Viral Video : పాకిస్తాన్‌ ప్రయాణికుల వింత అవతారం.. దుప్పట్లను శాలువాలా చుట్టుకుని ఎయిర్‌పోర్ట్ వాక్

షేర్ చేయండి

పాకిస్తాన్‌కు చెందిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట సందడి (Viral Video) చేస్తోంది. ఇందులో పాకిస్తాన్ ప్రయాణికులు వింతైన అవతారంలో దర్శనం ఇస్తారు. అయితే ఇందులో వారు వేసుకుంది ఏ డిజైనర్ ఔట్‌ఫిట్ అని అనుకోండి. విమానంలో అందించే ఎయిర్‌లైన్ బ్లాంకెట్స్‌ను కొట్టేసి వాటిని శరీరానికి చుట్టేసి దర్జాగా ఎయిర్‌పోర్టులోంచి బయటికి వెళ్లారు అని అంటున్నారు నెటిజెన్లు.

వీరి అవతారం చూసి అక్కడి వాళ్లు కూడా నవ్వుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఈ వీడియో హల్‌చల్ చేస్తూ హాస్యాన్ని పుట్టిస్తోంది. 

వీడియోలో ఏముంది ? | Viral Video

ఈ వీడియోలో (Pakistani Airport Viral Video) కొంత మంది ప్రయాణికులు విమానం దిగి ఎయిర్‌పోర్టులోంచి నడుచుకుంటూ వెళ్తుంటారు. వాళ్లంతా కూడా ఒకే రంగు బ్లాంకెట్‌ను శాలువలా ధరించారు. అయితే ఈ బ్లాంకెట్ వచ్చేసి విమానంలో ప్రయాణికులకు ప్రయాణ సమయంలో వినియోగించడానికి మాత్రమే ఇస్తారు. 

కానీ పాకిస్తాన్ ప్రయాణికులు మాత్రం వాటిని తమతో పాటు తీసుకెళ్లారు అంటున్నారు నెటిజెన్లు.  బ్యాగులో అక్కడా ఇక్కడా దాచకుండా డైరక్టుగా ఒంటిపై తొడిగేసుకుని ముందుకు వెళ్లిపోవడంతో నెటిజెన్లు కామెడీ చేస్తున్నారు.

ఈ వీడియోను పాక్ అబర్వర్ అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. 

ఇది ఒక వింత ఘటన కొత మంది పాకిస్తానీ ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో (Pakistan Airport)  విమానంలో ఇచ్చే దుప్పట్లను శాలువల్లా చుట్టుకుని వచ్చారు. ఎయిర్‌పోర్టులోని సాటి  ప్రయాణికులంతా వీరిని వింతగా చూశారని ఈ వీడియో గురించి వివరించాడు సదరు యూజర్.

నెటిజెన్ల రియాక్షన్ 

ఈ వీడియోను 50 వేల మంది చూడగా 13 వేల మంది లైక్ చేశారు. చాలా మంది ప్రయాణికులు ఫ్యాషన్‌సెన్స్‌ను కామెడీగా పొగిడేస్తున్నారు. 

యూజర్లు ఎలా రియాక్ట్ అయ్యారంటే…

Pakistan Airport Viral Video Reactions
నెటిజెన్ల రియాక్షన్ చూడండి
  • దుప్పట్లను దొంగలిస్తుంటే విమాన సిబ్బంది ఎందుకు ఆపలేదు అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
  • మరో యూజర్ వచ్చేసి ఆ బ్లాంకెట్ తీసుకోవాలని నాకు తెలియదు…నెక్ట్స్ టైమ్ తప్పకుండా ట్రై చేస్తాను అని కామెంట్ చేశాడు.
  • వాళ్లు దొంగతనం చేయాలనుకున్నారు చేశారు అని ఒక యూజర్ అంటే వారి గురించి కామెడీ చేయడం ఆపండి విమాన సంస్థే (Airlines) వారికి ఆ బ్లాంకెట్స్ ఇచ్చిందేమో అని ఒక వ్యక్తి సందేహం వ్యక్తం చేశాడు.
  • నిజానికి వాళ్లు టికెట్ చెల్లించి ప్రయాణించారు. అంటే బ్లాంకెట్ వారిదే కదా. సౌదీ విమానాల్లో ప్రయాణకులు కావాంటే బ్లాంకెట్స్ తీసుకువెళ్లవచ్చు అంటారు. ఇది చాలా మందికి తెలియదు అని మరో యూజర్ సపోర్ట్ చేశాడు.
  • Read Also: Window Seat: విమానంలో విండో సీట్ బుక్ చేస్తే గోడ పక్కన కూర్చోబెట్టారు !

ఈ వీడియోలో మరో కోణం | Viral Video

ఈ వీడియోలో కామెడీ యాంగిల్‌తో పాటు మరో యాంగిల్ కూడా ఉంది. కటిక పేదరికంతో ప్రపంచం ముందు అప్పుల కోసం తిరుగుతోంది పాకిస్తాన్ (Poverty in Pakistan) ప్రభుత్వం. ఉద్యోగాలు లేకపోవడంతో, డబ్బులు పుట్టకపోవడంతో అక్కడి ప్రజలు అక్రమంగా నకిలీ డాక్యుమెంట్స్‌తో సౌదీ అరేబియా (Saudi Arabia), థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లున్నారు.

అయితే పాకిస్థానీ ప్రజలు చేస్తున్న మోసాన్ని గుర్తించి వారిని అనేక దేశాలు తిరిగి పంపించేస్తున్నాయి. ఈ దేశాల్లో ఒమాన్, కంబోడియా (Combodia), బ్రహెయిన్, మెక్సికో వంటి దేశాలు కూడా ఉన్నాయి.

ఇదే విషయంపై పలు యూజర్లు కామెంట్ చేశారు

  • కామెంట్ ఎడిట్ చేయండి వారిని సౌదీ నుంచి తిరిగి పంపించారు. వారు అక్రమంగా ఎలా వచ్చారో అలాగే పంపించారు. మధ్యలో చలి ఎక్కువగా ఉంటే వారికి బ్లాంకెట్స్ ఇచ్చారు అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.
  • వీళ్లు సౌదీ జైలు (Saudi Jails) నుంచి బయటికి వచ్చిన ఖైదీలు, సాధారణ ప్రయాణికులు కాదు అని మరో యూజర్ అప్డేట్ చేశాడు.

ఇటీవలే 12 దేశాల్లో అక్రమంగా ప్రవేశించిన, లేదా నేరాలు చేసిన 131 పాకిస్తానీయులను వారి దేశానికి తిరిగి పంపించారు. ఇందులో సౌదీ అరేబియాకు అక్రమంగా వెళ్లి పోలీసులకు దొరికి జైళ్లో శిక్ష అనుభవించిన 74 ఖైదీలు వీరు.

మొత్తానికి పాకిస్తాన్ ప్రయాణికులు అంటే అనేక దేశాలు భయపడే పరిస్థితి ఏర్పడింది. పాకిస్తానీయులకు వీసా ఇచ్చే ముందు ఒకటికి వందసార్లు చెక్ చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్‌కు తనకంటూ ఒక చెత్త పేరును తెచ్చుకుంది. మ

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!