యూకే వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాలి అనే సామేత లేదు కానీ, ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ దేశం వెళ్లడం అనేది అంత ఖరీదైన వ్యవహారం. దానికి తోడు లేటెస్టుగా వీసా చార్జీలను (UK Visa Fees) పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎవ్వరినీ వదిలేదు అన్నట్టు అనేక వర్గాల ప్రయాణికులపై చార్జీల బాణాలు దూసింది యూకే. పూర్తి వివరాలు…
ముఖ్యాంశాలు
మీరు ప్రయాణికులైనా, విద్యార్థులైనా లేదా ఉద్యోగులైనా యూకే (United Kingdoms) వెళ్లాలని ప్లాన్ చేస్తోంటే ఈ పోస్ట్ మీరు పూర్తిగా చదివి తరువాత మీ వీసా ప్రయత్నాలు కొనసాగించండి. ఎందుకంటే 2025 ఏప్రిల్ నుంచి వీసా ఫీజులను పెంచనున్నట్టు ప్రకటించింది యునైటెడ్ కింగ్డమ్స్. ఈ వీసా పెంపు అందుబాటులోకి వస్తే యూకే వెళ్లడం మరింత ఖర్చుతో కూడుకున్న విషయం అవుతుంది.
కీలక అంశాలు | Key Points In UK Visa Fees
- విజిటర్ వీసా (Visitor Visa) : గతంతో పోల్చితే ఆరు నెలల విజిటింగ్ వీసా కాస్ట్ 10 శాతం పెరుగుతుంది. గతంలో ఇది 115 యూరోలు (రూ.12,000) గా ఉంటే భవిష్యత్తులో అది 127 యూరోలు (రూ.13,000) అవ్వనుంది.
- లాంగ్‌టర్మ్ వీసా కోసం అప్లై చేసే వాళ్లపై కూడా వీసా చార్జీల పిడి పడనుంది.
- రెండేళ్ల వీసా : 432 యూరోల నుంచి (రూ.44,000), 475 యూరోలు (రూ.48,000)కు పెరగనుంది.
- 5 సంవత్సరాల వీసా : 771 యూరోల (రూ.79,000) నుంచి రూ.848 (86,000) వరకు పెరగనుంది.
- 10 సంవత్సరాల వీసా : 963 యూరోల ( రూ.98,000), నుంచి 1,059 (రూ.1,07,000) వరకు పెరగనుంది.
స్టూడెంట్ వీసా : యూకేలో (UK) చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు కూడా పెరిగిన వీసా ఫీజు పిడి నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే స్టూడెంట్ వీసా ఫీజు 7 శాతం మేరా పెరగనుంది.
- గతంలో 490 యూరోలు అంటే రూ.50,000 చెల్లిస్తే సరిపోయేది.
- కానీ భవిష్యత్తులో 524 యూరోలు అంటే రూ.53,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
- వివిధ దేశాల నుంచి వచ్చే యూకే విద్యార్థులు ఈ పెరిగిన ఛార్జీలను భరించక తప్పదు.
- ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేష్ (ETA) : ట్రావెల్ వీసాపై యూకే వెళ్లాలి అనుకునేవారిపై పిడుగుపడేలా ఏకంగా 60 శాతం పీజును పెంచారు. అయితే పర్సెంటేజ్ పరంగా ఇది పెద్దగా అనిపించవచ్చు. కానీ ఎమౌంట్ పరంగా అంత పెద్దగా అనిపించకపోవచ్చు.
- గతంలో 10 యూరోలు (రూ.1,000) ఉంటే, భవిష్యత్తులో 16 యూరోలు (రూ.16,00) చెల్లించాల్సి ఉంటుంది.
- 2025 ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వస్తాయి.
ఎవరిపై ఎలాంటి ప్రభావం పడనుంది అంటే | Impact on Various Groups
- అంతర్జాతీయ విద్యార్థులపై : వీసా ఫీజు పెరగడం వల్ల కొంత మంది విద్యార్థులు యూకేలో విద్యాభ్యాసం చేయడానికి ఆసక్తి చూపించకపోవచ్చు.
- పర్యాటకులు : వీసా ఫీజులో పెరుగుదల అనేది ఎమౌంట్‌ను బట్టి కాకుండా శాతంగా చూస్తే మాత్రం పర్యాకులు కాస్త వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది.
- ఉద్యోగులపై : యూకేలో ఉద్యోగం చేయాలి అనుకునే వారు భవిష్యత్తులో 7 శాతం అదనంగా వీసా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- డబ్బు సంపాదించాలి అంటే డబ్బు ఖర్చు చేయాలి అనుకునే వారు కూడా కాస్త వెనకా ముందూ ఆలోచించాల్సి వస్తుంది.
నిపుణులు ఏమంటున్నారంటే…
పెరిగిన వీసా ఫీజులు (UK Visa Fees Changes) అనేవి యూకే వచ్చి చదువుకోవాలి అనుకువారిని, ట్రావెల్ చేయాలి అనుకునేవారిని ప్రభావితం చేస్తుందని ట్రావెల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇక యూకే వెళ్లాలి అనుకుంటున్న ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ మార్పులను గమనించి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఏమాటకి ఆమాట, అసలే యూకే అనేది చాలా కాస్ట్‌లీ డెస్టినేషన్…దానికి తోడు లేటెస్టుగా పెంచిన వీసా ఫీజులు అనేవి జేబుకు పెద్ద చిల్లునే పెట్టేలా ఉన్నాయి.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.