Nitin Gadkari : శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
Nitin Gadkari : కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. స్వామి వారి దర్శనానికి శుక్రవారం రాత్రి చేరుకున్న ఆయన శనివారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు.
తిరుమల ఆలయ (Tirumala) ప్రాంగణంలో ఆయనకు టిటిడి అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి సహస్త్రనామార్చనలో సతీ సమేతంగా పాల్గొన్న కేంద్ర మంత్రి అనంతరం స్వామి వారిని (Lord Balaji) దర్శించుకున్నారు.
- ఇది కూడా చదవండి : వాట్సాప్లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback
దర్శనం తరువాత రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు వేదాశీర్వచనం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆదనపు ఈఓ మంత్రికి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందించారు.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.