలకు శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రుల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చందనం, పసుపు, కొబ్బరినీళ్లు, పాలు, పెరుగు, తేనె వంటి పదార్థాలను వినియోగించారు.

హనుమాన్ వాహన సేవలో శ్రీ పెద్ద జీయర్ స్వామి (Pedda Jiyar Swamy), శ్రీ చిన్నజీయర్ స్వామితో పాటు ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!