ఇరాన్ ఎయిర్‌స్పేస్ మూసివేత…తెలుగు ప్రయాణికులపై ప్రభావమెంత? | Iran Airspace Closure Air India Indigo Flight Delays
Iran airspace closure air india indigo flight delays : ఇరాన్లో గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో వంటి కొన్ని అంతర్జాతీయ విమానాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ సంస్థలు ట్రావెల్ అడ్వైజరీలు (సూచనలు) జారీ చేశాయి.
ముఖ్యాంశాలు
ఎయిర్ ఇండియా అడ్వైజరీ | Air India Advisory
ఎయిర్ ఇండియా ప్రకారం, సాధారణంగా ఇరాన్ గగనతలంలో ప్రయాణించే విమానాలు ఇకపై ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. దీని వల్ల ట్రావెల్ టైమ్ పెరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో రీరూటింగ్, అంటే మరో మార్గంలో వెళ్లే అవకాశం లేకపోతే ఫ్లైట్స్ కేన్సిల్ కావచ్చు అని ఎయిర్ ఇండియా క్లియర్‌గా తెలిపింది.
Tip: ఎయిర్ ఇండియాలో ప్రయాణించేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందు సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా యాప్‌లో ఫ్లైట్ స్టేటస్ చెక్ చేయండి. మీరు వెళ్లే మార్గం లేదా ఫ్లైట్‌కు సంబంధించిన ఏమైనా మార్పులు ఉన్నాయా అని ముందే తెలుసుకోండి.
#TravelAdvisory
— Air India (@airindia) January 15, 2026
Due to the emerging situation in Iran, the subsequent closure of its airspace, and in view of the safety of our passengers, Air India flights overflying the region are now using an alternative routing, which may lead to delays. Some Air India flights where…
ఇండిగో సూచనలు | IndiGo Travel Advisory
ఇండిగో కూడా దాదాపు ఇలాంటి సూచనలతోనే ఒక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్ ఎయిర్‌స్పేస్ క్లోజర్ వల్ల కొన్ని అంతర్జాతీయ సర్వీసులు ప్రభావితం అవుతాయని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది విమానయాన సంస్థల నియంత్రణలో ఉండదని, దీనివల్ల ప్రభావితమైన ప్రయాణికులకు రీబుకింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పింది.
ఏంటి పరిస్థితి? | Iran airspace closure air india indigo flight delays
ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా–యూరప్, ఇండియా–నార్త్ అమెరికా రూట్స్‌లో ఫ్లైట్స్ ఆపరేట్ అవుతున్నాయి. కానీ, దారి మళ్లింపు వల్ల ప్రయాణ కాలం పెరగొచ్చు. ఫ్లైట్ టైమింగ్స్‌లో కూడా మార్పులు ఉండొచ్చు.
ప్రయాణికులు ఇప్పుడు ఏం చేయాలి? | What Travelers Should Do Now?

- మీ ప్రయాణానికి ముందు విమానయాన సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా యాప్‌లో ఫ్లైట్ స్టేటస్ చెక్ చేయండి
- ప్రభావిత రూట్స్‌లో ప్రయాణిస్తే ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉందని గమనించండి
- కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటే బఫర్ టైమ్ ఎక్కువగా ప్లాన్ చేయండి
- రీబుకింగ్, రీషెడ్యూల్ కోసం ఎయిర్‌లైన్ పోర్టల్స్ వినియోగించండి
- అంతర్జాతీయ ప్రయాణాలు ఉంటే ఎయిర్‌పోర్టుకు ముందుగానే చేరుకోండి
- Read More : ఫ్లైట్ టికెట్స్ చవకగా బుక్ చేసుకోవడానికి 14 సీక్రెట్ టిప్స్..ఎవ్వరికీ చెప్పకండి ! Flight Ticket Booking Hacks
ఎవరు కేర్‌ఫుల్‌గా ఉండాలి? | Who Should Be Extra Careful
ఈ రోజు లేదా రాబోయే 48 గంటల్లో ప్రయాణాలు చేసే వ్యక్తులు, టైట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ షెడ్యూల్స్ ఉన్న ప్రయాణికులు, కుటుంబ సభ్యులు, పిల్లలు, సీనియర్ సిటిజెన్లతో పాటు ప్రయాణించే వాళ్లు, లాంగ్ హాల్ జర్నీలు చేసేవాళ్లు మరింత కేర్‌ఫుల్‌గా ఉండాలి.
ఎవరు రిలాక్స్‌గా ఉండొచ్చు? | Who Can Stay Relatively Relaxed
వెంటనే కాకుండా కొన్ని రోజుల తర్వాత ప్రయాణాలు చేసే వాళ్లు, ఫ్లెక్సిబుల్ లేదా రిఫండబుల్ టికెట్లు ఉన్న ప్రయాణికులు, ఈ రూట్స్‌లో ప్రయాణించని వారు రిలాక్స్‌గా ఉండొచ్చు.
- ఇది కూడా చదవండి : విమానంలో Airplane Mode ఎందుకు ఆన్ చేయాలి ? లేదంటే ఏం జరుగుతుంది ?
తెలుగు ప్రయాణికులపై దీని ప్రభావమెంత ? Impact on Telugu Travelers
ఇరాన్ ఎయిర్‌స్పేస్ క్లోజ్ అవడం వల్ల తెలుగు రాష్ట్రాల నుంచి ఐరోపా దేశాలు, నార్త్ అమెరికాకు వెళ్లే కొన్ని అంతర్జాతీయ విమానాలు రూట్స్ మారుతాయి. రీరూటింగ్ అంటారు కదా అదే జరుగుతోంది. దీని వల్ల ట్రావెల్ టైమ్ కొంచెం పెరిగే అవకాశం ఉంది.
- కొందరు ప్రయాణికుల ఫ్లైట్ టైమింగ్ ఛేంజ్ అయ్యే అవకాశం ఉంది.
- ఫ్లైట్ కేన్సిల్ కూడా అవ్వొచ్చు…కానీ ఇది అరుదుగా జరిగే అవకాశం ఉంది.
- ఇది డెస్టినేషన్ బ్యాన్కాదు..జస్ట్ రూట్ ఛేంజ్ అంతే.
- సో తెలుగు ప్రయాణికులు తమన ప్రయాణాలు ప్లాన్ చేసే ముందు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేయండి
ట్రావెల్ అడ్వైజరీ సారాంశం | Quick Travel Advisory Summary
ఇది కేవలం ఒక రూట్-లెవల్ ఇష్యూ. అంటే మనం వెళ్లాల్సిన గల్లీ బ్లాక్ అయితే ఇంకో గల్లీ నుంచి వెళ్లినట్లే. విమానయాన సంస్థలు కూడా అదే ప్లాన్ చేస్తున్నాయి. ఇంకో “ఆకాశ గల్లీ” నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. అది సాధ్యంకాకపోతే జర్నీ కేన్సిల్ చేయొచ్చు లేదా రీబుకింగ్, రీషెడ్యూల్ ఆప్షన్లు ఇస్తున్నాయి.
లేదా రూట్ మారితే టైమ్ ఎక్కువ పడొచ్చని ముందే చెబుతున్నాయి. కాబట్టి ప్రయాణాలు ప్లాన్ చేసుకునే ముందు అప్డేట్స్ చెక్ చేయండి అని సూచిస్తున్నాయి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
