Telangana Tourism : పర్యాటకులకు గుడ్‌న్యూస్.. సాగర్ టు శ్రీశైలం లాంచ్ ప్రయాణం రెడీ.. ప్యాకేజీ వివరాలివే
Telangana Tourism : పర్యాటక ప్రియులకు, భక్తులకు శుభవార్త. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) నుంచి శ్రీశైలం (Srisailam) వరకు కృష్ణానదిపై ఉండే లాంచ్ సేవలు మళ్లీ మొదలుకానున్నాయి. ఈ అందమైన పర్యాటక యాత్రను శనివారం, నవంబర్ 22 నుంచి పునఃప్రారంభించడానికి తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGTDC) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నల్లమల అటవీ ప్రాంతం ప్రకృతి అందాలను, కృష్ణానది వైభవాన్ని ఒకేసారి ఆస్వాదించే ఈ అద్భుత ప్రయాణం ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
టికెట్ ధరలు, ప్యాకేజీ వివరాలు
టూరిజం అధికారులు ఈ యాత్రకు సంబంధించిన టికెట్ ధరలు, ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు ఒక్కవైపు ప్రయాణానికి పెద్దలకు (Adults) రూ.2,000, పిల్లలకు (5-10 సంవత్సరాలు) రూ.1,600 గా ధర నిర్ణయించారు. ఒక రోజు వెళ్లి, మరుసటి రోజు అదే లాంచ్‌లో తిరిగి రావాలనుకునే ప్రయాణికుల కోసం రిటర్న్ ప్యాకేజీని ఏర్పాటు చేశారు. దీని ధర పెద్దలకు రూ.3,250, పిల్లలకు రూ.2,600. ఈ లాంచ్ ప్రయాణంలో పర్యాటకులకు లంచ్ (మధ్యాహ్న భోజనం) లాంచ్‌లోనే అందించడం ఒక ప్రత్యేక ఆకర్షణ.

ప్రయాణ విశేషాలు, సమయం
ఈ లాంచ్ ప్రయాణం పర్యాటకులకు అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఈ యాత్రలో పర్యాటకులు నందికొండ, యెలేశ్వరం, శాలేశ్వరం వంటి చారిత్రక ప్రదేశాల గుండా, తూర్పు కనుమల (Eastern Ghats) అందాలను తిలకిస్తూ ప్రయాణిస్తారు. ఈ లాంచ్ దాదాపు 110 కిలోమీటర్ల దూరాన్ని 5 నుంచి 6 గంటల సమయంలో పూర్తి చేస్తుంది. నల్లమల అడవుల అందాలు, నదీ తీరాలు, పర్వతాల దృశ్యాలు, అడవుల నిశ్శబ్దం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ప్రయాణ షెడ్యూల్, బుకింగ్
ఈ పర్యాటక సేవలకు సంబంధించిన షెడ్యూల్, బుకింగ్ వివరాల్లోకి వెళితే.. లాంచ్ ప్రతి శనివారం ఉదయం 10:30 గంటలకు సాగర్ నుంచి బయలుదేరి, సాయంత్రం 4:30 గంటలకు పాతాళగంగ ప్రాంతానికి చేరుకుంటుంది. పాతాళగంగలో రాత్రి బస చేసిన తర్వాత, మరుసటి రోజు (ఆదివారం) శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ప్యాకేజీలో శ్రీశైలంలో బస చేసే రూములు, స్థానిక రవాణా ఖర్చులు చేర్చబడలేదు. ఆ ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. డిమాండ్‌ను బట్టి ఈ సేవను ప్రతి శనివారం నడుపుతామని టూరిజం శాఖ స్పష్టం చేసింది. వర్కింగ్ డేస్‌లో (సోమవారం-శుక్రవారం) 100 కంటే ఎక్కువ బల్క్ బుకింగ్‌లు ఉంటే, ప్రత్యేక లాంచ్ యాత్రను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
టికెట్ బుకింగ్ పూర్తిగా ఆన్లైన్లో tgtdc.in వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్‌ను కూడా సంప్రదించవచ్చు (Contact: 9848540371, 9848125720). ఈ లాంచ్ సేవలు మళ్లీ ప్రారంభం కావడం వల్ల తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

టూర్ ప్లాన్ చేస్తున్నారా ? తక్కువ ధరలో మెరుగైన ప్యాకేజీ కావాలంటే వాట్సాప్‌లో సంప్రదించండి. హైదరాబాద్ నుంచి హిమాలయాల వరకు…కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు పలు ఆప్షన్స్ అందిస్తాము.

💬 Chat on WhatsApp

తెలుగు పాఠకుల కోసం గమనిక: ఈ బ్లాగ్ కేవలం కోసం మాత్రమే. ట్రావెల్ ప్యాకేజీలు , వివరాలు భాగస్వామి సంస్థల ద్వారా అందించబడతాయి.

Disclaimer: This article is for informational purposes only. Prayanikudu.com shares verified travel updates and trip ideas collected from trusted sources and travel partners. We do not operate or sell any packages directly, nor are we responsible for bookings, prices, or any changes made by travel operators. All bookings, payments, and communication happen directly between travelers and the respective tour companies or agents. Readers are advised to verify all details before confirming any trip.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
