Tokyo వద్దు Kyoto ముద్దు అంటున్న తెలుగు ప్రయాణికులు..ఎందుకో తెలుసా ? | Kyoto Japan Winter Travel Guide
Kyoto Japan Winter Travel Guide : వింటర్లో జీవితం మెల్లగా, చల్లగా ఎంజాయ్ చేయాలంటే Kyoto బాగా సెట్ అవుతుంది. క్యోటో ఎలా వెళ్లాలి ? ప్రశాంతంగా ఎలా ఎంజాయ్ చేయాలి ? తెలుగు వాళ్లు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నారో తెలిపే ఈ చిన్న గైడ్లో మీ కోసం.
Kyoto Japan Winter Travel Guide : వింటర్లో జీవితం మెల్లగా, చల్లగా ఎంజాయ్ చేయాలంటే Kyoto బాగా సెట్ అవుతుంది. క్యోటో ఎలా వెళ్లాలి ? ప్రశాంతంగా ఎలా ఎంజాయ్ చేయాలి ? తెలుగు వాళ్లు ఎందుకు ఇక్కడికి వెళ్తున్నారో తెలిపే ఈ చిన్న గైడ్లో మీ కోసం.
జపాన్ రాజధాని టోక్యో(Tokyo ). కానీ ఇప్పుడు మనం టూరిస్టుల మనసులను కొల్లగొట్టే Kyoto city గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా చలికాలంలో Kyotoలో ఆలయాలు, మంచు, గార్డెన్లు, అన్ని కూడా చాలా అందంగా కనిపిస్తాయి.
క్యోటోలో అనువణువునా చరిత్ర తాలూకు లక్షణాలు కనిపిస్తాయి. ఇక్కడి వెళ్లే ప్రయాణికులు చాలా మంది మార్నింగ్ వాక్ చేయడాన్ని అస్సలు మిస్ చేయరు.
- ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
ముఖ్యాంశాలు
రాజుల కాలం రాజధాని | Kyoto History
క్యోటో రాజుల కాలంలో జపాన్ (Japan) రాజధాని. చలికాలం ఇది వింటర్ వండర్లాండ్‌లా మారిపోతుంది. వెదురుతో నిర్మించిన ఆలయాలపై, నడవడానికి అప్పట్లో ఏర్పాటు చేసిన రాతి రోడ్లపై సన్నని మంచు పొరలుగా పడి అందంగా కనిపిస్తుంది.
- ఈ నగరం కొన్ని శతాబ్దాలుగా తమ వారసత్వాన్ని అలాగే కాపాడుతూ వస్తోంది.
- అందుకే ఇక్కడికి వస్తే టైమ్ మిషన్‌లో వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తుంది అని కొంత మంది ప్రయాణికులు అంటారు.
- ఇది కూడా చదవండి : Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం
తత్వవేత్తల తొవ్వ 😆 | Kyoto Japan Winter Travel Guide
క్యోటో వీధుల్లో చాలా తత్వవేత్తలు నడిచిన దారుల్లో మీరు కూడా నడవవచ్చు. ఆ తొవ్వలో నడుస్తూ జీవిత తత్వం బోధపడుతుందేమో ట్రై చేయండి. జస్ట్ జోకింగ్.

చిన్న చిన్న సెలయర్లు, అందమైన దారులను కవర్ చేస్తూ అక్కడి టీ హౌసుల్లో ఉదయమే వేడివేడి ఛాయ్ తాగుతూ ప్రయాణికులు తమ మెమోరీస్‌ను సేవ్ చేసుకుంటారు.
ఇక్కడ Matcha అనే జపానీస్ గ్రీన్‌టీతో పాటు ట్రెడిషనల్ స్వీట్స్ కూడా సర్వ్ చేస్తారు.
ఉదయమే సాధువులు తమ మార్నింగ్ రిచువల్స్ పూర్తి చేసుకుంటే, స్థానికులు భక్తితో ఆలయాలను శుభ్రం చేస్తారు.
సూర్యోదయం సమయంలో ఆకాశం బంగారు రంగులో మెరిస్తే నేలంతా కిరణాలతో తడుస్తుంది. (కొత్తగా ట్రై చేశాను)
- ఇది కూడా చదవండి : భారతీయులను 11 కారణాలతో ఆయస్కాంతంలా లాగేస్తున్న థాయ్‌లాండ్
జపాన్ ఆలయాలు ⛩️ | Famous Shrines In Kyoto Japan

క్యోటోలో Fushimi Inari, Kinkaku-ji, Ginkaku-ji వంటి పురాతన ఆలయాలు మనం టీవీలో చూసే ట్రెడిషనల్ ఆలయాలను మించి ఉంటాయి. అలాగే ఆలయాలకు ముందు నిర్మించే Torii Gates ( చూటానికి ఈ ఇమోజీలా ⛩️ ఉంటుంది) ఉదయానే గోల్డెన్ కలర్ స్కై వల్ల మెరిసిపోతాయి.
దూరంగా కనిపించే మంచు దుప్పటిలో పర్వతాలు అందానికి మరింత వన్నె తెస్తాయి. ఇక్కడ ఎప్పుడు వెళ్లినా సీజనల్ ఫ్రూట్స్, స్థానికులు తయారు చేసే వంటకాలను ఆస్వాదించవచ్చు.
ముఖ్యంగా Setsubun వేడుక సమయంలో వెళ్తే పైసా వసూల్ అనుభవం పొందవచ్చు.
- ఇది కూడా చదవండి : Japanese Restaurant : హైదరాబాద్‌లోనే జపాన్ టేస్టీ ఫుడ్.. బేగంపేటలో ఆహారప్రియులను ఆకట్టుకుంటున్న కొత్త రెస్టారెంట్
తెలుగు ఫ్యామిలీస్ గైడ్ | Telugu Families Guide to Kyoto
- Flights: హైదరాబాద్ నుంచి Kansai Airportకు వయా ముంబై లేదా ఢిల్లీలో వెళ్లి వచ్చు. Layoversతో కలిపి సుమారు 10–12 గంటల ప్రయాణం ఉంటుంది.
- Local Transport: Haruka Express Trainలో ప్రయాణించి 75 నిమిషాల్లో Kyoto చేరుకోవచ్చు. లేదంటే బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు. రోడ్డులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. Subway, bus stands కనుక్కోవడం సులభం.
- Stay (ఎక్కడ ఉండాలి): Gion / Central Kyoto ప్రాంతాల్లో అందుబాటు ధరలో హోటల్స్ లభిస్తాయి.
- Winter Tips: Light jackets, waterproof shoes తీసుకెళ్లండి.
- Entry Fees: ఆలయాల్లో ఎంట్రీ దాదాపు ఉచితం; కొన్ని గార్డెన్స్‌లోపలికి వెళ్లేందుకు రూ.500–700 ఫీజు ఉంటుంది.
- క్యోటో గురించి మరింత సమాచారం కోసం Kyoto Tourism Official Site Visit చేయండి.
- ఇది కూడా చదవండి : ఏంటి జపాన్ మరీ ఇంత శుభ్రంగా ఉంటుందా ? | తెల్ల సాక్సులతో నడిచిన వ్లాగర్
వింటర్లో జీవితం మెల్లగా, చల్లగా ఎంజాయ్ చేయాలంటే Kyoto మీకు బాగా సెట్ అవుతుంది. జీవితాన్ని వేగంగా కాకుండా అర్థవంతంగా జీవించాలి అనుకునే వారికి ఈ ప్రదేశం సరిగ్గా సరిపోతుంది. అందుకే చాలా మంది Telugu travellers Tokyo కంటే Kyotoకే preference ఇస్తున్నారు.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
