సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లే ముందు కొత్త మార్గదర్శకాలు చదవండి |  Secunderabad Railway Station

షేర్ చేయండి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునారాభివృద్ధి పనులు (Secunderabad Railway Station) వేగం పుంజుకున్నాయి. మొత్తం రూ.720 కోట్లతో దక్షిణ మధ్య రైల్వే ఈ అప్‌గ్రేడింగ్ పనులు చేపట్టింది. ప్రస్తుతం సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి. నార్త్ సైడ్‌లో ఉన్న స్టేషన్ బిల్డింగ్ స్థలంలో కొత్త భవానాన్ని నిర్మించనున్నారు. 

అయితే ఈ పనులు జరుగుతున్న సమయంలో ప్రయాణికులకు (Travelers)  ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల భద్రతా , సౌకర్యం కోసం కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) వెళ్లే ముందు కొత్త మార్గదర్శకాలు చదవండి: 

1.కొత్త ఎంట్రీ పాయింట్స్ | New Entry Points In Secunderabad Railway Station

Secunderabad Railway Station Upgrading (5)

రద్దీ నిర్వహణా సౌలభ్యం కోసం గేట్ నెం. 2 వద్ద ( వినాయకుడి ఆలయం పక్కన) కొత్త ప్రవేశ ద్వారాన్ని తెరిచారు. ఇక్కడ జనరల్ బుకింగ్, ఎన్‌క్వైరీతో పాటు వెయిటింగ్ హాల్ ఏర్పటు చేశారు. దీంతో పాటు ప్లాట్‌ఫామ్ నెం. 10 లోని గేట్ నెంబర్ 8 (బోయిగూడ వైపు) వద్ద బుకింగ్ సౌకర్యంతో పాటు కొత్త ఎంట్రీ పాయింట్‌ను అందుబాటులోకి తెచ్చారు.

2.  గేట్ నెం.4 మూసివేత

Secunderabad Railway Station Upgrading (5)

గేట్ నెం.4 మూసివేయడంతో గేట్ నెం .3 అండ్ 3బీ వద్ద( స్వాతీ హోటల్ ఎదురుగా) అదనంగా ఎంట్రీ సౌకర్యం కల్పించారు.

3. సైన్ బోర్డులు చదవండి

Secunderabad Railway Station Upgrading (5)

సికింద్రాబాద్‌‌‌కు వెళ్లే ప్రయాణికులకు కొత్తగా పలు బోర్డులు కనిపించే అవకాశం ఉంది. ఈ బోర్డులు ప్రయాణికుల సౌలభ్యం కోసం, మార్గ దర్శనం కోసం ఏర్పాటు చేశారు. సరైన ప్లాట్‌ఫామ్, ప్రవేశ ద్వారాలు, ఎగ్జిట్ వంటి వివరాలు ఇందులో ఉంటాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వీటిని ఏర్పాటు చేశారు.

4. ప్రయాణికుల భద్రత కోసం

Secunderabad Railway Station Upgrading (5)

ప్రయాణికుల రద్దీ (Crowd Management) నిర్వహణ కోసం కమర్షియల్ ఇన్‌స్పెక్టర్లు, అధికారులు స్టేషన్లను నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. వీరికి టికెట్ చెకింగ్ సిబ్బంది కూడా సాయం అందిస్తారు.

5.ముందస్తు ప్రకటన

Secunderabad Railway Station Upgrading (5)

ప్రస్తుత పరిస్థితులను గమనించి ప్లాట్‌ఫామ్ నెంబర్లను ముందుగానే ప్రకటించనున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా సమయానికి ముందే తమ ట్రైన్ ఆగే ప్లాట్‌ఫామ్ (Railway Platform) వైపునకు చేరుకోవచ్చు.

6. ఫుడ్ స్టాల్స్

Secunderabad Railway Station Upgrading (5)

ప్రయాణికుల కోసం పరిమిత సంఖ్యలో ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉండనున్నాయి. దీంతో పాటు ప్రయాణికుల భద్రత కోసం సీఆర్‌పీఎఫ్ (CRPF) సిబ్బంది‌తో పాటు సీసీటీవి నిఘా కూడా ఉంటుంది. 

మహిళా ప్రయాణికులకు అండగా

మహిళల రక్షణ కోసం సీఆర్‌పీఎప శక్తి టీమ్ అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్. 139 కూడా  అందుబాటులో ఉంటుంది. అప్‌గ్రేడింగ్ సమయంలో (Secunderabad Railway Station Upgrading) ప్రయాణికుల నుంచి సహకారాన్ని కోరుతూ, అధికారులు, రైల్వే సిబ్బందికి సహకరించాలని రైల్వే శాఖ కోరుతోంది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!