మహా శివరాత్రి సందర్భంగా 3,000 ప్రత్యేక బస్సులు నడపనున్న తెలంగాణ ఆర్టీసీ | Maha Shivaratri Special Busses

షేర్ చేయండి

మహా శివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం 3 వేల ప్రత్యేక బస్సులను (Maha Shivaratri Special Busses) నడపనుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ. ఇందులో శ్రీశైలానికి 800 బస్సులు, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ బస్సులతో పాటు మరిన్ని పుణ్య క్షేత్రాలకు ఈ బస్సులు వెళ్లనున్నాయి. ఆ వివరాలు.

నాలుగు రోజులు పాటు | TGSRTC Special Busses Details

మహా శివరాత్రి వేళా భక్తులు అధిక సంఖ్యలో ప్రముఖ శైవ క్షేత్రాలకు (Shiva  Kshetras) తరలివెళ్తుంటారు. ఇలాంటి భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి 43 శైవ క్షేత్రాలకు 3,000 బస్సులను నడపునున్నట్టు తెలిపింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.

2025 ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి వేడుక సందర్భంగా 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలకు కేటాయించిన బస్సుల సంఖ్య : 

  • శ్రీశైలం శ్రీ భ్రమరాంభ మల్లికార్జునుల ఆలయం:  800 బస్సులు
  • వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం : 714 బస్సులు
  • ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయం : 444  బస్సులు
  • కీసరగుట్ట (keesaragutta) శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం : 270 బస్సులు
  • వేలాల గట్టు మల్లన్న స్వామి ఆలయం : 171 బస్సులు
  • కాళేశ్వరం (Kaleshwaram) ముక్తేశ్వర ఆలయం :  80 బస్సులు
  • కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం : 51బస్సులు

ఈ ఆలయాలతో పాటు ఆలంపూర్, రామప్ప, ఉమామహేశ్వరం వంటి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. శ్రీశైలం (Srisailam) పుణ్యక్షేత్రానికి హైదరాబాద్‌లోని ఎంజిబీఎస్, జేబీఎస్, సీబీఎస్, ఐఎస్ సదన్, కేపీహెచ్‌పీ, బీహెచ్‌ఈల్ నుంచి ఈ పుణ్య క్షేత్రానికి బస్సులు బయల్దేరనున్నాయి.

భక్తుల సౌకర్యం కోసం వివిధ ప్రాంతాల్లో షామియానాలు, చైర్‌లు, తాగునీటితో పాటు, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయనుున్నారు

టికెట్ ధరల్లో సవరింపు

మహా శివరాత్రి సందర్భంగా నడిచే ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరల్లో టికెట్ల ధరలను సవరించారు. రాష్ట్ర ప్రబుత్వం జీవో ప్రకారం 50 శాతం వరకు ఈ టికెట్ ధరలను సవరించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (Telangana State Road Transportation Corporation).

అయితే సవరించిన ఈ టికెట్ ధరలు వచ్చేసి కేవలం ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28 తేదీ వరకు నడిచే ప్రత్యేక బస్సులకు మాత్రమే వర్తించనున్నాయి. రెగ్యుల్ బస్ సర్వీసుల చాార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు.

ఇక ఏడుపాయలకు (Edupayala) నడిచే బస్సుల్లో ఫిబ్రవరి 26,27,28 తేదీల్లో సవరించిన చార్జీల ప్రకారం భక్తులు టికెట్ కొనాల్సి ఉంటుంది. 2024 శివరాత్రితో (Maha Shivaratri) పోల్చితే ఈసారి 809 అదనపు బస్సులను నడుపుతున్నట్టు తెలిపింది తెలంగాణ ఆర్టీసీ.

బుకింగ్ కోసం | Maha Shivaratri 2025

ఇక మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో సిటీ ఆర్డినరీ, మెట్రోఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసే సదుపాయం కూడా అమల్లో ఉంటుంది. 

హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడ (Vemulawada Temple) వెళ్లే బస్సులను భక్తులు ముందుగానే బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు తెలిపింది తెలంగాణ ఆర్టీసి. దీని కోసం ప్రయాణికలు తెలంగాణ ఆర్టీసి అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in విజిట్ చేయాల్సి ఉంటుంది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!