ట్రెక్కింగ్‌లో బ్రేక్స్ ఎలా తీసుకోవాలి ? ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలి ? | How To Take Breaks During Trek
How To Take Breaks During Trek : ట్రెక్కింగ్ అంటే పర్వతారోహణ. దీనర్థం కేవలం కొండ చివరికి లేదా సమ్మిట్ ( Summit) పాయింట్‌కు చేరుకోవడం మాత్రమే కాదు…ఈ ప్రయాణాన్ని, పూర్తి ప్రాసెస్‌ను కూడా ఎంజాయ్ చేయడమే ట్రెక్కింగ్. అది కూడా మన ఆరోగ్యాన్ని, ఉత్సాహాన్ని కాపాడుతూ చేయాలి. ఈ పోస్టులో మీకు పనికొచ్చే ఎవర్ గ్రీన్ టిప్ షేర్ చేస్తున్నాను.
ముఖ్యాంశాలు
కొండపైకి కుందేలులా కాకుండా తాబేలులా వెళ్లినా పర్వాలేదు కానీ..ఆగకుండా ముందుకు వెళ్లడం ముఖ్యం. ఆగకుండా వెళ్లడం అంటే నిమిషం కూడా బ్రేక్ తీసుకోకుండా వెళ్లడం కాదు. అలాగని బ్రేక్స్ తీసుకుంటే సినిమా ఇంటర్వెల్ అంత పెద్ద బ్రేక్ కూడా తీసుకోవడం కరెక్టు కాదు. ఇట్స్ ఆల్ బ్యాలెన్స్ గేమ్.
- ఇది కూడా చదవండి : Honeymoon : వీసా అవసరం లేకుండా ఈ ఏడు దేశాల్లో హనీమూన్‌కు వెళ్లొచ్చు.
బ్రేక్ అంటే ఇంటర్వెల్ అంత పెద్దగా ఉండకూడదు | How To Take Breaks During Trek
చాలా మంది కొత్త ట్రెక్కర్స్ (Trekkers) బ్రేక్ తీసుకుంటే అరుగుపైన బాలరాజ కూర్చున్నట్టు, ఇరానీ హోటల్లో సలీమ్ అండ్ గ్యాంగ్ కూర్చున్నట్టు ఉంటుంది. ఎంత ఎక్కువ సేపు కూర్చుంటే అంత ఎక్కువ రిఫ్రెష్ అవుతారు అనుకుంటారు.
కానీ నిజం దానికి పూర్తిగా భిన్నమైనది (telugu travel tips). పర్వతారోహణ సమయంలో లాంగ్ బ్రేక్స్ తీసుకోవడం వల్ల మీ కండరాలు బిగుతుగా మారిపోతాయి. స్టిఫ్నెస్ అంటాము కదా అది. తరువాత మీరు నడక వేగం తగ్గుతుంది. మీ ఎనర్జీ డ్రెయిన్ అయిపోతుంది.
- ఇది కూడా చదవండి : చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే
నేను ట్రెక్కింగ్‌కు వెళ్లడానికి ముందు ట్రెక్ గైడ్‌ను (Trekking) టిప్స్ అడిగాను. అందులో ఒకటి మీకు ఇక్కడ షేర్ చేస్తాను. ఇది చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ కూడా.
మీతో పాటు ఉన్న ట్రెక్కింగ్ పోల్ (Trekking Pole) లేదా కర్రపై నిలబడే మీరు 30 నిమిషాల ఒరిగిపోండి.
ఇలా చేయడం వల్ల మీ మజిల్స్ యాక్టివ్గానే ఉంటాయి. రక్తప్రసరణ పెరుగుతుంది. కండరాలు గాయపడకుండా, బిగుతుగా మారకుండా ఉంటాయి.చప్రపంచంలోని ట్రెక్కింగ్ ఎక్స్పర్ట్స్ చేసేది కూడా ఇదే.
ఇది కూడా చూడండి : మేఘాలయ ఎంత అందంగా ఉంటుందో 10 ఫోటోల్లో మీరు చూసేయవచ్చు
ఈ టెక్నిక్ ఎలా పని చేస్తుందో..మీరు ఎలా చేయాలో సింపుల్‌గా ఈ కింది రీల్లో నేను షేర్ చేశాను. చూడండి.
బ్రేక్ ఎందుకు తీసుకోవాలంటే ? | How To Take Breaks During Trek
ట్రెక్కింగ్ లేదా హైకింగ్ (Hiking tips) చేస్తున్న సమయంలో బ్రేక్ తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది కూడా పైన చెప్పిన విధంగా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే..
- సరైన బ్రేక్ తీసుకోవడం లేదా స్వల్ప విరామం వల్ల కండరాల అలసట, చిట్లింపు తగ్గుతుంది.
- హృదయ స్పందనను సమతుల్యంగా ఉంచుతుంది.
- మెంటల్ ఫోకస్‌ను పెంచుతుంది. చురుకుగా ఉంటారు.
- మోకాళ్లు బిగిసిపోకుండా, నొప్పి కలగకుండా కాపాడుతుంది.
- ఇలా 30 నుంచి 50 సెకన్ల బ్రేక్ తీసుకున్నా మీ ట్రెక్ పూర్తి చేయడానికి మీకు కావాల్సిన సమర్థత పెరుగుతుంది.
- శరీరం రికవర్ అయ్యి మళ్లీ ట్రెక్కింగ్‌కు సిద్ధం అవుతుంది. మీరు ట్రెక్కింగ్‌ను ఎంజాయ్ చేస్తారు.
హిమాయాల్లో నేను చేసిన ట్రెక్కింగ్‌లో అందమైన సీనరీస్తో పాటు పనికొచ్చే టిప్స్ ఎన్నో షేర్ చేశాను. వెంటనే చూడండి. చూసి మీ బంధు మిత్రులతో షేర్ చేయండి.
ప్రయాణికుడు టిప్స్ | Prayanikudu’s Quick Tips for Healthy Trek Breaks
నా సొంత రీసర్చ్ అండ్ నిపుణుల సలహాల ఆధారంగా ఈ టిప్స్ అందిస్తున్నాను. వీటిని గుర్తుంచుకోండి. కేవలం ట్రెక్కింగ్ విషయంలోనే కాదు లాంగ్ వాక్ లేదా ఫిజికల్ యాక్టివీటీ సమయాల్లో కూడా వీటిలో కొన్నింటిని మీరు వ్యక్తిగతంగా వినియోగించుకోవచ్చు.
- నీళ్లు తాగండి (trekking tips) : కొండ ప్రాంతాల్లో చలికి అంతగా దాహం అనిపించదు. కానీ మీరు మాత్రం ప్రతీ 25 నిమిషాలకు కొంచెం నీరు తాగండి. దీనివల్ల డీహైడ్రేషన్ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవచ్చు.
- చిరుతిళ్లు : ట్రెక్కింగ్ సమయంలో మధ్య మధ్యలో ఎనర్జీ కోసం చిరుతిళ్లు తీసుకోవచ్చు. అంటే ఈ సమోసా, కచోరీ, పకోడి లాంటివి కాదు…నట్స్, డ్రై ఫ్రూట్స్ లేదా ఎనర్జీ బార్స్ (Energy Bars) తీసుకెళ్లవచ్చు.
- నేను ఒక సాధువుతో కలిసి భారతదేశంలో తొలి గ్రామం వసుధారా జలపాతం వద్దకు వెళ్లే సయయంలో ఆయన సంచిలో 50 వరకు నారింజ మిఠాయిలు (Orange Candy) ఉండటం చూశాను. ఇప్పటికీ కిరాణా షాపుల్లో అవి లభిస్తాయి. అవి కూడా మీరు తీసుకెళ్లవచ్చు. మొత్తానికి శరీరాన్ని మధ్య మధ్యలో రీచార్జ్ చేయండి. అంతే కానీ కడపు నింపాలి అని అనుకోకండి.
- ఇది కూడా చదవండి : Mana : భారత దేశంలో మొదటి గ్రామం మానా …సరస్వతి నది దర్శనం, వ్యాసుడు వినాయకుడికి మహా భారతం చెప్పిందే ఇక్కడే

- స్ట్రెచ్ చేయండి : బ్రేక్ తీసుకున్నప్పుడు శరీరాన్ని కొంచెం స్ట్రెచ్ చేయండి, కాళ్ల కండరాలు (కాల్వ్స్), తొడల వెనుక భాగం (హ్యామ్‌స్ట్రింగ్స్), భుజాల కదిలిస్తూ తేలికపాటి స్ట్రెచింగ్ చేయడం వల్ల కండరాల్లో బిగువు తగ్గుతుంది.
- శరీర భంగిమను మార్చండి : బ్రేక్ తీసుకుంటే కూర్చోవడం కన్నా మీ ట్రెక్కింగ్ పోల్ ఆధారంగా, లేదా ఏదైనా చెట్టూ, రాయి అధారంగా నిలబడటానికి ప్రయత్నించండి. కూర్చుంటే శరీరం మొత్తం బిగుతుగా మారి కండరాలు పట్టేసే అవకాశం ఉంది.
- శరీరం మాట వినండి : 5 -10 నిమిషాల కూర్చోవడం కన్నా 1 నిమిషం బ్రేక్ తీసుకోవడం వళ్ల మీ కండరాలు రికవర్ అయ్యి వెంటనే మరో 20 నిమిషాలు నడిచేందుకు సిద్ధం అవుతాయి.
ఈ చిట్కాలు చాలా సింపుల్‌గా, సాధారణంగా అనిపించే అవకాశం ఉంది. కానీ స్టిక్ టు ది బేసిక్స్ అంటారు కదా…ఇది కూడా అంతే. ఎక్కడికి వెళ్లినా ఇవే టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి.
ఈ టెక్నిక్స్ పాటిస్తే మీ ట్రెక్కింగ్ కాస్త సేఫ్‌గా, హెల్తీగా, ఆనందరకంగా సాగుతుంది.
మరిన్ని వివరాల కోసం పూర్తి వీడియోను youtube@prayanikudu లో చూడండి.
తెలుగులో మొదటి సారి, 1000 కన్నా ఎక్కువ ట్రావెల్ స్టోరీస్, టిప్స్, గైడ్ చదవడానికి www.prayanikudu.com ను విజిట్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
