జనవరి 1న పబ్లిక్ హాలిడేనా ? ఏం పని చేస్తాయి ? ఏం పని చేయవు ? | Jan 1, 2026 Public Holiday Hyderabad
Jan 1 2026 Public Holiday Hyderabad : 2026 జనవరి 1వ తేదీ పబ్లిక్ హాలిడేనా? హైదరాబాద్‌లో ఆఫీసులు, బ్యాంకులు, స్కూళ్లు, TSRTC బస్సులు, Hyderabad Metro, మాల్స్, హాస్పిటల్స్ ఓపెన్ ఉంటాయా లేదా క్లోజ్ అవుతాయా? పూర్తి క్లారిటీ ఇక్కడ తెలుసుకోండి.
Jan 1 2026 Public Holiday Hyderabad : జనవరి 1న హాలిడే అనుకుంటున్నారా? హైదరాబాద్‌లో ఆఫీసులు, బ్యాంకులు, RTC, Metro, మాల్స్ ఓపెన్ ఉంటాయా? ఏదైనా ప్లాన్ చేసే ముందు ఇది చదవండి.
జనవరి 1వ తేదీన మూడ్ | Mood on January 1
జనవరి 1వ తేదీన హైదరాబాద్ (Hyderabad) కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఉదయం రోడ్లు సైలెంట్‌గా ఉంటాయి. ఫోన్ల నిండా విషెస్, స్టేటస్‌ల నిండా Happy New Year, ఐదారు మిస్ కాల్స్ కూడా ఉంటాయి. వాటికి రెస్పాండ్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసి నెక్ట్స్ ఏంటి అని ఆలోచిస్తుంటే ఎన్నో డౌట్స్…
- ఈ రోజు ఈ ఆఫీస్ ఓపెన్ ఉంటుందా? పిల్లల స్కూల్ మిస్ అవుతారా? బ్యాంకులు పని చేస్తాయా?
- కొన్నింటికి హాలిడే అనుకుంటే అవి తెరిచే ఉండొచ్చు.
- కొన్ని డెఫినిట్‌గా తెరిచే ఉంటాయి అనుకుంటే వాటికి హాలిడే ఉండొచ్చు.
- అందుకే పుకార్లు, వాట్సాప్ ఫార్వర్డ్‌లకు తావు ఇవ్వకుండా ఈ సింపుల్ ప్రాక్టికల్ గైడ్ మీకోసం.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ | Hyderabad International Kite, Sweet Festival 2026
జనవరి 1వ తేదీ హైదరాబాద్‌లో పబ్లిక్ హాలిడేనా | Is January 1 a Public Holiday in Hyderabad
ఈ ప్రశ్నకు క్లియర్ ఆన్సర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది రోజు మొత్తం ప్లాన్ చేయడంలో యూజ్ అవుతుంది. ఆఫీస్, ట్రావెల్, స్కూల్, బ్యాంక్ అన్నీ దీనిపైనే ఆధారపడి ఉంటాయి.
సమాధానం: అవును.
- జనవరి 1వ తేదీన కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో Public Holidayగా అబ్జర్వ్ చేస్తారు.
- కానీ ఇది అందరికీ వర్తిస్తుంది అని చెప్పలేము.
- ఎందుకంటే హాలిడే అనేది డిపార్ట్మెంట్ను బట్టి మారుతుంది.
- ఇది కూడా చదవండి : ఇన్‌స్టా రీల్స్‌కు పర్ఫెక్ట్: తెలంగాణలో ఈ 8 Viral Road Trips In Telangana
గవర్నమెంట్ ఆఫీసులు పని చేస్తాయా? | Government Offices on Jan 1
ఈ రోజున ప్రభుత్వ ఆఫీసులు పని చేయవు. Closedగా ఉంటాయి. ఇందులో తెలంగాణ సచివాలయం, కలెక్టర్ కార్యాలయాలు, మండల్ ఆఫీసులు, GHMC / Municipal Offices ఉంటాయి.
- జనవరి 1వ తేదీ General Holiday కావడంతో రొటీన్ గవర్నమెంట్ వర్క్ ఉండదు.
- ఫైల్స్, సర్టిఫికెట్స్, అప్రూవల్స్ అన్నీ జనవరి 2 నుంచి మాత్రమే ప్రారంభమవుతాయి.
- ఇది కూడా చదవండి : Street Food : హైదరాబాద్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే
ప్రైవేట్ ఆఫీసులు ? | Jan 1 2026 Public Holiday Hyderabad
ప్రైవేట్ సెక్టార్లో ఒక స్టాండర్డ్ రూల్ ఉండదు. కంపెనీ పాలసీని బట్టి ఉంటుంది. ఒకే బిల్డింగ్‌లో ఒక కంపెనీకి హాలిడే ఉండొచ్చు, మరో కంపెనీకి వర్కింగ్ డే ఉండొచ్చు. జనరల్‌గా ఐటీ కంపెనీలకు Optional / Restricted Holiday, కార్పొరేట్ ఆఫీసులు తమ పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటాయి.
- స్టార్టప్స్‌లో హాలిడే కష్టం లేదా WFH (Work From Home) ఇస్తారు.
- చాలామంది హాఫ్ డే లేదా WFH ఆప్షన్ ఇస్తారు.
- మీ ఆఫీస్ HR Mail / Circular / WhatsApp Group చెక్ చేయడం బెస్ట్.
స్కూల్స్, కాలేజీలు | Schools & Colleges
చాలా విద్యా సంస్థలు జనవరి 1న సెలవు ఇస్తాయి. ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఎక్కువగా సెలవే. ప్రైవేట్ కాలేజీలు, యూనివర్సిటీలు తమ అకాడమిక్ క్యాలెండర్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటాయి.
- ఎగ్జామ్స్ ఉన్నట్లయితే మాత్రం సెలవు ఉండకపోవచ్చు.
సాధారణంగా పేరెంట్స్‌కు ఈ రోజు కొంచెం రిలీఫ్ డే. - ఇది కూడా చదవండి : Ta.Ma.Sha Cafe : ఓకే కేఫ్‌లో అన్ని రకాల ఆసియా రుచులు..అదే త.మా.షా!
బ్యాంకుల సంగతి ఏంటి? | Banks on January 1
జనవరి 1న బ్యాంకులు Closed. SBI, ఇతర జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు అన్నింటికీ హాలిడే ఉంటుంది. కానీ ATM, UPI, PhonePe, Google Pay, Net Banking పనిచేస్తాయి.
- క్యాష్ డిపాజిట్, చెక్ పనుల కోసం జనవరి 2 వరకు ఆగాలి.
ఆర్టీసి బస్సులు, హైదరాబాద్ మెట్రో | TSRTC & Hyderabad Metro

జనవరి 1న TSRTC బస్సులు నడుస్తాయి. హాలిడే షెడ్యూల్ ప్రకారం సర్వీసులు ఉంటాయి. ఉదయం ట్రాఫిక్ తక్కువగా ఉండొచ్చు, సాయంత్రం క్రౌడ్ పెరుగుతుంది. మెట్రో టైమింగ్స్ మారే అవకాశం లేదు.
- సాయంత్రం, రాత్రి పీక్ అవర్స్‌లో రద్దీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.
- ఈ రోజు సిటీలో ట్రావెల్‌కు మెట్రో మంచి ఆప్షన్.
- ఇది కూడా చదవండి : Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి
షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ | Malls & Restaurants
జనవరి 1 పూర్తిగా Commercial Day. మాల్స్, రెస్టారెంట్స్, కేఫ్స్, థియేటర్లు అన్నీ తెరిచే ఉంటాయి. అయితే ఉదయం ఆలస్యంగా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ప్లాన్ చేయడం మంచిది. లోకల్ షాప్స్ అనేవి షాప్ ఓనర్ ఇష్టాన్ని, ఏరియాను బట్టి ఓపెన్ లేదా క్లోజ్ అవుతాయి.
- సాయంత్రం నుంచి నైట్ వరకూ రష్ ఎక్కువగా ఉంటుంది.
- మాల్స్‌కు వెళ్తే Parking Time ఎక్కువ పడే అవకాశం ఉందని మైండ్‌లో పెట్టుకోండి.
ఇక ఏం తెరిచి ఉంటాయి | Jan 1 2026 Public Holiday Reality Check
ఇనార్బిట్ మాల్ | Inorbit Mall, Madhapur
మాధాపూర్‌లో ఉన్న ఈ మాల్లో మధ్యాహ్నం నుంచి రష్ పెరుగుతుంది. ఫుడ్ కోర్ట్, సినిమాస్ కోసం చాలా మంది వస్తారు. మధ్యాహ్నం 1 లోపు వెళ్తే పార్కింగ్ కష్టాల నుంచి తప్పించుకోవచ్చు.
- 3–4 గంటలు స్పెండ్ చేయాలనుకుంటే ఇది సరిపోతుంది.
- Window Shopping, ఫుడ్, మూవీస్ కోసం పర్ఫెక్ట్ ప్లేస్.
- ఇది కూడా చదవండి : ఈ ఆదివారం ఖాళీనా? Hyderabad దగ్గర ఈ 6 ప్లేసులు మిస్ అవ్వకండి ! 6 Weekend Destinations
శరత్ సిటీ క్యాపిటల్ మాల్ | Sarath City Capital Mall, Kondapur
కొండాపూర్‌లో ఉన్న ఈ మాల్‌కు ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లొచ్చు. ఈవెనింగ్ తర్వాత కాస్త రష్ పెరుగుతుంది. మూవీకి వెళ్లాలి అనుకుంటే టికెట్లు ముందే Online Booking చేసుకోవడం బెస్ట్.
- 3 నుంచి 5 గంటల వరకు టైమ్ పాస్ చేయవచ్చు.
హైదరాబాద్ జూ పార్క్ | Nehru Zoological Park, Hyderabad
నెహ్రూ జూలాజికల్ పార్క్ మీ లిస్టులో ఉందో లేదో తెలియదు కానీ నా లిస్టులో మాత్రం తప్పకుండా ఉంటుంది. కాస్ట్ కొంచెం ఎక్కువే అయినా పిల్లలతో, ఫ్యామిలీతో ప్రశాంతంగా గడపడానికి బాగుంటుంది.

- అడుగడుగునా రకరకాల టికెట్లు అవసరం అవుతాయి కాబట్టి కొంచెం ఎక్కువ క్యాష్ పెట్టుకోండి.
- Water Bottles తీసుకెళ్లండి. లోపలికి వెళ్లే ముందు కడుపు నింపేసుకుని వెళ్లండి.
- లాంగ్ వాక్ అండ్ కాస్ట్లీ ఫుడ్… మీకు అర్థమవుతోంది కదా.
- జూ పార్క్ టైమింగ్స్, పార్కింగ్, టికెట్ ధరలు అన్నీ తెలుసుకోవాలంటే ఈ పోస్టులో పూర్తి వివరాలు ఇచ్చాను. చదవండి.
- ఇది కూడా చదవండి : జూపార్క్‌కు వెళ్లే ముందు ఇవి తెలియకపోతే టైమ్ వేస్ట్ అవుతుంది | Hyderabad Zoo Entry Fee ,Timings
లుంబినీ పార్క్ | Lumbini Park, Necklace Road
ఇక్కడ బోటింగ్, యాక్టివిటీస్ కోసం వెళ్లవచ్చు. పక్కా Value for Money అనుభవం ఉంటుంది. సాయంత్రం ఇక్కడ Laser Show ఉంటుంది. ఆ సమయంలో రష్ ఎక్కువగా ఉంటుంది. క్యాష్ తీసుకెళ్లడం మర్చిపోకండి. 2–3 గంటలు సరిపోతాయి.

హైదరాబాద్‌లో కుటుంబంతో కలిసి వెళ్లదగిన పార్కుల ఏంటో తెలుసుకోవాలంటే ఈ కింది పోస్టులో పూర్తి వివరాలు అందించాను. చదవండి తప్పకుండా ఉపయోగపడుతుంది.
- ఇది కూడా చదవండి : Hyderabad లో తప్పకుండా వెళ్లాల్సిన Top 7 Best Family Parks – Entry Fee, Timings & Complete Guide
రామోజీ ఫిలిం సిటీ | Ramoji Film City
రాత్రి పార్టీ అయిపోయి పొద్దున రామోజీ ఫిలిం సిటీ ఏంటి అని అనిపించొచ్చు. కానీ జనవరి 1న ఇక్కడికి వెళ్లే వాళ్లు చాలా మంది ఉంటారు. రామోజీ చూడాలంటే రెండు రోజులు కూడా సరిపోవు. అయినా ఫుల్ డే యాక్టివిటీ ఉంటుంది.
- బాగా నడవాలి కాబట్టి మీ ఎనర్జీ RFC ఎనర్జీకి మ్యాచ్ అవుతుందనిపిస్తే వెళ్లండి.
- పొద్దున్నే వెళ్తే కనీసం కొంత అయినా చూశాం అన్న సంతృప్తి ఉంటుంది.
- హైదరాబాద్‌లో రెండు రోజుల్లో మీరు ప్రశాంతంగా తిరగగలిగిన ప్రదేశాలను ప్రాక్టికల్‌గా ఉండే ఈటూర్ గైడ్లో అందించాను తప్పకుండా చదవండి.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Day Hyderabad Practical Tour
మాల్స్ అంద్ కేఫ్స్
ఇవే కాకుండా ఈ రోజు చాలా Multiplexes, Malls, Restaurants, Cafés తెరిచే ఉంటాయి. సాయంత్రం సమయంలో రష్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రెస్ట్ తీసుకున్న హైదరాబాదీలు సాయంత్రం ఫ్యామిలీతో బయటికి రావాలని అనుకుంటారు. సంతోషం అనేది ఫ్యామిలీతో పంచుకుంటే రెట్టింపు అవుతుంది.
ఆసుపత్రులు, ఎమర్జెన్సీ సేవలు | Hospitals & Emergency Services
ఇవి ఎమర్జెన్సీ సేవల్లో భాగం కాబట్టి సెలవు ఉండదు. ఈ విషయంలో వైద్యులు, నర్సులు, మెడికల్ స్టాఫ్, ప్యారామెడిక్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎమర్జెన్సీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి వాళ్లు తమ డ్యూటీని అత్యంత బాధ్యతగా నిర్వహిస్తారు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో Emergency Services అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో Emergency + OPD పనిచేస్తాయి. మెడికల్ హెల్ప్ 24/7 Available.
జనవరి 1ని ఎలా సెలబ్రేట్ చేయాలి? | How to Celebrate Jan 1
ఇది నా ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ కాదు. ఎంజాయ్ చేయాలా లేదా స్ట్రెస్ ఫీలవ్వాలా అనేది మీ నిర్ణయం. ఆఫీస్ లేకపోతే ఆఫీస్ రిలేటెడ్ పనులు చేయకండి. Right to Disconnect Act 2025 ఉందిగా. బ్యాంక్ పనులు ఉంటే ఒక రోజు వాయిదా వేయండి.
- ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ల కోసమే మనం బతికేది.
- ఒక పది నిమిషాలు కూర్చుని రిజల్యూషన్ రాసుకోండి.
- ఎన్నేళ్లుగా సాధించలేకపోయిన ఒక టార్గెట్ అయినా ఈ ఏడాది సాధించే ఛాన్స్ ఉందో లేదో ఆలోచించండి.
కొన్ని రూల్స్ గుర్తుంచుకోండి | Important Rules on New Year Day
న్యూ ఇయర్ రోజు రూల్స్ కాస్త కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో చెకింగ్స్ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. Drunk and Drive Tests కోసం 100+ Teams ఉంటాయి. అన్ని వాహన డాక్యుమెంట్స్ సిద్ధంగా పెట్టుకోండి.
- పార్కింగ్ రూల్స్ బ్రేక్ చేస్తే పెనాల్టీ తప్పదు.
- క్యాబ్ బుక్ చేస్తే 2–3x Surge Pricing ఉండొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయండి.
- ఇది కూడా చదవండి : 31st Night Hyderabad : మీరు ప్లాన్ చేస్తే పార్టీ… పోలీసులకు దొరికితే పెనాల్టీ
రిఫరెన్స్ | Official References (Verification)
ఈ సమాచారం మొత్తం ఆఫిషియల్ క్యాలెండర్లు, సర్వీస్ రూల్స్ ఆధారంగా ఇచ్చాను. లోకల్ సర్క్యులర్స్ వల్ల చిన్న మార్పులు ఉంటే పాపం కిషోర్ (Prayanikudu) మిస్ అయ్యాడు అనుకోండి. కామెంట్ చేయండి.
• Telangana Government General Holidays Gazette
• TSRTC Official Website
• Hyderabad Metro Rail Official Website
• RBI Bank Holiday Calendar
సాధారణ ప్రశ్నలు – సమాధానాలు | FAQs
2026 జనవరి 1 అనేది హైదరాబాద్‌లో కంపల్సరీ హాలిడేనా? | Is Jan 1, 2026 a Mandatory Holiday in Hyderabad?
ప్రభుత్వ కార్యాలయాలకు కంపల్సరీ. ప్రైవేటు సంస్థలకు కాదు.
బ్యాంకులు తెరిచి ఉంటాయా? | Are Banks Open on January 1?
లేదు. బ్యాంక్ బ్రాంచ్‌లు క్లోజ్. కానీ Digital Services (ATM, UPI, Net Banking) పని చేస్తాయి.
ఆర్టీసి బస్సులు పని చేస్తాయా? | Do TSRTC Buses Operate on Jan 1?
చేస్తాయి. Holiday Schedule ప్రకారం సర్వీసులు నడుస్తాయి.
మరి హైదరాబాద్ మెట్రో? | Is Hyderabad Metro Running?
చేస్తుంది. కానీ సాయంత్రం, రాత్రి సమయంలో Heavy Crowd ఉండే అవకాశం ఉంది.
స్కూల్ హాలిడే ఉంటుందా? | Is There a School Holiday?
ప్రభుత్వ పాఠశాలలకు సెలవు. ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు కూడా చాలా శాతం సెలవు ఇస్తాయి. అయినా Cross Check with School/College చేయడం మంచిది.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
