హైదరాబాద్ బెలూన్ ఫెస్టివల్లో 3,000 అడుగుల బెలూన్ రైడ్ | Hyderabad Hot Air Balloon Festival 2026 Ride Experience
Hyderabad Hot Air Balloon Festival 2026 Ride Experience : హైదరాబాద్‌లో జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2026 నాకు ఒక అరుదైన ట్రావెల్ అనుభవాన్ని అందించింది. అరుపులు, ఆర్భాటాలు, హడావిడి లేకుండా… థ్రిల్ మిస్ కాకుండా… చాలా ప్రశాంతంగా, సైలెంట్ అండ్ ఎవర్గ్రీన్ జర్నీలా ఈ అనుభవం మిగిలిపోయింది.
ఈ ఫెస్టివల్లో నాకు ఒక లక్కీ ఛాన్స్ దొరికింది. అదే — ఎర్లీ మార్నింగ్ హాట్ ఎయిర్ బెలూన్ ఫ్లైట్‌లో భాగం కావడం.
బెలూన్ రైడ్ ఉదయం సుమారు ఏడు గంటలకు గోల్కొండలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ప్రారంభమైంది. సూర్యోదయం సమయంలో ఆకాశంలో భారీగా రంగురంగుల బెలూన్లు ఎగరడం మొదలైంది. రోజూ చూసే హైదరాబాద్ ఒక్కసారిగా పూర్తిగా కొత్తగా కనిపించడం ప్రారంభమైంది. అది ఒక ప్రశాంతమైన ట్రాన్సిషన్లా అనిపించింది.
బెలూన్ దాదాపు 3,000 అడుగుల ఎత్తు వరకు వెళ్లింది. గోల్కొండ నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరం గాలిలోనే ప్రయాణించాము.
ముఖ్యాంశాలు
మంత్రిగారితో ప్రయాణం
ఈ హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కలిసి ప్రయాణించడం మరిచిపోలేని విషయం. ఇటీవల జరిగిన ఒక ప్రెస్మీట్లో ఆయన చెప్పిన మాటలు ఈ ప్రయాణంలో మరింత అర్థవంతంగా అనిపించాయి.
ప్రతి ఒక్కరు వారానికి లేదా నెలకు రెండు మూడు రోజులు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, అప్పుడు జీవితం ఎంత అందమైనదో అర్థమవుతుందని ఆయన చెప్పారు. అదే సమయంలో ఇలా ప్రయాణించడం వల్ల పర్యాటకం ద్వారా వేల మందికి ఉపాధి లభిస్తుందని కూడా స్పష్టంగా చెప్పారు.

ఈ విషయంపైనే ఆయనను ప్రత్యేకంగా మాట్లాడమని అడిగాను. దానికి ఆయన, నెలకు రెండు రోజులు అయినా ప్రయాణాలు చేయడం వల్ల జీవితం పూర్తిగా ఆస్వాదించే అవకాశం దొరుకుతుందని, అదే సమయంలో కళాకారులు, స్థానికులు, నిరుద్యోగులకు ఆదాయం, ఆధారం లభిస్తుందని చెప్పారు.
ఆయన పూర్తి అభిప్రాయాన్ని 3,000 అడుగుల ఎత్తులో తీసిన వీడియోలో మీరు చూడవచ్చు. ఈ మొత్తం ప్రయాణ అనుభవాన్ని త్వరలోనే ప్రయాణికుడు YouTube ఛానెల్లో షేర్ చేశాను.
ఈ రీల్ కూడా చూడండి
13 కిమీల ప్రయాణం | Hyderabad Balloon Festival
జర్నీలో ముందుకు వెళ్లేకొద్దీ బెలూన్ హిమాయత్ సాగర్ దగ్గరికి చేరినప్పుడు, కింద మొత్తం ఫాగ్ ఉండటంతో ఒక చిన్న సముద్రాన్ని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఫాగ్ మధ్య నుంచి కనిపించిన జలరాశి ఒక మ్యాజిక్‌లా అనిపించింది.

కొద్దిసేపటికి ఫ్లైట్ పూర్తైంది. బెలూన్ మోయినాబాద్ వైపు సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. దిగే ముందు పైలట్ ఒక చిన్న సేఫ్టీ డ్రిల్ చేయించారు. ఆ డ్రిల్ పూర్తయ్యాక పొలం మధ్యలో ల్యాండ్ అయ్యాము.
బెలూన్ బాస్కెట్ నుంచి దిగగానే ఏదో సాధించిన ఫీలింగ్. జూపల్లి గారు చెప్పినట్టు, ఒక చిన్న బ్రేక్ తీసుకుని మెంటల్ రీసెట్ చేసుకోవడం అంటే ఇదేనేమో అనిపించింది.
హైదరాబాద్‌లో ఈ బెలూన్ యాత్ర చేయడం ప్రత్యేకమైన థ్రిల్ ఇచ్చింది. ఇదే ట్రావెలింగ్‌లో ఉన్న మ్యాజిక్ , ఒక కొత్త అనుభవం, ఒక కొత్త ఎనర్జీ. అందుకే పూర్వ కాలంలో సాధువులు కూడా కొత్త ప్రదేశాలకు వెళ్లి అక్కడి పాజిటివ్ ఎనర్జీని తమ జీవితంలోకి తీసుకునేవారు.
“ట్రావెలింగ్ అనేది లగ్జరీ కాదు. ఒక రోజు బ్రేక్లాగా, మెంటల్ రీసెట్లాగా ఉండాలి.” — మంత్రి జూపల్లి కృష్ణారావు
బుకింగ్ రియాలిటీ | హానెస్ట్ అప్డేట్
బెలూన్ ఫ్యాంటసీని మాత్రమే కాకుండా, బుకింగ్ రియాలిటీని కూడా మీతో హానెస్ట్‌గా షేర్ చేస్తున్నాను. హైదరాబాద్ బెలూన్ రైడ్ టికెట్లు BookMyShowలో అధికారికంగా విడుదలయ్యాయి. కానీ డిమాండ్ చాలా ఎక్కువగా ఉండటంతో అన్ని స్లాట్లు ముందే బుక్ అయ్యాయి.
ప్రస్తుతం ఫ్రెష్ టికెట్లు అందుబాటులో లేవు. అయితే భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఈవెంట్స్ ప్లాన్ చేసే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ టూరిజం అధికారిక పోర్టల్‌తో పాటు Prayanikudu.comలో అప్డేట్స్ ఫాలో అవ్వాలని నా మనవి.
టికెట్లు లేకపోయినా ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేయాలి?
హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ దొరకకపోయినా, ఫెస్టివల్ అనుభవాన్ని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు.
2026 జనవరి 16 నుంచి 18 వరకు
పరేడ్ గ్రౌండ్స్, హైదరాబాద్‌లో ఈ ఫెస్టివల్ కొనసాగుతుంది.
దీని గురించి పూర్తి వివరాలతో ఒక ప్రత్యేక ఆర్టికల్‌ను ఇప్పటికే పబ్లిష్ చేశాను. మీ ట్రిప్ ప్లానింగ్‌కు ఉపయోగపడే అన్ని విషయాలు అందులో ఉన్నాయి. లింక్ ఇక్కడ షేర్ చేస్తున్నాను దయచేసి చదివి మీ విజిట్‌ను చక్కగా ప్లాన్ చేసుకోండి.
- హాట్ బెలూన్ ఫెస్టివల్ ఫుల్ గైడ్… Hyderabad Hot Air Balloon Festival Full Guide, Tickets, Venue, Dates and Tips and More
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
