తిరుమలలో క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షకాల కౌంటర్ | TTD QR Code Based Footwear Counters Guide
TTD QR Code Based Footwear Counters Guide : తిరుమలలో మిస్సింగ్ పాదరక్షకాల సమస్యను పరిష్కరించేందుకు తితిదే కొత్త సిస్టమ్‌ను ప్రవేశ పెట్టింది. ఇలా ఎలా వాడాలి? కౌంటర్లు ఎక్కడ ఉంటాయో పూర్తి గైడ్
తిరుమలలో దర్శనం అంటే భక్తి, శ్రద్ధలతో కూడిన ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. అయితే భక్తులు గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ కొన్ని సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అందులో చెప్పుల సమస్య కూడా ఒకటి.భక్తుల రద్దీ ఉన్న రోజుల్లో, క్యూలైన్ల దగ్గర, అన్నప్రసాదం కేంద్రాల చుట్టూ ఉన్న భక్తులకు నా చెప్పులు దొరుకుతాయా అనే టెన్షన్ కూడా ఉంటుంది.
ఈ సమస్యకు స్మార్ట్ సొల్యూషన్ కనుక్కొన్నది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD). క్యూఆర్ ఆధారంగా నడిచే ఒక ఫుట్‌వేర్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను పూర్తిస్థాయిలో తిరుమలలో ప్రవేశపెట్టింది.
ప్రయాణికుడుగా చెప్పాలంటే, నేను అనేక ధార్మిక, పర్యాటక క్షేత్రాల్లో ఉండే, బయటికి చెప్పలేని, అలాగని మనసు నుంచి చెరపలేని చెప్పుల సమస్యకు TTD పరిష్కారం చూపించింది. ఇది చాలా మందికి ఉపయోగపడటంతో పాటు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్న వారికి ఒక గైడ్‌లా నిలుస్తుంది.
ముఖ్యాంశాలు
అసలు క్యూఆర్ కోడ్ ఫుట్‌వేర్ కౌంటర్ అంటే ఏంటి? | What is QR Code Footwear Counters
ఇది చెప్పులను దాచుకునే లేదా చెప్పులను పెట్టే ఉచిత వ్యవస్థ. ఇది ఎయిర్‌పోర్టులో లగేజీ కౌంటర్లా వర్క్ అవుతుంది.
ఇక్కడ మీరు మీ చెప్పులు, షూస్ కౌంటర్లో డిపాజిట్ చేస్తారు. తరువాత స్టాఫ్ ఫుట్‌వేర్ వివరాలను డిజిటల్‌గా నమోదు చేస్తాడు. మీకు QR కోడ్ ఉన్న స్లిప్ ఇస్తారు. ఈ స్లిప్‌లో మీ ఫుట్‌వేర్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. అది సిస్టమ్‌లో కూడా స్టోర్ అవుతుంది.
స్లిప్‌లో ఏముంటుంది అంటే:
- ఎన్ని జతలు ఉన్నాయి
- సైజు ఏంటి
- ర్యాక్ నంబర్, బాక్స్ నంబర్
- స్టోరేజ్ ఎగ్జాక్ట్ లొకేషన్
దర్శనం అయ్యాక చెప్పులు వెతకడం, చర్చలు, సెర్చులు ఏమీ ఉండవు. స్కాన్ చేసి చెప్పులు తీసుకుని జేబులో వేసుకుని నడుచుకుంటూ వెళ్లవచ్చు.
- ఇది కూడా చదవండి : ఒకే రోజులో తిరుమల దర్శనం సాధ్యమా? తాజా నియమాలు & పూర్తి గైడ్
ఈ కౌంటర్స్ ఎక్కడ ఉంటాయి? | QR Code Counters Locations
ఈ పాదరక్షకాల కేంద్రాలు తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్నాయి:
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2
- మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్
- ఇంకా 6 ఇతర భక్తుల రద్దీ ఎక్కువ ప్రాంతాలు
దర్శన సమయంలో కౌంటర్‌కు చేరువలో ఉన్న కౌంటర్లోనే చెప్పులు ఇవ్వడం ఉత్తమం.
- తిరుమల తిరుపతి, టిటిడి అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి. అధికారిక సమాచారం, పరిశోధన చేసిన కంటెంట్ , కచ్చితత్వంతో అందిస్తాము.
ఎలా వినియోగించుకోవాలి? | Step-by-Step Usage

- భక్తులు తమకు అనుకూలమైన కౌంటర్ల వద్ద చెప్పులను ఇవ్వాలి.
- వివరాలను ఎంటర్ చేసి QR స్లిప్ పొందండి.
- స్లిప్‌ను జాగ్రత్తగా మీ వద్దే ఉంచండి.
- దర్శనం అయ్యాక కౌంటర్లో స్లిప్ స్కాన్ చేయడం ద్వారా మీ చెప్పులు వెంటనే పొందవచ్చు.
ఎలాంటి ఒత్తిడి, ఆలస్యం లేకుండా జరిగే సింపుల్ ప్రక్రియ ఇది. భక్తులకు బాగా ఉపయోగపడుతుంది.
దీని వల్ల భక్తులకు కలిగే ప్రయోజనాలు ఏంటి? | How it is Useful to Devotees
- ఒకప్పుడు భక్తులు తమ చెప్పులు మిస్ అయ్యేవి అని ఫిర్యాదులు చేసేవారు.
- కొత్త సిస్టమ్ వల్ల పాదరక్షకాలు సేఫ్‌గా భక్తులకు అందుతాయి.
- రద్దీ ఎక్కువ ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
- తిరుమల పరిసర ప్రాంతాలు నీటిగా, క్లీన్‌గా ఉంటాయి.
- భక్తుల సమయం, డబ్బు సేవ్ అవుతుంది. మనసు మొత్తం దర్శనంపై కేంద్రీకృతం అవుతుంది.
- ఇది కూడా చదవండి : తెప్పోత్సవం అంటే ఏంటి? తిరుమలలో ఎప్పుడు జరుగుతుంది? | TTD Teppotsavam Guide
చేయాల్సినవి & చేయకూడనివి | Dos & Don’ts
శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు దర్శనం సమయంలో చేయాల్సినవి & చేయకూడనివి
చేయాల్సినవి:
- QR కోడ్ ఉన్న కౌంటర్లోనే చెప్పులు ఇవ్వండి
- QR స్లిప్ జాగ్రత్తగా ఉంచండి
- కుటుంబంతో వెళ్తే అందరి చెప్పులు ఒకే కౌంటర్లో ఇవ్వడం బెటర్

చేయకూడనివి:
- క్యూలైన్ దగ్గర, రోడ్డుపై చెప్పులు విడదీయకండి
- స్లిప్‌ను మడవడం, నీటిలో తడవడం చేయకండి
- ఇతరుల స్లిప్ తీసుకోవడం లేదా టచ్ చేయకండి
చిన్నమాట
తిరుమల దర్శనం ప్రశాంతమైన ఆధ్యాత్మిక యాత్ర. చిన్న అసౌకర్యం కూడా పెద్ద టెన్షన్‌గా మారుతుంది.ఈ QR Code Footwear System వల్ల భక్తులకు మెరుగైన సౌకర్యం కలుగుతుంది. వారి డబ్బు, టైమ్ సేవ్ అవుతుంది.
మీ తదుపరి శ్రీవారి దర్శనంకి ముందు ఈ విషయాలు తెలుసుకుంటే మరింత సులభంగా, ఆనందంగా ఉంటుంది. మీలా భక్తులు ఎవరైనా ఉంటే ఈ గైడ్ వారితో షేర్ చేయండి.
ప్రయాణికుడి లక్ష్యం: వార్తలను అప్డేట్ చేయడం కాదు, కానీ ప్రయాణాలను సులభంగా, సౌకర్యంగా, సేఫ్‌గా మార్చే సమాచారం, గైడెన్స్ అందించడం.
మీ తిరుమల యాత్రకు ఈ గైడ్ ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
