జీవితంలో ఒక్కసారైనా ఈ 7 ప్రదేశాల్లో సూర్యోదయాన్ని చూడాల్సిందే | Best Sunrise Viewpoints
Best Sunrise View Point : సూర్యుడి తొలి కిరణంతో బంగారంలా మెరిసే హిమాలయాల (Himalayas) నుంచి తొలికిరణంతో గులాబి రంగులా మారే ఎడారుల వరకు భారత దేశంలో ఎన్నో బ్యూటిఫుల్ సన్‌రైజ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. అందులో టాప్ 7 ఇవే
ఒక దేశం ఎంత అందంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఆ దేశంలో సూర్యోదయాన్ని చూడాలి. మన దేశంలో కూడా ఎన్నో అద్భుతమైన సన్‌రైజ్ పాయింట్స్ ఉన్నాయి.
- ఇది కూడా చదవండి : Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం
సూర్యుడి తొలి కిరణంతో బంగారంలా మెరిసే హిమాలయాల (Himalayas) నుంచి తొలికిరణంతో గులాబి రంగులా మారే ఎడారుల వరకు భారత దేశంలో ఎన్నో బ్యూటిఫుల్ సన్‌రైజ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. అందులో టాప్ 7 ఇవే
ముందుకు వెళ్లడానికి ముందు : ఇక్కడ రాసింది చదవిన వెంటనే ఫోటో చూసి, క్షణం కళ్లు మూసుకుని ఆ ప్రదేశానికి మీరు వెళ్లినట్టు ఫీల్ అవ్వండి. అక్కడి గాలి మీ ముఖానికి తాకుతున్నట్టు భావించండి. ఇది విజువలైజేషన్. అత్యంత వేగంగా, ఉచితంగా మిమ్మల్ని ఇండియా మొత్తం తిప్పే ఒకే ఒక వ్యక్తి ప్రయాణికుడు (Prayanikudu) అని మీరే అంటారు. Let’s Start..
ముఖ్యాంశాలు
1. వంజంగి | Vanjangi
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరులో (Paderu) ఉన్న అద్భుతమైన వ్యూపాయింట్ వంజంగి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే ఒక ట్రెండింగ్ సన్‌రైజ్ పాయింట్.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts

కొండపై నుంచి సూర్యోదయాన్ని చూసేందుకు ఉదయం 3 గంటలకే కొండ ఎక్కడం మొదలు పెడతారు. ఫుల్ ఇంఫర్మేషన్ కావాలంటే వ్లాగ్ చూడండి.
2. టైగర్ హిల్ | Tiger Hills, Darjeeling
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ (Darjeeling) నుంచి టైగర్ హిల్స్ నుంచి హిమాలయాలను చూడటం, అది కూడా సూర్యోదయం సమయంలో చూడటం అనేది బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియెన్స్.

కాంచెన్‌జంగా (Kanchenjunga) పర్వతంపై పడే తొలి భానుడి కిరణం బంగారం, నారింజ, గులాబి రంగుల్లో మెరవడం అనేది నేచురల్ పెయింటింగ్‌లా అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే
- ఇది కూడా చూడండి : చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్
- ఇది కూడా చదవండి : Oldest Hill Stations : భారత దేశంలో టాప్ 10 అతిపురాత హిల్ స్టేషన్స్ ఇవే!
3.కన్యాకుమారి | Kanyakumari Beach
తమిళనాడులోని కన్యాకుమారి వద్ద బంగాళాఖాతం, అరేబియన్ సముద్రం, హిందూ మహా సముద్రం వంటి మహా సముద్రాల కలయికను చూడవచ్చు.
- ఇది కూడా చదవండి : Ooty Itinerary : 3 రోజుల్లో ఊటిలో ఏ ఏ ప్రాంతాలు కవర్ చేయవచ్చంటే

ఇక్కడ సూర్యోదయాన్ని చూడటం అనేది అద్భుతం కన్నా అదృష్టం అని కూడా చెప్పవచ్చు.
4. వారణాసి ఘాట్స్ | Varanasi Ghats Sunrise

పవిత్ర గంగా నది సాక్షిగా ఉదయించే తొలి కిరణం నీటిపై కదులతూ ఒక సరికొత్త ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తుంది. దీనికి ఉదయం హరతి శబ్దం తోడవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రయాణికుడు అఫిషియల్ హ్యాండిల్లో బ్యూటిఫుల్ రీల్ చూస్తున్నట్టు ఉంటుంది.
5. సందక్ఫూ | Sandakphu
భారత దేశంలో ఇది ఒక ఒక హిడెన్ సన్‌రైజ్ పాయింట్. ఇక్కడ ప్రపంచంలో ఉన్న అత్యంత ఎత్తైన 5 పర్వతాల్లో నాలుగు పర్వతాలైన ఎవరెస్ట్, లోసె (Lhotse), కాంచెన్‌జంగా, మకాలుపై భానుడి కిరణాలు పడటాన్ని మనం డైరక్టుగా చూడవచ్చు. వీటన్నింటినీ కలిపి చూస్తూ బుద్ధుడు విశ్రాంతి తీసుకున్న ఆకారంగా ఉంటుంది.
#theme_pic_India_layers
— docyogi (@docyogi1) July 3, 2025
Sandakphu, West Bengal. pic.twitter.com/v4HkGUS9jV
6. రాన్ ఆఫ్ కచ్ | Rann Of Kutch
గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ అనేది ఉప్పుతో నిండి ఉన్న ఒక ఎడారిలాంటిది. సూర్యోదయం సమయంలో ఇక్కడ ఒక కొత్తరకమైన వెలుగు ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?

తొలికిరణాలు పడిన తరువాత నేల మొత్తం గులాబీ, లావెండర్, బంగారు రంగులగా మారిపోతుంది
7. జైసల్మేర్ | Jaisalmer

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సూర్యుడు కాస్త లేజీగా లేచినా…క్రేజీ వ్యూస్ ఇస్తాడు. ఎడారుల్లో సూర్యోదయం విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు సూర్యుడు ఉదయిస్తుంటాడు సూర్యడి పక్కడే ఒక ఎడారి ఓడ నడుస్తూ ఉంటుంది.
- ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
బోనస్
ఓలి | Auli, Uttarakhand

మీరు బద్రినాథ్‌కు (Badrinath) వెళ్లేమార్గంలో జోషిమఠ్ నుంచి ఓలి వెళ్లవచ్చు.ఇక్కడ భారీ హిమాలయ పర్వతాలపై సూర్యుడి తొలి కిరణాలు పడటాన్ని చూడవచ్చు. వింటర్ ప్రయాణికులకు ఇది అద్భుతమైన స్పాట్.
సూర్యోదయం అనేది ఒక ఈవెంట్ కాదు. అది ఒక బ్యూటిఫుల్ మూమెంట్. సూర్యుడి డిసిప్లిన్‌కు నేచర్ ఇచ్చే కానుక అది. డిసిప్లెన్ ఉంటే నేచర్ మీకు కూడా కానుక ఇస్తుంది. అప్పుడు మీ లైఫ్ సూర్యోదయం కన్నా అందంగా మారుతుంది. థ్యాంక్యూ
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
