నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది.
హైదరాబాద్‌లోని ప్రముఖ టూరిస్ట్ స్పాట్ అయిన నెహ్రూ జూపార్కు (Nehru Zoo Park) టికెట్లు, రైడ్స్, ఇతర సేవల ధరలను పెంచనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇటీవలే ప్రకటించింది.
ఈ కొత్త చార్జీలు 2025 మార్చి 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ డ్రైవ్, ఫోటోగ్రఫీ చార్జీలు, పార్కింగ్ ఫీజులు అన్ని సేవల ధరలను పెంచనున్నట్టు తెలిపింది. దీంతో జూపార్క్ వెళ్లే వారికి ఆర్థిక భారం పెరగనుంది.
ముఖ్యాంశాలు
కొత్త టికెట్ ధరల వివరాలు | Hyderabad Zoo Park New Ticket Prices and Charges
హైదరాబాద్ జూ పార్కు ధరల్లో ప్రధాన మార్పులు మొదలయ్యేది పార్కు ఎంట్రీ ఫీజుతోనే. గతంలో వీక్‌డేస్‌లో ఒకలా, వీకెండ్‌లో ఒకలా టికెట్ ధరలు ఉండేవి. కానీ ఇకపై వారం మొత్తం ఒకే టికెట్ ధర ఉండనుంది:
- పెద్దలకు (Adults) : గతంలో వీక్ డేస్‌లో రూ.70, వీకెండ్స్‌లో రూ.80 ఉండగా ప్రస్తుతం ఈ టికెట్ ధర ఎప్పుడు కొన్నా అది రూ.100గా ఉండనుంది.
- పిల్లలకు (Childrens) : పిల్లల టికెట్ విషయానికి వస్తే గతంలో వీక్‌డేస్‌లో రూ.45, వీకెండ్‌లో రూ.55 గా ఉండేది. మార్చి ఒకటి నుంచి దీని ధరను యావరేజ్ చేసి రూ.50గా ఫిక్స్ చేశారు.
- Read Also: ఎక్స్ పీరియం ఎకో పార్క్ ఎలా వెళ్లాలి ? టికెట్ ధర ఎంత ? విశేషాలు ఏంటి ? | Hyderabad Experium Eco Park
ఇతర చార్జీలు | Hyderabad Zoo New Charges

ఎంట్రీ ఫీజుతో పాటు జూపార్కులోని ఇతర సర్వీసుల చార్జీలను కూడా పెంచారు. ఈ కొత్త ధరలు కూడా మార్చి 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి.
- ఫిష్ ఆక్వేరియం : గతంలో దీని ధర రూ.10 . దానిని రూ.20 కి పెంచారు.
- సఫారీ పార్క్ డ్రైవ్ (Safari Park Drive) : గతంలో ఏసీ వెహికల్లో వెళ్తే రూ.120 చెల్లించాల్సి వచ్చేది. భవిష్యత్తులో రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఇక నాన్ ఏసీ కోసం రూ.80 చెల్లిస్తే మార్చి నుంచి రూ.100కు దీని టికెట్ లభిస్తుంది.
- టాయ్ ట్రెయిన్ (Toy Train) : గతంలో టాయ్ ట్రెయిన్ టికెట్ కోసం పెద్దలు రూ.45 చెల్లించాల్సి వచ్చేది. ఇకపై రూ.80 చెల్లించాలి. పిల్లల టికెట్ ధరను రూ.25 నుంచి రూ.40కి పెంచారు. అంటే దాదాపు సగం వరకు పెంచారు అని చెప్పవచ్చు.
- ఫోటోగ్రపీ చార్జీలు : స్టిల్ కెమెరాకు ప్రస్తుతం రూ.120 చెల్లిస్తున్నారు. భవిష్యత్తులో రూ.150 చెల్లించాలి. వీడియో కెమెరా చార్జీలను రూ.600 నుంచి ఏకంగా రూ.2,500కు పెంచారు. మూవీ షూటింగ్ అయితే రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది.
- బ్యాటరీ వెహికల్ రైడ్స్ : బ్యాటరీ వెహికల్ రైడ్ టికెట్ల కోసం ఇకపై పెద్దలు రూ.120 చెల్లించాలి. పిల్లల టికెట్ ధర వచ్చేసి రూ.70గా నిర్ణయించారు.
- పార్కింగ్ ఫీజు : సైకిల్ రూ. 10, బైక్స్ రూ.30, ఆటోలు రూ.80, కార్లు రూ.100, టెంపోలు రూ.150
అంత డబ్బు పెట్టి వెళ్లాలా ?
ప్రకృతి ప్రేమికులు (Nature Lovers), పక్షి, జంతు ప్రేమికులతో పాటు వినోదం కోసం చాలా మంది జూపార్కుకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తుంటారు. ఇక్కడికి వెళ్తే ఎన్నో రకాలు జంతు, జీవాలను చూసి ప్రకృతితో మమేకం అయ్యే అవకాశం లభిస్తుంది. కానీ ఎంట్రీ టికెట్‌తో పాటు ఇతర సర్వీసుల టికెట్ ధరలను పెంచాక అసలు జూపార్కుకు అంత డబ్బు పెట్టి వెళ్లాలా అని చాలా మంది ఆలోచిస్తున్నారు.
సినిమాలు ఓటీటీలో చూడొచ్చు…సింహాలను జూలోనే చూాడాలి
ప్రమోట్ చేయడం లేదు కానీ జస్ట్ ఒక ఐడియా వచ్చింది చెబుతున్నాను..సినిమాలను థియేటర్లో కాకపోతే ఓటీటీలో (OTT) చూడగలం. కానీ సింహాలను చూడాలంటే మాత్రం మనం అడవికో లేక జూకో వెళ్లాలి. అది కూడా గుజరాత్‌లో ఉన్న గిర్ ఫారెస్ట్ (Gir Forest National Park) వెళ్లాలి. లేదంటే జూపార్క్ వెళ్లాలి.
కానిజం చెప్పాలంటే పెరిగిన బడ్జెట్ వల్ల సామాన్యులు జూ పార్క్ వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక్కటి మాత్రం మీరు గమనించాలి ధరలు మారాయి, జూ పార్కు కాదు.
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్లే బెస్టు ప్లేసుల్లో జూపార్క్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. పులులను (Animals In Zoo Park), సింహాలను, ఏనుగులను ఇంత దగ్గరిగా చూసే అవకాశం ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పండి?
నెహ్రూ జూ పార్కు (Hyderabad Zoo) టికెట్ల ధరలు పెరిగాయి. సందర్శకులకు ఆర్థిక భారం కలిగేలా ఎంట్రీ టికెట్ నుంచి సఫారీ రైడ్ వరకు ప్రతీ సర్వీసు ధర దాదాపు 50 శాతం పెరిగింది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.