TTD Donation Perks: తిరుమలలో రూ. కోటి విరాళంగా ఇస్తే ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో తెలుసా?
తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి రూ. కోటి విరాళంగా ఇచ్చే (TTD Donation Perks) భక్తులకు ప్రత్యేేక సౌకర్యాలు కల్పిస్తోంది టిటిడి. ఈ మేరకు పూర్తివివరాలతో ఒక ప్రకటన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఏంటో తెలిపి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిచింది.
తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి రూ. కోటి విరాళంగా ఇచ్చే (TTD Donation Perks) భక్తులకు ప్రత్యేేక సౌకర్యాలు కల్పిస్తోంది టిటిడి. ఈ మేరకు పూర్తివివరాలతో ఒక ప్రకటన చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఏంటో తెలిపి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిచింది.
ముఖ్యాంశాలు
ప్రత్యేక సౌకర్యాలు ఇవే | TTD Donations Perks
భక్తులు, రూ. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి సంవత్సరం ఈ సౌకర్యాలను కల్పించనుంది.
- ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజుల బ్రేక్ దర్శనంతో పాటు 4 రోజులు పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామి (Sri Lord Venkateshwara Swamy) వారి దర్శనం చేసుకోవచ్చు.
- దాతలకు 20 చిన్న లడ్డూలు (Tirupati Laddu) , 10 పెద్ద లడ్డూలు, ఒక దుప్పట, ఒక రవికె, 10 మహా ప్రసాదం ప్యాకెట్లు, ఒకసారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను కల్పిస్తారు.
- వీటితో పాటు దాతకు జీవిత కాలంలో ఒకసారి 5 గ్రాముల శ్రీవాారి బంగారు డాలర్ ఇస్తారు. 50 గ్రాముల సిల్వర్ డాలర్ ఇస్తారు. వీటిని పొందేందుకు దాతలు కార్యాలయంలో సరైన ఆధారాలు చూపించాల్పి ఉంటుంది.
- ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
విరాళాలు ఇచ్చే విధానం | How To Donate To Tirumala Lord Balaji

తిరుమల శ్రీవారికి (Lord Venkateshwara) విరాళం ఇవ్వాలి అనుకునే భక్తులు టిటిడి ట్రస్టులకు (TTD Trusts) డొనేట్ చేయవచ్చు. ఇందులో ఉన్న స్కీమ్స్ ఏంటో చూద్దాం.
- కాటేజీ డొనేషన్ స్కీము
- ఎస్వీ ప్రాణదాన ట్రస్టు
- ఎస్వీ విద్యాదాన ట్రస్టు
- బర్డ్ ట్రస్టు
- శ్రీవేంకటేశ్వర అన్నదాన ట్రస్టు
- శ్రీవేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టు
- శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయాస్ ట్రస్టు
- శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు
- శ్రీవాణి ట్రస్టు
- శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టు
- శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదినీ స్కీము
ఈ స్కీములకు భక్తులు విరాళం చెల్లించి సంబంధిత సౌకర్యాలను పొందవచ్చు.
ఆన్లైన్లో | Online Donation To TTD Trust
ఆన్లైన్లో విరాళం ఇవ్వాలి అనుకునే భక్తులు తితిదే వెట్‌సైట్‌ను విజిట్ చేసి డొనేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.
- దీని కోసం మీరు విజిట్ చేయాల్సిన సైట్…
- www.ttddevasthanams.ap.gov.in ( డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. టిటిడీ దేవస్థానమ్స్.ఏపి.గవ్.ఇన్)
- టిటిడి అధికారిక వైబ్‌సైట్ ద్వారానే విరాళాలు అందించండి.
ఆఫ్‌లైన్‌లో | Offline Donations to TTD Trust
ఇక ఆఫ్‌లైన్‌లో డొనేట్ చేయాలి అనుకుంటే ఆలయం ఈవో, టిటిడి పేరిట డి.డి లేదా చెక్ తీసుకుని తిరుమలలో దాతల విభాగంలో (Donor Sell) కు అందజేయాల్సి ఉంటుంది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
