ఎయిర్ బెలూన్ చెరువులో ల్యాండ్ అయిందా? కెప్టెన్ క్లారిటీ | Balloon Emergency Landing Fact Check
Balloon Emergency Landing Fact Check : తెలంగాణ అంతర్జాతీయ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026 కు సంబంధించి, జనవరి 17వ తేదీ ఉదయం జరిగిన హాట్ ఎయిర్ బెలూన్ యాక్టివిటీస్ గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు షేర్ అవుతున్నాయి. ఈ విషయంపై ఫెస్టివల్ ఆర్గనైజర్లు, అలాగే ఏవియేషన్ నిపుణులు క్లారిటీ ఇచ్చారు.
అసలు ఏం జరిగింది ? | Hot Air Balloon Landing In Lake News
ఫెస్టివల్ రోజు ఉదయం 18 హాట్ ఎయిర్ బెలూన్లు, DGCA (Directorate General of Civil Aviation) మార్గదర్శకాల ప్రకారం, పూర్తిగా సేఫ్టీ నార్మ్స్ ఫాలో అవుతూ విజయవంతంగా ఆపరేట్ చేయబడ్డాయి. అన్ని బెలూన్లు అంతర్జాతీయ ఏవియేషన్ స్టాండర్డ్స్ ప్రకారం గాలిలోకి ఎగిరి, ప్రయాణం పూర్తి చేసి సేఫ్ అండ్ కంట్రోల్డ్ మేనర్లో ల్యాండ్ అయ్యాయి.
సోషల్ మీడియాలో కొన్ని అకౌంట్లు బెలూన్లు చెరువులో ల్యాండ్ అయ్యాయి అని ప్రచారం చేశాయి. కానీ నిజం ఏంటంటే, బెలూన్ ల్యాండింగ్ అనేది నార్మల్ ఆపరేషనల్ ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. ఈ ఈవెంట్లో:
- ఎలాంటి సాంకేతిక లోపం లేదు
- ఎమర్జెన్సీ సిచువేషన్ రాలేదు
- ప్రయాణికులకు సేఫ్టీకి సంబంధించిన సమస్యలు ఏవీ జరగలేదు
అని స్పష్టంగా తెలిపారు.
Update : జనవరి 18వ తేదీన కొన్ని పత్రికలు హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ను ధృవీకరిస్తూ వార్తలు ప్రచురించాయి. మరికొన్ని పత్రికలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరినట్టు ప్రచురించడంతో పాటు ప్రెస్ రిలీజ్లో నిర్వహాక సంస్థ అధికారులు ఇచ్చిన క్లారిటీని కూడా ప్రచురించారు. ఈ ప్రెస్‌నోట్ సారాంశం..
ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరలేదు : సంస్థ వివరణ
హాట్ ఎయిర్ బెలూన్ ఆపరేషన్స్ గురించి Sky Waltz Hot Air Ballooning సంస్థలో Chief of Staff & Safety Managerగా పని చేస్తున్న ఏవియేషన్ నిపుణులు కెప్టెన్ ఎం. చౌహాన్ వివరణ ఇచ్చారు. ఆయన ప్రకారం, హాట్ ఎయిర్ బెలూన్లకు విమానాల మాదిరిగా ఫిక్స్డ్ రన్వేలు లేదా ముందే నిర్ణయించిన ల్యాండింగ్ ప్రదేశాలు ఉండవు.
బెలూన్లు గాలి ఎలా వీస్తుందో అదే దిశలో ప్రయాణిస్తాయి. అందులో ఉన్న పైలట్, పరిస్థితులను అంచనా వేసుకుంటూ, పొలాలు లేదా ఓపెన్ గ్రౌండ్‌లాంటి సురక్షిత ప్రాంతాల్లో బెలూన్ను ల్యాండ్ అయ్యేలా చూసుకుంటాడు.
- ఇది కూడా చదవండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు చిట్ చాట్
సోషల్ మీడియాలో చెరువు పక్కన బెలూన్ ల్యాండ్ అయినట్లు చెబుతూ ఒక వీడియో షేర్ అవుతోంది. అయితే ఆ వీడియోకి సంబంధించిన పూర్తి బ్యాక్‌గ్రౌండ్ చాలామందికి తెలియకపోవడంతో, తప్పు అర్థాలు ఏర్పడుతున్నాయి. అందుకే ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ పబ్లిష్ చేస్తున్నాను.

ఇందులో ఫ్యూయల్ సిలిండర్‌పై ఉన్న డివైజ్ / జీపీఎస్ గాలి వీచే దిశ, మరో 5-10 నిమిషాలు బెలూన్ ఎటువైపు వెళ్లే అవకాశాన్ని పైలెట్ తెలుసుకుంటాడు పైలెట్. దానిని బట్టి బెలూన్ను కంట్రోల్ చేస్తాడు. అదే సమయంలో గాలి బెలూన్ను తీసుకెళ్లే దిశలో ఉన్న మైదానం లేదా పొలాలు లాంటి ఓపెన్ ప్రదేశాలను కూడా చూస్తుంటాడు.
ఎప్పటికప్పుడు గాలి తీవ్రత గురించి తెలుస్తూ ఉంటుంది. గాలి దిశ, బలం, అసలు గాలి లేకపోవడం వంటి సందర్భాల్లో బెలూన్ను దగ్గర్లోని మైదాన ప్రాంతంలో దింపేస్తాడు.
ఈ డివైజ్ అండ్ శాటిలైట్ ఫోన్ ద్వారా గ్రౌండ్ స్టాఫ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో గ్రౌండ్ స్టాఫ్ రోడ్డుపై నుంచి బెలూన్ను ట్రాక్ చేస్తూ ఉంటుంది. ఇది నేను గమనించినది. తెలుసుకున్నది.
ప్రయాణికుడు అనుభవం
నేను కూడా ఫెస్టివల్ మొదటి రోజు హాట్ ఎయిర్ బెలూన్‌లో ప్రయాణించాను. ఆ సమయంలో పైలట్ కూడా ఇదే విషయాన్ని వివరించాడు. హాట్ ఎయిర్ బెలూన్ను మనం స్టీరింగ్ చేయలేము, అంటే మనకు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లడం సాధ్యం కాదు. గాలి వెళ్లే దిశలోనే మన ప్రయాణం ఉంటుంది. ఆ దిశలో ఏదైనా సేఫ్ ప్రదేశం కనిపిస్తే అక్కడే ల్యాండ్ అవుతాం అని ఆయన చెప్పారు.
మేము మోయినాబాద్ ప్రాంతంలో ఒక పొలంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాము.
అయితే బెలూన్ లొకేషన్‌ను ఫాలో అవుతూ ఒక టీమ్ రోడ్డుపై వాహనంలో దాన్ని ఫాలో అవుతూ ఉంటుంది. ల్యాండ్ అయిన 5-10 నిమిషాల్లో లేదా అంత కన్నా వేగంగా వచ్చి వెలూన్ను డీఫ్లేటింగ్ (Hot Air Balloon Deflating) అంటే ప్యాకప్ చేస్తారు. వారు వచ్చేలోపు స్థానికుల సాయం కూడా పైలెట్ తీసుకుని బెలూన్లోని వేడి గాలిని తొలగించే ప్రక్రియ మొదలు పెడతాడు.
ఈ విషయాన్ని ఏవియేషన్ నిపుణులు కూడా స్పష్టంగా చెప్పారు. బెలూనింగ్ గురించి సరైన అవగాహన లేకపోవడం వల్లే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయని వారు తెలిపారు.
ప్రయాణికుడు వీడియోలో క్లారిటీ |
ఈ ఆర్టికల్‌ను ప్రజలకు అవగాహన కల్పించడానికి, అధికారుల వర్షన్‌ను వివరించడంతో పాటు, నేను ప్రత్యక్షంగా గమనించిన విషయాన్ని షేర్ చేయడానికి పబ్లిష్ చేస్తున్నాను. హాట్ ఎయిర్ బెలూన్‌లో నా ప్రయాణ అనుభవం, పైలట్ చెప్పిన విషయాలను ఇందులో ప్రస్తావించాను. ఇదే విషయం నేను యూట్యూబ్‌లో పబ్లిష్ చేసిన వీడియోలో కూడా వినవచ్చు.
ఈ వీడియోలో 8:10 డ్యూరేషన్కు వెళ్లే పైలెట్ వివరణ, తరువాత నేను తెలుగులో అది అనువాదం చేసి క్యాప్షన్ ఇవ్వడం గమనించవచ్చు.
ఇకపై ఎవరైనా మీకు ఇలాంటి వీడియోలు షేర్ చేస్తే, మీరు ఈ ఆర్టికల్‌ను వారికి షేర్ చేయవచ్చు. అలాగే నా వీడియోను చూసినట్లయితే, ఈ అంశంపై పూర్తి అవగాహన మీకు వస్తుంది.
Note: ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న వివరాలు అధికారికంగా అందిన సమాచారం, ఏవియేషన్ నిపుణుల వివరణ, అలాగే వ్యక్తిగత అనుభవం ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. ఎలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశం లేదు.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
