కోహీర్: తెలంగాణలో అత్యంత చల్లని ప్రదేశం | ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ? | Kohir coldest place in Telangana Guide

తెలంగాణలో అత్యంత చల్లిని ప్రదేశాల్లో ఒకటైన కోహిర్ (Kohir coldest place in Telangana) ..ఎవరికీ తెలియని చలి ప్రదేశంలో ప్రయాణికుడు…

తెలంగాణలో కూడా చలి ఉంటుందా ? ఈ డౌట్ మీకొస్తే కోహిర్‌కు వెళ్లండి. ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రత 4.5°C వరకు వెళ్తుంది. జనం ఉండరు, ట్రాఫిక్ ఉండదు. సంగారెడ్డి జిల్లాలో ఉన్న కోహిర్ అనే గ్రామంలో చలికాలంలో రికార్డులు బ్రేక్ చేసే చలి ఉంటుంది అని చాలా మందికి తెలియదు.

ఏంటి… కోహిర్‌లో వింటర్‌లో ఇంత చలి ఉంటుందా అని అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీరు ఉదయం 5:30కి బైక్‌పై హైదరాబాద్ బయల్దేరితే అర్థం అవుతుంది. హిమాలయాల్లో (himalayas) ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి టీ షాప్ ముందు ఉండే మంటల దగ్గర చలికాచుకోవాల్సిందే. ఎందుకంటే ఇటీవల ఇక్కడ 4.5°C వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి (2025 Coldest Place In Telangana).

Kohir coldest place in Telangana
కోహీర్ వికారాబాద్ శంకర్‌పల్లి దారిలో ఉదయానే కనిపించే సీన్

నిజానికి ఇది టూరిస్ట్ స్పాట్ కాదు. నేను జహీరాబాద్‌లో పని ఉండి వెళ్లాను. అదే సమయంలో టెంపరేచర్ చెక్ చేస్తే,నేను ఉన్న ప్రదేశం తెలంగాణలోనే అత్యంత చల్లని ప్రదేశాల్లో ఒకటి అని తెలిసింది. వేరే రాష్ట్రంలో ఉంటే దీనిని టూరిస్ట్ హబ్‌గా మార్చేందుకు ఇప్పటికే ప్లాన్ చేసి ఉండేవాళ్లు.

May be ఏదో ఒక రోజు ఇక్కడ కూడా పర్యాటకం పెరుగుతుందేమో. ఈ బ్లాగ్ వల్ల ఆ ప్రాసెస్ కొంచెం స్పీడ్ అవుతుందేమో అన్న ఆశ.

Kohir Vibe | సింపుల్‌గా బాగుంటుంది.

నిజానికి కోహిర్ అనేది చాలా సింపుల్ ప్రాంతం.

  • పెద్దగా జనం ఉండరు, టూరిస్ట్ డ్రామాలు ఉండవు. చల్లని గాలి ఉంటుంది.
  • దూరం దూరం వరకు పొలాలు ఉంటాయి. ఎర్రమట్టి దిబ్బల్లో బ్యూటి ఉంటుంది.
  • ఒక గ్రామంలో ఉండాల్సినంత ప్రశాంతత ఉంటుంది.

కోహిర్ ఎక్కడ ఉంది? | Where is Kohir?

Kohir is a mandal headquarters village in Sangareddy district, Telangana.

  • హైదరాబాద్ నుంచి సుమారు 90 KM
  • సంగారెడ్డి తర్వాత
  • జహీరాబాద్‌కు ముందు
  • జహీరాబాద్, బీదర్ వెళ్లే రూట్‌లో ఉంటుంది

ఇది ఒక డెస్టినేషన్ కంటే పాస్-త్రూ ప్లేస్ అని చెప్పాలి. అంటే ప్రత్యేకంగా ప్లాన్ చేసి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ముంబై, షిరిడీ, బీదర్, జహీరాబాద్, నుంచి హైదరాబాద్ / సంగారెడ్డి / పటాన్‌చెరు / బీరంగూడ / లింగంపల్లి వైపు వస్తూ కొంచెం సేపు ఆగి ఫీల్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది..

కోహిల్ చలి గురించి | Winter In Kohir

చలికాలంలో:

  • ఉదయం 4:00 నుంచి 6:30 మధ్య
  • ఈ రోడ్డుపై ఉంటే చేతులు గడ్డకట్టిపోతాయి.
  • ఎక్కడ మంట కనిపించినా ఆగి చలికాచుకోవాల్సిందే.
  • ఇటీవల ఇక్కడ 4.5°C – 5°C వరకు టెంపరేచర్ రికార్డు అయింది

అందుకే ఇది Telangana Coldest Places లిస్ట్‌లో తప్పకుండా ఉంటుంది.

ఉదయం పొలాల్లో ఫాగ్, మంచు పొగ, ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించే చలి ఉంటుంది. తెలంగాణలో ఇలాంటి ఫీలింగ్ రావడం అంత ఈజీ కాదు. అందుకే కోహిర్ స్పెషల్.

ఫీల్ అవ్వాల్సిన విషయం .. | Kohir coldest place in Telangana

Kohir the coldest place in telangana (1)
కోహీర్‌లో టీ బాగుంటుంది
  • ఇప్పటివరకు కోహిర్‌పై ఒక్క రీల్ లేదు. ( ఉన్నా అంత పాపులర్ కాలేదేమో)
  • ఒక్క టూరిజం బోర్డు లేదు
  • టాప్ 10 లిస్టుల్లో పేరు లేదు
  • కానీ నెంబర్లు ఇంపార్టెంట్ కాదు.ఫీలింగ్ ముఖ్యం.

కోహిర్ ఎలా వెళ్లాలి? | How to Reach Kohir

Kohir is a village and mandal headquarters located between Sangareddy and Zaheerabad.

  • జాతీయ రహదారి NH-65కి కొద్ది దూరంలో ఉంటుంది
  • ట్రాఫిక్ తక్కువ, లాంగ్ స్ట్రెయిట్ రోడ్స్ ఉంటాయి.
  • పొలాల పక్కనుగా ప్రశాంతమైన డ్రైవ్ ఎంజాయ్ చేయవచ్చు.

ఇక్కడ ఒక డెస్టినేషన్ ఉండదు. అంటే ఇక్కడికి వెళ్లి ఆగాలి, అది చేయాలి ఇది చేయాలి అని..కానీ వెళ్తే మాత్రం మైండ్ రీఫ్రెష్ అవుతుంది.

కోహిర్ మట్టి… ఇక్కడి అల్లం | Kohir Soil, Ginger & Guava

కోహిర్ దక్కన్ పీఠభూమిపై ఉంది.ఇక్కడ మట్టి, రోడ్లు, ఇళ్లు అన్నీ ఎరుపు రంగులో ఉంటాయి. స్థానికుల ప్రకారం Kohir అనే పదానికి అర్థం Red Diamond అని వస్తుందట.

kohir ginger
అంటే అరకు కాఫీ అనేది ఎట్ల ఫేమస్సో…అట్ల కోహీర్ అల్లం అన్నమాట ( ఈ బ్రాండును ప్రమోట్ చేయడం లేదు.. కోహిర్ పదాన్ని హైలైట్ చేస్తున్నాను)

ఈ మట్టిలో నీటిని కలిపితే చాలా స్ట్రాంగ్ మెటీరియల్ మేస్త్రి భాషలో మాల్ రెడీ అవుతుందట. ఆ మట్టితోనే ఠిన వాతావరణాన్ని తట్టుకునే మట్టి ఇళ్లు ఇక్కడ కడతారు. ఇక వ్యవసాయం విషయానికి వస్తే:

kohir guava
కోహీర్ వెళ్లే దారిలో మీకు జామతోటలు కనిపిస్తాయి.
  • గుంటూరులో మిర్చి ఎంత ఫేమస్సో
  • నిజామాబాద్‌లో పసుపు ఎంత ఫేమస్సో
  • కోహిర్ అల్లం కూడా అంతే ఫేమస్
  • ఇక్కడి అల్లాన్ని“Kohir Adrak” అని మార్కెట్లో పిలుస్తారు.
  • కోహిర్ జామకాయలు, మామిడికాయలు కూడా టేస్టీగా ఉంటాయి.
  • రోడ్డుపైనే అమ్ముతారు. వీలైతే ట్రై చేయొచ్చు.
  • ఇది కూడా చదవండి : ఒక్క రోజులో భద్రాచలంలో చూడదగ్గ 7 ప్రదేశాలు | bhadrachalam 7 places in one day

కోహీర్ ఛాయ్ | Kohir Chai ☕

కోహీర్ వస్తే ఇక్కడ పెద్ద హోటల్స్ వెతకకండి. ఇక్కడికి వచ్చే దారిలో ఇక్కడి నుంచి వెళ్తే దారిలో మీకు రోడ్ సైడ్ ధాబాలు, చిన్న హోటల్లు, టీ స్టాల్స్ కనిపిస్తాయి.

స్టీల్ గ్లాసులో వేడి వేడి టీ అందిస్తారు. గ్లాసు స్టీల్‌దా, పేపర్‌దా, గాజుదా అన్నది ఆలోచించే టైం ఉండదు.
చలితో ఫైట్ చేయడమే పని.

ఇక సాయంత్రం అయ్యే సరికి :

దగ్గర్లో చూడాల్సిన ప్రదేశాలు | Place Near Kohir

PLACES NEAR COLDEST PLACE IN TELANGANA KOHIR
కోహిల్ వెళ్దేదారిలో కిషోర్…(PRAYANIKUDU)

కోహిర్ అనేది టూరిస్ట్ స్పాట్ కాదు. మన ఊరులాంటిదే మరో ఊరు ఇది. కానీ ఇక్కడి నుంచి మీరు జహీరాబాద్ (Zahirabad) వెళ్లొచ్చు. చాలా బాగుంటుంది ఈ జర్నీ. 

  • Kohir నుంచి Vikarabad డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవచ్చు.. వికారాబాద్ గురించి తెలుసుకుదా…అరకులో సగం..వికారాబాద్ పోతే గుండె ఆగం అని అంటారు. అంత బాగుంటుంది వికారాబాద్.

మీకు దారి మధ్యలో (ఎటు వెళ్లినా) చాలా గ్రామాలు, పొలాలు, కొన్ని చెరువులు కనిపిస్తాయి. వీటిలో చాలా వాటికి బోర్డులు కూడా ఉండవు. అర్లీ మార్నింగ్ రోడ్లు ఖాళీగా ఉంటాయి. కానీ పొగ మంచు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. 

ఎప్పుడు వెళ్లాలి ? | Best Time To visit

కోహీర్‌లో చలిని ఫీల్ అవ్వాలి అంటే మీరు నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎప్పుడు వెళ్లినా పర్వాలేదు.

అతిగా ఆశపడ్డ టూరిస్టు…అతిగా ఆవేశపడే టూరిస్టు గైడు…

ఏదో ప్రాసకోసం చెప్పాను అంతే. కోహిర్ విషయానికి వస్తే మీరు పెద్ద పెద్ద అంచనాలతో వెళ్లకండి. ఇక్కడ రిసార్టులు, చూడాల్సిన ప్రదేశాల లిస్టు, యాక్టివిటీస్ ఏమీ అంతగా ఉండవు.

  • సిటీ నుంచి లాంగ్ డ్రైవ్ కోసం వెళ్లాలి అది కూడా ఒక కొత్త ప్రదేశంలో అంటే తప్పకుండా ఇక్కడికి వెళ్లొచ్చు.
  • వెళ్లి at Coldest Place in Telangana అని వాట్సాప్ స్టేటస్, లేదా ఇన్‌స్టా రీల్ పెట్టొచ్చు.

ప్రయాణికుడు (Prayanikudu) అంటే కేవలం పాపులర్ డెస్టినేషన్స్ మాత్రమే కవర్ చేస్తాడు అనుకోకండి. నేను ఎక్స్‌పరిమెంట్స్ చాలా చేస్తుంటాను.

  • మీకు నచ్చుతుందో లేదో చిన్న టెన్షన్ ఉన్నా…
  • Kohir Worth A blog and Vlog అనిపించి పోస్ట్ చేశాను.

నాకు బాస్ ఉంటే ఏయ్ వదిలేయ్ అనేవాడేమో…కానీ ఇక్కడ నాకు నేనే బాస్…సో ప్రయాణికుడు కొత్త ప్రదేశాలను వదలడు.

kohir, Telangana Map

“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!