NTR District 2 Day Trip : ఎన్టీఆర్ జిల్లా పూర్తి ట్రావెల్ గైడ్, బడ్జెట్ & టిప్స్
NTR District 2 Day Trip: హైదారబాద్ నుంచి విజయవాడకు వెళ్లి లోకల్లో సందర్శనీయ ప్రదేశాలు తిరగాలి అనుకనే వారి కోసం కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, భవానీ ఐలాండ్, ఉండవల్లి గుహలు, రూట్, మ్యాప్, ఎక్కడ ఉండాలి, కంప్లీట్ బడ్జెట్‌తో పాటు మ్యాప్ కూడా ఈ పోస్టులో మీకోసం.
- ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఆలయాలు, రివర్ వ్యస్, గుహలు, ఫేమస్ వీకెండ్ ప్రాంతాలు.
- హైదరాబాద్ నుంచి 2 రోజుల బ్రేక్ కోసం వెతుకుతున్న తెలుగు ప్రయాణికుల (traveler) కోసం ఇది పర్ఫెక్ట్ ప్లాన్.
- దుర్గమ్మ దర్శనం, ఐలాండ్‌లో ఎంజాయ్మెంట్, బ్యారీ వద్ద నైట్ లైఫ్ అన్నీ కవర్ చేసే ట్రిప్ ప్లాన్ ఇది.
- ఈ ట్రావెల్ గైడ్లో రూట్ మ్యాపు, టైమింగ్స్, వసతి, బడ్జెట్ అన్నీ స్పష్టంగా, అందించాను.
ముఖ్యాంశాలు
లొకేషన్ మ్యాప్ | Vijayawada Map
విజయవాడ మ్యాప్ కోసం క్లిక్ చేయండి.
క్విక్ ఫ్యాక్ట్స్ | Quick Facts
- రాష్ట్రం పేరు : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)
- జిల్లా పేరు : విజయవాడ
- ఎప్పుడు వెళ్తే బెటర్ : అక్టోబర్ నుంచి ఫిబ్రవరి
- ఎన్ని రోజులు సరిపోతాయి : 2 రోజులు
- ఈ ప్లాన్ ఎవరికి సెట్ అవుతుంది : ఫ్యామిలీస్ ఫ్రెండ్స్, కపుల్, సోలో ట్రావెలర్స్‌కు
- రద్దీ : వీకెండ్లో ఎక్కువగా ఉంటుంది.
ఏపీ గురించి ప్రతీ ప్రయాణికుడు తెలుసుకోవాల్సిన 5 ఫ్యాక్ట్స్ ఈ రీల్లో
విజయవాడ ఎలా చేరుకోవాలి ? | How to Reach Vijayawada
రోడ్డు మార్గంలో | By Road : మీరు సొంత వాహనంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలి అనుకుంటే సూర్యపేట, కోదాడ మార్గంలో వెళ్లవచ్చు. మొత్తం 280 కిమీ దూరం ప్రయాణించాలి. సుమారు 6 గంటల్లో విజయవాడకు చేరుకోవచ్చు. నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయి కాబట్టి ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుని వెళ్లొచ్చు.
ఒక వేళ మీరు బైక్‌పై (Vijayawada By Bike) వెళ్లాలి అనుకుంటే ఉదయం 4-5 గంటలకు బయల్దేరండి. మధ్యలో బ్రేకులు తీసుకోండి. సేఫ్‌గా తక్కువ వేగంతో వెళ్లండి. మధ్య మధ్యలో నీరు తాగుతూ ఉండంది.
- ఇది కూడా చదవండి : Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు
బండి హైదరాబాద్‌లో స్టార్ట్ అయితే విజయవాడలోనే ఆపుతాను అనే ఆలోచనను పక్కనపెట్టండి. మీతో పాటు బైక్ లేదా కారుకు రెస్ట్ ఇవ్వండి.
బస్సు, ట్రైన్లో | Busses, Trains To Vijayawada : హైదరాబాద్ నుంచి విజయవాడకు చాలా బస్సులు ఉన్నాయి. ఆర్టీసి బస్సులు రోజంతా నడుస్తాయి. ట్రైన్లు కూడా చాలా ఉన్నాయి.
- ప్రతీ 30 నిమిషాలకు ఒక ఆర్టీసి బస్సు ఉంటుంది.
- ట్రైను ప్రయాణానికి సుమారు 6 గంటలు పడుతుంది.
- బస్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోలు, ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉంటాయి.
- విజయవాడలో ఓలా, ఊబర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
టైమింగ్స్
విజయవాడకు స్థానిక జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు.అందుకే వీకెండ్స్‌లో కాకుండా వీక్ డేస్ అంటే సోమవారం నుంచి శుక్రవారం మధ్యలో మీ ట్రిప్ ప్లాన్ చేసుకోండి.
- ఎండాకాలం కాకుండా ఇతర సీజన్లో వెళ్లేందుకు ప్రయత్నించండి. ఒక వేళ వెళ్తే మాత్రం ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మీరు వెళ్లాలి అనుకున్న ప్రదేశానికి వెళ్లొచ్చు.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- ఎండాకాలం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటికి వెళ్లకపోవడం ఉత్తమం.
- విజయవాడ కనక దుర్గమ్మ ఆలయ (Kanaka Durgamma Temple, Vijayawada) దర్శనం కోసం వెళ్తే శనీ ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది అని గుర్తుంచుకోండి.
- ఇక భవానీ ఐల్యాండ్ వెళ్లాలి అనుకుంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విజిట్ చేసేలా చూసుకోండి.
దగ్గర్లో సందర్శనీయ ప్రదేశాలు | Places to visit near vijayawada , NTR District
విజయవాడ అంటే ఎవరికైనా ముందుగా అమ్మవారి ఆలయం కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి (Indrakeeladri) గుర్తొస్తుంది. మీ ట్రావెల్ ప్లాన్‌లో (Travel Plan) కూడా తప్పకుండా ఉండే ఉంటుంది అని అనుకుంటున్నాను.
ఇక అమ్మవారి దర్శనం అనంతరం మీరు ఈ ప్రదేశాలను కూడా విజిట్ చేయవచ్చు.
- దగ్గర్లో ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage ) ఉంటుంది. ఇక్కడికి మీరు పగలు రాత్రి ఎప్పుడైనా వెళ్లవచ్చు. అస్సలు డిసపాయింట్ అవ్వరు.
- ఎందుకంటే పగలు నాచురల్ వ్యూ, రాత్రి లైట్స్‌తో డెకరేట్ అయిన చుట్టు పక్కల ప్రాంతాలు మిమ్మల్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తాయి.
- మీరు ఉండవల్లి గుహాలకు (Undavalli Caves) కూడా వెళ్లవచ్చు.
- గాంధీ హిల్స్ (Gandhi Hills)
- భవానీ ఐలాండ్
- మంగళగిరి ఆలయం (Mangalagiri Temple)
- కొండపల్లి కోట (Kondapalli Fort)
- అమరావతి స్థూపం
- దీంతో పాటు నదీ తీరంలో కూర్చుని లేదా నడుస్తూ రిలాక్స్ అవ్వొచ్చు.
- ఇది కూడా చదవండి : Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
- ఇది కూడా చదవండి : Travel Vlogging Tips : ట్రావెల్ వ్లాగర్ అవ్వాలంటే ఏం చేయాలి ? 10 టిప్స్ !
ఇక హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ చేరుకున్నాక విజయవాడలో రెండు రోజుల్లో ఏమేం చూడాలో ఒకసారి గమనించండి. మీ కోసం క్లియర్ టైమింగ్ కూడా ప్రస్తావిస్తున్నాను. ఏదైనా ఒక యాక్టివిటీ మిస్ అయితే నెక్ట్స్‌కు వెళ్లిపోండి.
మీరు విజయవాడకు చేరుకున్న సమయాన్ని బట్టి ప్లాన్‌లో మార్పులు చేసుకోండి. అది మీ ఇష్టం. కానీ ప్రామాణికంగా ఉండేందుకు ఒక ప్లాన్ ఇస్తున్నాను.
మొదటి రోజు | Day 1 itinerary In Vijayawada

NTR District 2 Day Trip లో మొదటి రోజు మీరు ఆలయ దర్శనం, గుహలను చూడటం, నగర సందర్శనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది.
- ఉదయం 6 గంటలకు : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గమ్మను దర్శించుకోండి.
- ఉ.7.30 నిమిషాలకు : దగ్గర్లో ఉన్న మంచి హోటల్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేయండి.
- ఉ.9 గంటలకు : గాంధి హిల్స్
- ఉ.11 గంటలకు : ఉండవల్లి గుహలు
- మధ్యాహ్నం 2 గం : లోకల్స్ సలహా మేరకు మంచి హోటల్లో లంచ్ చేయండి.
- 4 గంటలకు : మంగళగిరి ఆలయం
- రాత్రి 7.30 ని. : ప్రకాశం బ్యారేజీ నైట్ వ్యూ (Prakasam Barrage Night View)
- రా.9 గం. : నదిని చూస్తూ మీ డిన్నర్ పూర్తి చేయండి.
- ఇది కూడా చదవండి : First time Flyers : ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే
- ఇది కూడా చదవండి : ఏపీ, తెలంగాణలో అతి పెద్ద మామిడిపండ్ల మార్కెట్లు ఏవో తెలుసా? | Mango Markets In Telugu States
రెండవ రోజు | Day 2 In Vijayawada
రెండు రోజుల విజయవాడ ట్రిప్‌లో మొదటి రోజు మీరు మెయిన్ టూరిస్ట్ స్పాట్స్, ఆలయాలను దర్శించుకున్నారు. కదా. ఇక విజయవాడలో మంచి క్రేజ్ ఉన్న ఇతర యాక్టివిటీస్‌పై ఫోకస్ చేద్దాం.

- ఉదయం 8 గం : ముందుగా భవానీ ఐలాండ్ (Bhavani Island) చేరుకోండి. దీని కోసం మీరు ముందు బెర్మ్ పార్క్ (Berm Park) వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి సులభంగా ఐల్యాండ్ చేరుకోవచ్చు.
- ఈ ఐలాండ్‌లో మీరు కాయాకింగ్, జిప్‌లైన్ వంటి యాక్టివిటీస్ చేయవచ్చు.
- మధ్యాహ్నం ఒంటిగంటకు ఐలాండ్‌లోనే లంచ్ చేయండి. కాసేపు రిలాక్స్ అయ్యి ఐలాండ్ నుంచి బయటికి వచ్చేయండి.
- 4 గంటలకు విజయవాడ లోకల్ స్నాక్స్ టేస్ట్ చేయండి.
- సాయంత్రం 5 గంటలకు మంగళగిరి హ్యాండ్లూమ్స్ షాపింగ్ చేయవచ్చు.
ఇక రాత్రి 7 గంటలకు హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ ప్రారంభించండి. మీరు నెక్ట్స్ డే మార్నింగ్ బయల్దేరితే మరీ మంచిది. ఎందుకంటే సెల్ఫ్ డ్రైవింగ్ అనేది రాత్రి సమయంలో అంత కరెక్టు కాదు అని అభిప్రాయం. తరువాత మీ ఇష్టం.
- ఒక వేళ మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో (Vijayawada Publicl Transport) ప్రయాణించాలి అనుకుంటే ట్రైన్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
- అలాగే మీ ప్రయాణం సేఫ్ అండ్ తక్కువ ధరలో జరగాలి అనుకుంటే తెలంగాణ (TSRTC) లేదా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్లో (APSRTC) ప్రయాణించండి.
- ఇది కూడా చదవండి : Horsley Hills : ఆంధ్రా ఊటీకి క్యూ కడుతున్న తెలుగు ప్రయాణికులు
- ఇది కూడా చూడండి : బొర్రా గుహలు ఎక్కడున్నాయి ? ఎలా వెళ్లాయి ?కంప్లీట్ ట్రావెల్ గైడ్ | Borra Caves Travel Guide
ప్రయాణం అనేది జాబ్‌లా చేయకూడదు | Travelling is not Job
NTR District 2-Day Trip: రెండు రోజుల ఈ ట్రావెల్ ప్లాన్‌లో ఎక్కువ మంది వెళ్లే ప్రదేశాలను ప్రదేశాలను ప్రస్తావించాను. ఇందులో మీకు నచ్చిన మార్పులు చేసుకోవచ్చు. అయితే అన్ని ప్రదేశాలు, డెస్టినేష్స్ కవర్ చేయలేము అనిపిస్తే అందులో బెస్ట్‌ను లేదా మీకు నచ్చిన వాటిని ఎంచుకోండి.
గుర్తుంచుకోండి ట్రావెలింగ్ అనేది జాబ్ కాదు. అది ఒక అనుభూతి.
విజయవాడ వెళ్తే అక్కడి లోకల్ ఫుడ్‌ను ఎంజాయ్ చేయకుంటే చాలా చాలా బాగోదు. అందుకే మీరు మీ ప్రయాణాల్లో వీలైనంత వరకు వెరైటీ ఆహార పదార్థాలను (Food) ట్రై చేయండి. అయితే నాణ్యత, ఆరోగ్యం విషయంలో అస్సలు రాజీ పడకండి.
- ఇది కూడా చదవండి : Oldest Hill Stations : భారత దేశంలో టాప్ 10 అతిపురాత హిల్ స్టేషన్స్ ఇవే!
- ఇది కూడా చదవండి : Munnar Guide : సార్, వెళ్దామా మున్నార్ ? 8 డెస్టినేషన్స్ సిద్ధం మాస్టార్!
సిటీలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు మీ కోసం
- స్వీట్ మ్యాజిక్ (Sweet Magic)
- బాబాయ్ హోటల్ (Babai Hotel)
- ఆర్ఆర్ దర్బార్ (RR Darbar)
- మీ ఛాయిస్ (కామెంట్ చేయండి)
- మీ ఛాయిస్ (కామెంట్ చేయండి)
ఇక నదిని చూస్తూ భోజనాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు స్థానిక హరిత బెర్న్ పార్కులో ట్రై చేయవచ్చు.
- ఇది కూడా చూడండి Niagara Falls, మాన్యుమెంట్ వ్యాలీ.. అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్
- ఇది కూడా చూడండిVisa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు
ఎక్కడ ఉండాలి ? | Where To Stay in Vijayawada
విజయవాడ అనేది చాలా పాపులర్ సిటీ. ఇక్కడికి వివిధ జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి అతిథుల రాకపోకలు నడుస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు ఎన్నో వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
- ఏపీ పర్యాటక శాఖ (AP Tourism) నడిపించే హరితా బెర్మ్ పార్కు
- నోవోటెల్ విజయవాడ వరుణ్ : ఇది ప్రీమియం హోటల్. ఖరీదైన వసతి మార్గం.
- ఇక మిడ్ రేంజులో స్టే ఏర్పాటు చేసుకోవాలి అంటే డీవీ మాానోర్ (DV Manor) బాగుంటుంది.
- బడ్జెట్లో కావాలంటే హోటల్ సదరన్ గ్రాండ్ బాగుంటుంది
- హోమ్ స్టేల (Home Stays in Vijayawada) విషయానికి వస్తే ఇక్కడ ఎన్నో కొత్త, పాత హోమ్‌స్టేలు అందుబాటులో ఉన్నాయి.
- నేను ప్రస్తావించిన ఈ హోటల్లతో పాటు మీరు ఆన్లైన్లో కూడా కొన్ని యాప్స్ ద్వారా ఇతర హోటల్స్ ట్రై చేయవచ్చు.
- మీరు గతంలో విజయవాడ వెళ్లి ఉంటే మీ అభిప్రాయం కామెంట్ చేయండి.
- ఇది కూడా చూడండిPlaces Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు
- ఇది కూడా చూడండిమేఘాలయ ఎంత అందంగా ఉంటుందో 10 ఫోటోల్లో మీరు చూసేయవచ్చు
రెండు రోజుల టూరుకు అయ్యే ఖర్చులు | Budget for 2 days Vijayawada Trip
విజయవాడలో రెండు రోజులు పాటు పర్యాటించేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుంటే ఆర్థికంగా ముందుగానే సిద్ధం అయ్యే అవకాశం ఉంటుంద. అందుకే ప్రామాణికంగా తీసుకుని ఈ వివరాలు అందిస్తున్నాను.
ప్రయాణం | Travel Cost :హైదరాబాద్ నుంచి ప్రయాణానికి మీకు బస్సుకు రూ.400 నుంచి 1800 వరకు ఖర్చు అవుతుంది. (ఆర్టీసి బస్సు నుంచి వోల్వో ఇతర ప్రైవేటు బస్సులు కలిపి ఇచ్చాను.).
- ఇక మీరు సొంత వాహనంలో వెళ్తే రూ,1800 వరకు పెట్రోల్ / డీజిల్ వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
వసతి | Stays : ఇక వసతి విషయానికి వస్తే మీ ఆర్థిక స్థోమత, సెలక్షన్‌ను బట్టి రోజుకు రూ.1000 నుంచి 5000 వరకు ఖర్చు అవుతుంది.
- ఇక ఐలాండ్‌లో ఫన్ యాక్టివిటీ కోసం రూ.300-500
- ఇతర ఖర్చులు ఒక రూ.300 వరకు వేసుకోండి.
మొత్తానికి ఒక వ్యక్తికి కనీసం రూ.3000 నుంచి 6000 వరకు ఈ ట్రిప్పు పూర్తి చేసేందుకు ఖర్చు అవుతుంది.
ఎప్పుడు వెళ్లాలి ? | Best Time To Visit Vijayawada
విజయవాడ్ వెళ్లడానికి ముందు అక్కడి వాతావరణం గురించి తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎండాకాలం అక్కడా బాగా వేడిగా ఉంటుంది.
అందుకే మీరు మార్చి నుంచి జూన్ మధ్యలో కాకుండా అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్లలా ప్లాన్ చేసుకోండి. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ప్రయాణికుడు టిప్స్ | Prayanikudu Tips
ఆలయాల నుంచి పార్కుల వరకు వీకెండ్లో అన్ని ప్రదేశాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే శనీ ఆదివారల్లో, పండగ సమయాల్లో కాకుండా సాధారణ రోజుల్లో వెళ్లేందుకు ప్రయత్నించండి.
- గుహల్లో మధ్యాహ్నం సమయంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు ఉదయమే వెళ్లేందుకు ప్రయత్నించండి.
- ఐలాండ్‌లో యాక్టివిటీస్ (Island Activities) ప్లాన్ చేస్తే మీరు ఎక్స్ట్రా బట్టలు, వాటర్‌ఫ్రూప్ పౌచ్ లేదా కవర్ తీసుకెళ్లండి.
- నదీ సమీపంలో ఉంటే మస్కిటో జెల్ క్యారీ చేయండి.
- ఇక బ్యారేజీ వద్దకు వెళ్లి నైట్ వ్యూను అస్సలు మిస్ అవ్వకండి.
సాధారణ ప్రశ్నలు | FAQ’s
ఒక కొత్త ప్రదేశానికి వెళ్లే సమయంలో మనలో చాలా సందేహాలు రావడం కామన్. అందులో కొన్ని…
1. విజయవాడలో ప్రశాతంతమైన వాతావరణం ఉండే సమయం ?
- వాతావరణం ప్రశాతంగా ప్లెజెంట్‌గా ఉండే సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు.
2. హైదరాబాద్ నుంచి విజయవాడ డ్రైవింగ్ సేఫా?
- ముందుగా డ్రైవింగ్‌లో సేఫ్టీ అనేది డ్రైవర్ చేతిలో ఉంటుంది.
- ఇక రెండో విషయం లేన్ నేషనల్ హైవే (NH 65 ) కాబట్టి ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఫ్యామిలీతో కలిసి వెళ్లందుకు పెర్ఫెక్ట్ రోడ్డు ఇది.
3. భవానీ ఐలాండ్‌లో క్యాంపింగ్ ఉందా ?
- లేదు. కేవలం రిసార్టులు, వాటర్ , అడ్వెంచర్ యాక్టివీటీ్ మాత్రమే
ఈ పోస్టులో మీకు ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాయి అనిపిస్తే కామెంట్ చేయండి. అలాగే తెలంగాణ (Telangana), ఏపీ ట్రావెల్ గైడ, టెంపుల్, టూరిజం అప్డేట్స్ కోసం ప్రయాణికుడు తెలుగు ట్రావెల్ బ్లాగ్‌ను తప్పకుండా రోజూ విజిట్ చేయండి. థ్యాంక్యూ
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
