చర్లపల్లి నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు… ఇవే పూర్తి వివరాలు ! Special Trains To Kumbh Mela

షేర్ చేయండి

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.  ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్లతో పాటు అదనంగా 6 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్లు చర్లపల్లి నుంచి కుంభమేళాకు ( Special Trains To Kumbh Mela ) కుంభ మేళా నుంచి చర్లపల్లి మధ్య నడుస్తాయి. ఆ  రైళ్ల వివరాలు ఇవే…

ప్రయాగ్‌‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 ) వివిధ దేశాల నుంచి భక్తులు తరలి వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో త్రివేణి సంగమం ( Triveni Sangam ) వద్దకు వెళ్లి పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. 

ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీని గమనించి దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్లతో పాటు అదనంగా 6 ప్రత్యేక రైళ్లను నడపనుంది.  ఆ ట్రైన్ల విశేషాలు ఇవే…

1. 07111 / 07112- బీదర్ నుంచి దానాపూర్ ( 2 సర్వీసులు )

07111 Bidar To Danapur Special Train : బీదర్ నుంచి 2025 ఫిబ్రవరి 14వ తేదీన ఉదయం 11 గంటల 10 నిమిషాలకు ప్రయాణం మొదపెట్టనున్న ఈ ట్రైన్ తన గమ్యస్థానానికి రెండవ రోజు రాత్రి 11 గంటల 55 నిమిషాలకు చేరుకుంటుంది. 

  • 07112 Danapur Charlapalli Special Train : దానాపూర్ నుంచి చర్లపల్లి వైపు ఈ ట్రైన్ 2025 ఫిబ్రవరి 16 తేదీన మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు బయల్దేరుతుంది. రెండవ రోజు రాత్రి 11 గంట 45 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.
  • ఈ ట్రైను ఆగే స్టేషన్లు : జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, ఇటార్సి, పిపారియా, జబల్పూర్, కాట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ చియోకి, మిర్జాపూర్, పీటి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, ఆరాస్టేషన్.
  • తిరుగు ప్రయాణంలో కూడా ఇవే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

2. ట్రైన నెం.07077/07078 – చర్లపల్లి-దానాపూర్ చర్లపల్లి (4 సర్వీసులు )

Special Trains To Kumbh Mela
| చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాంగణం

07077 Charlapallio-Danapur Special Train : ఈ స్పెషల్ ట్రైన్ ఫిబ్రవరి 18వ తేదీతో పాటు 22వ తేదీన చర్లపల్లి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతుంది. రెండవ రోజు రాత్రి 11 గంటల 55 నిమిషాలకు తన గమ్యస్థానానికి చేరుకుంటుంది.

  • 07078 Danapur- Charlapalli Special Train: దానాపూర్ నుంచి  ఫిబ్రవరి 20 , 24వ తేదీలో మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు బయల్దేరుతుంది. రెండవ రోజు రాత్రి 11 గంట 45 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది.

ఈ స్పెషల్ ట్రైన్లు ( Special Trains To Kumbh Mela ) రాను పోనూ ఈ స్టేషన్లలో ఆగుతాయి.

  • జనగాం, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్, నాగ్‌పూర్, ఇటార్సి, పిపారియా, జబల్పూర్, కాట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ చియోకి, మిర్జాపూర్, పీటి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్, ఆరాస్టేషన్.

ఈ ప్రత్యేక ట్రైన్లలో (  Special Trains To Kumbh Mela )  2 ఏ, 3 ఏ, 3 ఈ స్లీపర్లతో పాటు సెకండ్ క్లాస బోగిలు ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!