3 రోజుల్లో రాజస్థాన్ రాయల్ ట్రిప్ ఎలా పూర్తి చేయాలి ? | Jaisalmer Desert Triangle Itinerary
రాజసానికి ప్రతీకగా నిలిచే రాజస్థాన్‌లో 3 రోజుల రాయల్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి…(Jaisalmer Desert Triangle Itinerary) రూట్ మ్యాప్, డే టు డే ప్లానింగ్, ట్రావెల్ లిప్స్, బడ్జెట్ ఇంకా మరెన్నో వివరాలు..
ముఖ్యాంశాలు
తెలుసుకోవాల్సిన విషయాలు | Quick Info Box
- ప్రయాణించే ప్రాంతం : పశ్చిమ రాజస్థాన్ ( Thar Desert)
- సందర్శించే ప్రాంతాలు : Jaisalmer- Sam Sand Dunes-Kuldhara ( దీనిని Desert Triangle అంటారు)
- ఎన్ని రోజులు సరిపోతాయి: 3 రోజులు / 2 రాత్రులు
- బెస్ట్ సీజన్ : అక్టబర నుంచి మార్చి వరకు
- ఎవరికి సెట్ అవుతుంది ? : మొదటి సారి రాజస్థాన్ వెళ్లేవారి కోసం, కల్చరల్ లవర్స్ కోసం, ఫోటోగ్రాఫర్స్, ట్రావెల్ వ్లాగర్స్, కుటుంబంతో కలిసి ప్రయాణం చేయాలి అనుకునేవారి కోసం
- దగ్గర్లోని ఎయిర్‌పోర్టు : జైసల్మేర్ ( తక్కువ విమానాలు నడుస్తాయి)/ జోధ్‌పూర్
- దగ్గర్లోని రైల్వే స్టేషన్ : జైసల్మేర్ రైల్వే జంక్షన్
- బడ్జెట్ : రూ.9,000 నుంచి 18,000 వరకు ( ప్రతి వ్యక్తికి)
తెలుగు ప్రయాణికులకు (Telugu Travelers) నార్త్ ఇండియా వెళ్లాలనే కోరిక ఉన్నా బడ్జెట్, ప్లాన్, ఏం చూడాలి, ఎలా వెళ్లాలి అనే వివరాలు తెలియక ఇబ్బంది పడతారు. అందుకే మీ కోసం ఈ పోస్ట్ పబ్లిష్ చేస్తున్నాను.
నార్త్ ఇండియా టూర్ అనగానే చాలా మంది బాగా డబ్బు ఖర్చు పెట్టాలి అనుకుంటారు. కానీ జైసల్మేర్ డెజర్ట్ ట్రయాంగిల్ ట్రిప్ అనేది బడ్జెట్లోనే పూర్తి చేసే విధంగా ఉంటుంది.
ఇందులో
- థార్ ఎడారి
- సాంస్కృతిక కార్యక్రమాలు
- రహస్యమైన గ్రామాలు
- ఇలా ఎన్నో కవర్ చేయవచ్చు.
ఈ ఐటినెరీ (Itinerary) అనేది మొదటిసారి రాజస్థాన్ (Rajasthan) వెళ్లే వారికి బాగా సెట్ అవుతుంది. ఎలాంటి ఓవర్ ప్లానింగ్ లేకుండా స్మూత్‌గా, హడావిడి లేకుండాా రాజస్థాన్ రాజసాన్ని అనుభవిస్తూ పూర్తి చేసుకోవచ్చు.
ఈ పోస్టులో 3 పగలు 2 రాత్రుల జైసల్మేర్–సామ్–కుల్ధారా ట్రిప్‌ను డే టు డే ప్లాన్, బడ్జెట్, ట్రావెల్ టిప్స్‌తో సులభంగా వివరించాం.
- ఇది కూడా చదవండి : మన దేశంలో ఈ 5 ఆలయాలు దర్శనం చేసుకోవాంటే లక్కుండాలి
డిజర్ట్ ట్రయాంగిల్ రూట్ మ్యాప్ | Desert Triangle Route Overview
జైసల్మేర్ సిటీని బేస్‌గా చేసుకుని లోకల్ ట్రిప్స్ పూర్తి చేసే విధంగా ప్లాన్ చేయాలి.
- ఇందులో సామ్ ఇసుక దిబ్బలు (Sam Sand Dunes) అనేవి రాజస్థాన్ నుంచి సుమారు 40 కిమీ దూరంలో ఉంటాయి.
- ఇక కుల్దారా గ్రామం జైసల్మేర్ నుంచి 18 కిమీ దూరంలో ఉంటుంది.
మొదటి రోజు | Day 1 : జైసల్మేర్ నగరం | Jaisalmer City

ఉదయం : జైసల్మేర్ నగరానికి ఉదయమే చేరుకునేలా ప్లాన్ చేసుకోండి.
జైసల్మేర్ నగరాన్ని The Golden City అని కూడా పిలుస్తారు. ఈ నగరానికి మీరు మొదటిసారి వస్తే
హడావిడి లేకుండా ప్రశాంతంగా సిటీ ఫీల్ అవ్వండి.
మీరు ఉదయమే నగరానికి చేరుకుంటే బెస్ట్. ఎందుకంటే మధ్యాహ్నం వేడి ఎక్కువగా ఉంటుంది. ఎండల్లో కోటల్లో, ఇతర ప్రాంతల్లో నడవడం చాలా ఇబ్బందికరంగా అనిపించే అవకాశం ఉంది.
- ముందుగా జైసల్మేర్ చేరుకుని హోటల్లో చెకిన్ చేసుకోండి.
- స్థానికంగా లభించే కచోరీ (Kachori) లేదా మిర్చీ వడను బ్రేక్‌ఫాస్ట్‌లో ట్రై చేయండి. నచ్చితే అందులో జిలేబీ తినండి. అక్కడి బ్రేక్‌ఫాస్ట్ ఇలాగే ఉంటుంది.
- ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత వికారమైన 5 ఫుడ్ ఐటమ్స్
జైసల్మేర్ కోట | Jaisalmer Fort
దీనిని Sonar Quila అని కూడా పిలుస్తారు. నిజానికి ఇది ఒక కోట కాదు. ఒక Living City. ఎందుకంటే కోట లోపల అక్కడి ప్రజలు నివసిస్తారు. అక్కడే షాప్స్, హోటల్స్, ఆలయాలు అన్నీ ఉంటాయి. అందుకే చాలా మంది ఇక్కడికి వస్తుంటారు.
- రాజుల కాలంలో కోటల్లో మనుషులు నివసించేవారు అని సినిమాల్లో చూశాం, పుస్తకాల్లో చదవాం. ఈ కోటలో అది మనం ఇప్పటికీ చూడవచ్చు.
- కోటలోపల నాగరిక సమాజం ఎలా ఉండేదో గమనించవచ్చు.
- ఈ కోటలో రాజ్ మహల్, జైన్ మందిరం, ఫిరంగులును చూడటంతో పాటు సిటీ బ్యూటిని చూడవచ్చు.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
మధ్యాహం : స్థానిక హవేలీల సందర్శన
జైసల్మేర్‌లో కోటల్లో Sandstone Art అద్భుతంగా ఉంటుంది. ప్రతీ కోటకు ఒక కథ ఉంటుంది. ప్రతీ డిసైన్ ఒక ఫిలాసఫీలా ఉంటుంది.
- Patwon Ki Haveli : పట్వో కి హవేలీ చాలా పెద్దగా, ఆర్ట్స్ డీటెయిల్స్ బాగుంటాయి.
- Salim Singh Ki Haveli : నెమలి ఆకారంలో ఉన్న నిర్మాణం బాగుంటుంది.
- Nathmal ki Haveli : నాథ్మాల్ కి హవేలీలో సిమ్మెట్రిక్ డిజైన్ ఆకట్టుకుంటుంది
సాయంత్రం : గడిసర్ సరస్సు
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలా తిరిగి ఉంటారు. ఇప్పుడు Gadisar Lake తీరంలో కాస్త రిలాక్స్ అవ్వండి. సూర్యాస్తమం సమయంలో నీటిలో సూర్యుడి ప్రతిబింబాన్ని ఫోటో తీయడం మరిచిపోకండి. ఇక్కడ మీరు బోటింగ్ కూడా చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : : విజయవాడకు దగ్గర్లో కుటుంబ సమేతంగా వెళ్లగలిగే 7 డెస్టినేషన్స్
ఇక Night Stay విషయానికి వస్తే మీరు కోటలోని హోటల్లో ఉండవచ్చు. లేదంటే సిటీలో ఏదైనా హోటల్లో నైట్ స్టే చేయవచ్చు. మార్నింగ్ చేకిన్ చేసి ఉంటే ప్రశాంతంగా మీ హోటల్‌కు వెళ్లి రెస్ట్ తీసుకోండి.
రెండవ రోజు | Day 2 లో Jaisalmer -Sam Sand Dunes

ఉదయం : ఒక రెండవ రోజు మీరు జైసల్మేర్ నుంచి 40 కీమీ దూరంలో ఉన్న శామ్ సాండ్ డ్యూన్స్కు వెళ్తారు.
థార్ ఎడారిలో ఉండే ఈ ఇసుక దిబ్బలకు రోడ్డు మార్గంలో స్మూత్‌గా వెళ్లిపోవచ్చు.
ఇక మధ్యాహ్నం మీరు ఎడారిలో కొన్ని యాక్టివిటీస్ చేయవచ్చు.మరీ ముఖ్యంగా శామ్ డ్యూన్స్‌లో మీరు ఎడారి ఓడ అయిన క్యామెల్ సఫారీ (Camel Safari), జీప్ సపారీ (Jeep Safari) ఎంజాయ్ చేయవచ్చు.
- ఇందులో క్యామెల్ సఫారీ అనేది షార్ట్ ట్రిప్ లేదా లాంగ్ ట్రిప్లుగా ఉంటాయి. ఇందులో మీకు ఏది నచ్చితే అది ఎంచుకోవచ్చు.
- థ్రిల్ లవర్స్ జీప్ సఫారీని ఎంజాయ్ చేయవచ్చు.
- వీటన్నింటితో పాటు శాండ్ డ్యూన్స్ ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : Gallery : జీవింతంలో ఒక్కసారైనా చూడాల్సిన 7 అద్భుతమైన సన్‌రైజ్ పాయింట్స్
సాయంత్రం కల్చరల్ ఈవెంట్స అనేవి జైసల్మేర్ ట్రిప్‌లో హైలైట్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఫోక్ మ్యూజిక్, ఫైర్ షో అన్నీ కవర్ చేయవచ్చు.
- రాజస్థాన్ ఫోక్ డాన్స్
- కాల్బెలియా ప్రదర్శన
- బోన్‌ఫైర్ ముందు ట్రెడిషనల్ డ్యాన్స్ ఎంజాయ్ చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
రాత్రి మీరు ఎడారిలో క్యాంపులో (Desert Camp) స్టే చేయవచ్చు.
- క్యాంపుల్లో మీకు స్విట్ టెంట్స్, లగ్జరీ క్యాంపులు అందుబాటులో ఉంటాయి.
- ఆకాశంలో ఇన్ని నక్షత్రాలు ఉంటాయా అనిపిస్తుంది క్యాంపు బయట నుంచి రాత్రి సమయంలో ఆకాశాన్ని చూస్తే
- *ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
మూడవ రోజు | Day 3 Sam To Kuldhara – Jaisalmer
మూడవ రోజు మీరు ఎడారిలో సూర్యోదయం ఎలా ఉంటుందో చూడవచ్చు.
- అలాగే ఉదయం పూట ఇసుక దిబ్బలపై వాక్ చేయవచ్చు.
- లైట్ బ్రేక్‌ఫాస్ట్ చేసి క్యాంపు నుంచి బయటపడండి.
అనంతరం దగ్గర్లోని కుల్ధారా గ్రామాన్ని విజిట్ చేయండి
కుల్ధారా గ్రామం (Kuldhara Village) ఎంత సైలెంటో అక్కడి స్టోరీస్ అనేవి అంత వైలెంట్. టూరిస్టులు (Tourists) తప్పా మరో నరమానవుడు కనిపించని ఈ గ్రామంలో అడుగడుగునా రహస్యం, ప్రతీ మలుపులో భయం కనిపిస్తుంది. రాజస్థాన్ చరిత్రలో చీకటి కోణం మీ ముందు ప్రత్యక్షం అవుతుంది.
- ఇది కూడా చదవండి : Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం
- ఇది జైసల్మేర్ నుంచి 18 కీమీ దూరంలో ఉంటుంది.
- 200 ఏళ్ల నుంచి ఇక్కడ ఎవరూ ఉండటం లేదు
- ఎన్నో రహస్యాల నిధి, భయంకరమైన కథలకు పుట్టినిల్లు ఈ గ్రామం
- చరిత్రలో రహస్యాలు తెలుసుకునే వారికి ఇది బాగా నచ్చుతుంది.
- ఈ గ్రామంలో ఉన్న నిర్మాణాలు, నిశ్శబ్దం ఇవన్నీ సినిమాలో సెట్టింగ్లా ఉంటాయి.
మధ్యాహ్నం జైసల్మేర్‌కు తిరిగి వచ్చి లంచ్ చేసి సాయంత్రం మార్కెట్లో షాపింగ్ చేయండి. చాలా మంది ఇక్కడి తోలుతో చేసిన వస్తువులు, పప్పెట్స్, హ్యాండిక్రాఫ్ట్స్ కొనుగోలు చేస్తుంటారు.
ఎలా వెళ్లాలి ? | How To Reach Jaisalmer
విమాన మార్గంలో అయితే దగ్గరల్లో జైసల్మేర్ ఎయిర్ పోర్టు ఉంటుంది. కానీ ఫ్లైట్స్ చాలా తక్కువ అని చెప్పవచ్చు.
- అందుకే మీరు జైసల్మేర్‌కు బదులు జోధ్‌పూర్ (Jodhpur) ఎయిర్‌పోర్టు చేరుకునేలా ప్లాన్ చేసుకోండి.
ఇక రైలు మార్గంలో అయితే ఢిల్లీ (Delhi), జైపూర్, జోధ్‌పూర్ నుంచి జైలస్మేర్కు ట్రైన్ సర్వీస్ ఉంది.
రోడ్డు మార్గంలో అయితే మీరు ముందుగా జోధ్‌పూర్ చేరుకోవాల్సి ఉంటుంది. తరువాత అక్కడి నుంచి 280 కిమీ దూరంలో ఉన్న జైసల్మేర్ చేరుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
ఎప్పుడు వెళ్లాలి ? | Best Time To visit
రాజస్థాన్‌కు ఎండాకాలం వెళ్లలేము. ఎందుకంటే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది.
- అందుకే మీరు చలికాలం మరీ ముఖ్యంగా అక్టోబర్ నుంచి మార్చి నెల మధ్యలో వెళ్లండి.
- ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఎండ, వేడి దారుణంగా ఉంటుంది.
- డిసెంబర్ నుంచి జనవరిలో ఎడారిలో చాలా చల్లగా ఉంటుంది.
బడ్జెట్ | Budget Breakdown
ఇక బడ్జెట్ విషయానికి వస్తే ప్రతీ వ్యక్తికి
- హోటల్ స్టే కోసం మూడు రోజులకు రూ.3000 నుంచి రూ.6000 వరకు
- ఫుడ్ కోసం రూ.1500 నుంచి 2500 వరకు
- రవాణా , సఫారీ కోసం రూ. 3000 నుంచి రూ.6000 వరకు ఖర్చు అవుతుది.
మొత్తానికి సుమారు రూ.9000 నుంచి రూ.18000 వరకు మీ ప్లానింగ్, ఖర్చు చేసే అలవాటును బట్టి ఖర్చు అవుతుంది.
ప్రయాణికుడు టిప్స్ | Prayanikudu Travel Tips
- ఎడారుల్లో రాత్రి సమయంలో చాలా చల్లగా ఉంటుంది. స్వెటర్ లాంటివి తప్పనిసరి
- సన్‌స్క్రీన్, సన్‌గ్లాసెస్ మరవకండి
- ఎడారిలో క్యాంప్‌లో స్టే చేయాలి అనుకుంటే ముందే బుక్ చేసుకోండి.
- క్యామెల్ సవారీ సమయంలో తప్పకుండా వాటర్ బాటిల్ తీసుకెళ్లండి.
రాజస్థాన్ డెజర్ట్ ట్రయాంగిల్ (Rajasthan Desert Triangle) అంటే ఒక ట్రిప్ మాత్రమే కాదు..ఒక కంప్లీట్ రాజాస్థానీ ఎక్స్‌పీరియెన్స్. గోల్డెన్ ఫోర్ట్ నుంచి శాండ్ డ్యూన్స్ వరకు, మిస్టరీ విలేజ్ నుంచి ఎడారి క్యాంప్ వరకు అన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. మూడు రోజుల్లో రాజస్థాన్‌ను అర్థం చేసుకోవడానికి ఇదే బెస్ట్ ప్లాన్.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
