TTD Warning : తిరుమలలో రీల్స్ చేస్తున్నారా ? అయితే ఇది చదవండి !
TTD Warning : తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ లేదా షార్ట్స్ చేస్తే ఇక చిక్కుల్లో పడతారు. ఇలా సోషల్ మీడియా కోసం రీల్స్ చేసే వారిపై తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ అయింది. ఇకపై రీల్స్ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది
రంగంలోకి టిటిడి : TTD Warningరంగంలోకి టిటిడి : TTD Warning
విషయం ఏంటంటే తిరుమలేశుడి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో కొంత మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో, మాడ వీధుల్లో డాన్స్లు చేసి వీడియోలు తీస్తూ, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీటి సంఖ్య పెరిగడం గమనించిన టిటిడి రంగంలోకి దిగింది. ఇలా చేయడం అనేది తిరుమల పవిత్రతను దెబ్బతీస్తాయని..ఇకపై ఇలాంటి వెకిలి చేష్టలు చేస్తే, విజిలెన్స్ డిపార్ట్మెంట్ కేసులు పెడతుందని టిటిడీ (TTD)హెచ్చరించింది.
- ఇది కూడా చదవండి : నేటి నుంచి శ్రీవారి దర్శనానికి కొత్త రూల్స్…
ఆధ్మాత్మిక వాతావరణాన్ని కాపాడాలి…
నిజానికి శ్రీవారి దర్శనం కోసం వెళ్లినప్పుడు ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తుల మనసులో శ్రీవారి రూపాన్ని దర్శించుకోవాలనే ఆశ, ఆయన చూపులు తమపై పడాలనే కోరిక తప్పా ఇంకో ధ్యాస ఉండదు. కానీ కొంత మంది చేసే రీల్స్ వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. భక్తి , ఆధ్మాత్మికతకు నిలయమైన తిరుమలకు వస్తే కేవలం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు పరిమతం అవ్వాలని దేవస్థానం కోరుతోెంది.
షార్ట్ కూడా చూడండి :
అలా కాకుండా ఇకపై అసభ్యకరమైన రీల్స్ తీస్తే గనక టిటిడి విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది వాటిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నారు.